రచయిత వివరాలు

పూర్తిపేరు: స్వర్ణలత గొట్టిముక్కల
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

లేనిపోని శక్తి సామర్థ్యాలను
నెత్తిన రుద్దించుకుని
చిరునవ్వు మాయని
చేవలేని మనిషిలా
నిమిత్తమాత్రంగా
దొర్లుతుంటుంది.

కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు

నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు

ముళ్ళపొదల గాయాలను
తడుముకుంటూ
ముందడుగు వేస్తున్నపుడు
సుదూరాన వ్యక్తావ్యక్తమై
ఉద్విగ్నతను కలిగిస్తున్న
ఆ మలుపు
ఎందుకు?

ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం

హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం

నిజానికీ అబద్ధానికీ మధ్య
సరిహద్దును గమనించలేనపుడు
నిజంగానే ఓ గట్టి ఆలోచన చేయవలసిందే

తల్లడిల్లే హృదయానికి
ఏ ఆలంబనా లేనపుడు
నిను బ్రతికించే నిర్ణయమూ తీసికోవలసిందే