నిన్న, జూలై నెల “ఈమాట” అంతర్జాల పత్రిక పుటలు చూస్తూవుంటే ఈ “కాలరేఖ” కథ కనిపించింది.
అప్పుడు చదవలేదు.
చదవాలనిపించలేదు.
తెల్లదొర ఫొటోతో తెలుగు కథ (ఫోటో కింద ఆ మనిషి పేరు కనిపించలేదు), అదీ సైన్స్ నేపథ్యం తో … ఇప్పుడు వద్దులే అని చదవకుండా దాటేసాను. మళ్లీ చూద్దాంలే అనుకున్నాను.
ఇంకేదో పరిశోధనా వ్యాసం వ్రాసుకుంటున్నప్పుడు అసంకల్పితంగా ఆ “తెల్లదొర ఫోటో “ పీటర్ హిగ్గ్స్ మహాశయుడిది కదా? అని స్ఫురించింది.
అదే సమయంలో మిత్రులు (మెడికో) శ్యామ్ లంకె పంపి “కాలరేఖ” కథ చదవమన్నారు. కాలయాపన చెయ్యకుండా మరోమారు అంతర్జాల పుటను వెతికి పట్టుకుని కథను పూర్తిగా చదివాను.
చివరాఖరుకు వచ్చాక అర్ధమయ్యింది ఇది faction అని (fact+fiction = faction). అటుపై మళ్లీ, మళ్లీ, నా పరిశోధకుడి పద్ధతి లో చదివాను నాలుగు మార్లు.
తెలుగులో సైన్స్ ను ముఖ్యంగా గణితం-భౌతిక శాస్త్రం-ఖగోళ శాస్త్రాలను (mathematics-physics-astronomy) ఆధ్యాత్మికతతో మేళవించి ఇలా ఓ “faction” కథ వ్రాయడం – ఒప్పించేటట్టు వ్రాయగలగడం – అంటే సాధారణ విషయమేమి కాదు – మెచ్చుకోదగ్గ సాహసమే!
నేను సంధ్యావందనం అయ్యాక, అనుష్ఠానంలో భాగంగా చెప్పుకునే ఋగ్వేదాంతర్గతమైన నాసదీయసూక్తం, దాని భావార్థం యొక్క ఘనత, … కార్ల్ సేగన్ తన కాస్మాస్ పుస్తకంలో, టీవీ సీరీస్ లో సృష్టి ప్రారంభం, దాని పూర్వ స్థితి గురించి భారతీయ ఋషుల శాస్త్రీయమైన ఆలోచనా విధానం:
నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీం॒ నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్
.
Then even nothingness was not, nor existence,
Whence all creation had its origin,
he, whether he fashioned it or whether he did not,
he, who surveys it all from highest heaven,
he knows – or maybe even he does not know.
(English translation by A.L. Basham from his book “The Wonder that was India)
గురించి మాటల్లో, దృశ్యాలుగా విశ్లేషించిన తీరు;
“తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెనో..
సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెనో..
ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెనో..
భీకరాగాథ దుర్లోక పాతాళ గహ్వర సీమనెవడు కల్పన చేసెనో
పటుశైల భేదనోద్భట పాటవమ్ము నిర్ఝరులకు ఏ అజ్ఞాత శక్తి ఒసంగునో..
ఏ మహాగాథ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరంగాళి పొంగెత్తునో..
విద్యుల్లతా స్ఫీత జీమూత నిర్ఘోష భూతవిక్షేపము యే ప్రభువు శాసించునో …
ఈ మహా బ్రహ్మాండమెవరి నిర్మాణమో…
1947 యోగి వేమన చిత్రంలో సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) పద్యం భావార్థం యొక్క యాదీలు;
వెరసి ఒక చక్కటి తెలుగు కథ చదివిన అనుభూతి కలిగింది.
కథను డౌన్లోడ్ చెసి దాచుకున్నాను.
ఇంత అద్భుతమైన కథ వ్రాసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి గారికి నమస్సులు!
ఛందశ్శాస్త్రంలో మీ అపార పాండిత్యమునకు శతాధిక వందనాలు. ఛందస్సు ఒక సముద్రమైతే దానిలో ఆసాంతము ఓలలాడుతున్నవారు జెజ్జాల కృష్ణ మోహన్ గారు. వారికి నా నమస్కారములు🙏🙏 వాయిస్ క్లిప్ play కావటంలేదండి. దయచేసి “లక్ష్మణుని జాగారము” మీ గానము నాకు పంపగలరు. నా దూరవాణి/వాట్సాప్ నం.8919800447. మీ సమాచారమంతా ఉంది కాని ఫోన్ నం. లేదు
నాలుగైదు కతలు గీకినవి అచ్చోసుకుని తిరిగాకా, నా కతలు మళ్ళీ చదువుకొని పక్కనబెట్టి కాస్త మంచి సాహిత్యం అనుకున్నది చదివి, తరువాత ఇదే ప్రశ్న వేసుకున్నాను. ఈ విషయమై ఓ వ్యాసం మంచిగా రాయగలిగిన స్పృహ, సామర్థ్యం ఉండి నేను రాసుకుంటే, అది ఇలాగే ఉండేదనిపిస్తోంది.
మంచి దృక్పథానికి వ్యాసరూపం ఇచ్చిన మీకు అభినందనలు.
రాజా.
Great fictional writing! Without the disclaimer at the end, I was going to believe that the story was real. I love the way it was weaved with reality, science and Hinduism! Thoroughly enjoyed it!
కాలరేఖ
గురించి Srirama murty bhattiprolu అభిప్రాయం:
07/02/2022
3:33 am
చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం. వివరణ విస్త్రుతంగా ఉంది. బాగుంది.
అర్బత్ నాటు, రొక్కటం పదాలు తొలిసారి చదివాను. ఏ ఉత్తరాంధ్ర కథల్లోనూ చదివిన జ్ఞాపకం లేదు. ఫోర్క్ కు తెలుగు ‘ముళ్ళచెంచా’ బాగుంది.
ఊహలకు అప్పుడే రొక్కటం వస్తే ఎలా? ఇంకెన్ని ఊహలు ఊరాలో!!
చాగంటి తులసి గారికి అభినందనలు.
మీ అనువాదం చాలా బాగుంది
ఆసాంతం కుతూహలం కొనసాగేట్టు అనువదించారు.
హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 14
గురించి చోడవరపు వెంకట లక్ష్మి అభిప్రాయం:
07/01/2022
9:36 am
మర్చిపోయిన, మరుగున పడిన జ్ఞాపకాలు నా మదిలో ఒక్కసారి తొంగి చూసాయి. బామ్మ, గ్లాస్కో పంచ మండువా అన్నీ కళ్ళల్లో కదిలాయి. నిజమే, ఎంత గుట్టుగా నాటి జీవితాలు సాగాయో. చక్కని ఊహల ఊట ఊరింది మదిలో. బంధాలకి, అనుబంధాలకు వచ్చిన రొక్కటం గుర్తు వచ్చి గుండెల్లో ముల్లు గుచ్చుకుంది. తులసమ్మ గారు చెప్పే కధలు జీవితంలో ఎప్పుడు నిలిచి మంచి సందేశం అందిస్తాయి 👏👏👏
కాలరేఖ గురించి అల్లాడి మోహన్ అభిప్రాయం:
07/03/2022 10:05 pm
నిన్న, జూలై నెల “ఈమాట” అంతర్జాల పత్రిక పుటలు చూస్తూవుంటే ఈ “కాలరేఖ” కథ కనిపించింది.
అప్పుడు చదవలేదు.
చదవాలనిపించలేదు.
తెల్లదొర ఫొటోతో తెలుగు కథ (ఫోటో కింద ఆ మనిషి పేరు కనిపించలేదు), అదీ సైన్స్ నేపథ్యం తో … ఇప్పుడు వద్దులే అని చదవకుండా దాటేసాను. మళ్లీ చూద్దాంలే అనుకున్నాను.
ఇంకేదో పరిశోధనా వ్యాసం వ్రాసుకుంటున్నప్పుడు అసంకల్పితంగా ఆ “తెల్లదొర ఫోటో “ పీటర్ హిగ్గ్స్ మహాశయుడిది కదా? అని స్ఫురించింది.
అదే సమయంలో మిత్రులు (మెడికో) శ్యామ్ లంకె పంపి “కాలరేఖ” కథ చదవమన్నారు. కాలయాపన చెయ్యకుండా మరోమారు అంతర్జాల పుటను వెతికి పట్టుకుని కథను పూర్తిగా చదివాను.
చివరాఖరుకు వచ్చాక అర్ధమయ్యింది ఇది faction అని (fact+fiction = faction). అటుపై మళ్లీ, మళ్లీ, నా పరిశోధకుడి పద్ధతి లో చదివాను నాలుగు మార్లు.
తెలుగులో సైన్స్ ను ముఖ్యంగా గణితం-భౌతిక శాస్త్రం-ఖగోళ శాస్త్రాలను (mathematics-physics-astronomy) ఆధ్యాత్మికతతో మేళవించి ఇలా ఓ “faction” కథ వ్రాయడం – ఒప్పించేటట్టు వ్రాయగలగడం – అంటే సాధారణ విషయమేమి కాదు – మెచ్చుకోదగ్గ సాహసమే!
నేను సంధ్యావందనం అయ్యాక, అనుష్ఠానంలో భాగంగా చెప్పుకునే ఋగ్వేదాంతర్గతమైన నాసదీయసూక్తం, దాని భావార్థం యొక్క ఘనత, … కార్ల్ సేగన్ తన కాస్మాస్ పుస్తకంలో, టీవీ సీరీస్ లో సృష్టి ప్రారంభం, దాని పూర్వ స్థితి గురించి భారతీయ ఋషుల శాస్త్రీయమైన ఆలోచనా విధానం:
నాస॑దాసీ॒న్నో సదా॑సీత్త॒దానీం॒ నాసీ॒ద్రజో॒ నో వ్యో॑మా ప॒రో యత్
.
Then even nothingness was not, nor existence,
…
ఇ॒యం విసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న .
యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మ॒న్సో అం॒గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ .. 7..
Whence all creation had its origin,
he, whether he fashioned it or whether he did not,
he, who surveys it all from highest heaven,
he knows – or maybe even he does not know.
(English translation by A.L. Basham from his book “The Wonder that was India)
గురించి మాటల్లో, దృశ్యాలుగా విశ్లేషించిన తీరు;
“తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి ఏ బుద్ధిశాలి భావించెనో..
సాంద్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహామహుడు సృష్టించెనో..
ఆకాశచుంబి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించెనో..
భీకరాగాథ దుర్లోక పాతాళ గహ్వర సీమనెవడు కల్పన చేసెనో
పటుశైల భేదనోద్భట పాటవమ్ము నిర్ఝరులకు ఏ అజ్ఞాత శక్తి ఒసంగునో..
ఏ మహాగాథ పాతాళ గర్భము నుండి ఈ నిరంతర తరంగాళి పొంగెత్తునో..
విద్యుల్లతా స్ఫీత జీమూత నిర్ఘోష భూతవిక్షేపము యే ప్రభువు శాసించునో …
ఈ మహా బ్రహ్మాండమెవరి నిర్మాణమో…
1947 యోగి వేమన చిత్రంలో సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) పద్యం భావార్థం యొక్క యాదీలు;
వెరసి ఒక చక్కటి తెలుగు కథ చదివిన అనుభూతి కలిగింది.
కథను డౌన్లోడ్ చెసి దాచుకున్నాను.
ఇంత అద్భుతమైన కథ వ్రాసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి గారికి నమస్సులు!
లక్ష్మణుని జాగారము గురించి తాడిచెర్ల రవి అభిప్రాయం:
07/03/2022 7:45 pm
ఛందశ్శాస్త్రంలో మీ అపార పాండిత్యమునకు శతాధిక వందనాలు. ఛందస్సు ఒక సముద్రమైతే దానిలో ఆసాంతము ఓలలాడుతున్నవారు జెజ్జాల కృష్ణ మోహన్ గారు. వారికి నా నమస్కారములు🙏🙏 వాయిస్ క్లిప్ play కావటంలేదండి. దయచేసి “లక్ష్మణుని జాగారము” మీ గానము నాకు పంపగలరు. నా దూరవాణి/వాట్సాప్ నం.8919800447. మీ సమాచారమంతా ఉంది కాని ఫోన్ నం. లేదు
కలలు రాని నిద్ర గురించి శారద అభిప్రాయం:
07/03/2022 3:46 pm
ధన్యవాదాలు మూర్తి గారు.
లక్ష్మణుని జాగారము గురించి Lakshminarayanamurty Ganti అభిప్రాయం:
07/02/2022 9:30 pm
అద్భుతమైన రచన. తెలుగు సాహిత్యంలో మరోసారి మెరిసిన స్త్రీలపాటల బాణీ. నలువరాణి వాణి.
జులై 2022 గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
07/02/2022 9:15 pm
నాలుగైదు కతలు గీకినవి అచ్చోసుకుని తిరిగాకా, నా కతలు మళ్ళీ చదువుకొని పక్కనబెట్టి కాస్త మంచి సాహిత్యం అనుకున్నది చదివి, తరువాత ఇదే ప్రశ్న వేసుకున్నాను. ఈ విషయమై ఓ వ్యాసం మంచిగా రాయగలిగిన స్పృహ, సామర్థ్యం ఉండి నేను రాసుకుంటే, అది ఇలాగే ఉండేదనిపిస్తోంది.
మంచి దృక్పథానికి వ్యాసరూపం ఇచ్చిన మీకు అభినందనలు.
రాజా.
కాలరేఖ గురించి Srikanth N అభిప్రాయం:
07/02/2022 10:07 am
Great fictional writing! Without the disclaimer at the end, I was going to believe that the story was real. I love the way it was weaved with reality, science and Hinduism! Thoroughly enjoyed it!
కాలరేఖ గురించి Srirama murty bhattiprolu అభిప్రాయం:
07/02/2022 3:33 am
చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం. వివరణ విస్త్రుతంగా ఉంది. బాగుంది.
ఊహల ఊట 14 గురించి పాలగిరి విశ్వప్రసాద్ అభిప్రాయం:
07/01/2022 9:19 pm
అర్బత్ నాటు, రొక్కటం పదాలు తొలిసారి చదివాను. ఏ ఉత్తరాంధ్ర కథల్లోనూ చదివిన జ్ఞాపకం లేదు. ఫోర్క్ కు తెలుగు ‘ముళ్ళచెంచా’ బాగుంది.
ఊహలకు అప్పుడే రొక్కటం వస్తే ఎలా? ఇంకెన్ని ఊహలు ఊరాలో!!
చాగంటి తులసి గారికి అభినందనలు.
కలలు రాని నిద్ర గురించి NS Murty అభిప్రాయం:
07/01/2022 12:03 pm
శారద గారూ,
మీ అనువాదం చాలా బాగుంది
ఆసాంతం కుతూహలం కొనసాగేట్టు అనువదించారు.
హృదయపూర్వక అభినందనలు.
ఊహల ఊట 14 గురించి చోడవరపు వెంకట లక్ష్మి అభిప్రాయం:
07/01/2022 9:36 am