పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఊహల ఊట 20 గురించి sumanaspati reddy అభిప్రాయం:

    01/16/2023 9:52 pm

    నా పేరుతో, నేను నేఎంచుకున్న రచనలకే ఈమాటలో అభిప్రాయాలు రాయడంతో నా గురించి అస్సలేమీ తెలియని లైలావారికి ఇంత ఆగ్రహమాక్కసు కలగడమెందుకో విశ్లేషించుకొనే సమస్య వచ్చిపడింది! ఫరవాలేదు!

  2. ఊహల ఊట 20 గురించి సుమనస్పతి రెడ్డి అభిప్రాయం:

    01/15/2023 11:50 pm

    లైలా గారి వాక్కులు ఇప్పుడే చదివాను.
    మీకు ఫ్రాయిడియన్ లాల్ సలాం!
    ఇంతకన్నా ఎక్కువగా ప్రవచించడం అనుచితం అవుతుంది.

  3. కూటి రుణం గురించి దేశరాజు అభిప్రాయం:

    01/15/2023 11:56 am

    కథ చదివిన వెంటనే వచ్చిన సందేహం ‘ఆ కెత్తెల్ సాయిబుకి అన్ని డబ్బులు ఎక్కడివి? ఎలా వస్తాయి? సంవత్సరాల తరబడి డబ్బులు వేయకుండా తినేసే వారు వున్నప్పుడు ఆయన హోటల్‌ని ఒకే స్థాయిలో-రుచి మాత్రమే కాదు, వస్తారనుకున్న వారందరికీ కడుపునిండా-ఎలా తిండి పెట్టగలిగాడు. ఆయనతోపాటు ఇద్దరో ముగ్గురో పనివారు కూడా వుంటారు కదా, వారి పరిస్థితి? అలాగే, పిల్లలని కూడా స్థితిమంతులుగా నిలబెడతాడు. ఎలా సాధ్యం?’ ఆయనకున్న ఆర్థిక వెసులుబాటు ఏంటి? ఆ కిటుకేంటో చెబితే కొంతమందైనా అదే బాటన నడిచే సుఖపడేవారుగా?
    చాలామంది కళ్లు చెమ్మగిల్లాయి, హృదయం ద్రవించిపోయిందని కామెంట్లు రాశాక కూడా నేనిటువంటి సందేహం వెలిబుచ్చడం అసమంజసం అనుకుంటే, మన్నించండి.

  4. నిరీక్షణ గురించి S A RAHMAN అభిప్రాయం:

    01/15/2023 4:57 am

    పద్మావతి రాంభట్ల గారి నిరీక్షణ చాలా బాగుంది. నిరీక్షణ కాబట్టి వచ్చేవరకు నిరీక్షించాల్సిందే.

    ఎస్. ఎ. రహమాన్. చిత్తూరు.

  5. అదృశ్య సముద్రం మీద వేట గురించి సాంబమూర్తి లండ అభిప్రాయం:

    01/13/2023 10:53 am

    చాలా ధన్యవాదాలు మేడం.

  6. తన్మాత్ర: లేతకాంతిలోకి… గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/12/2023 10:55 am

    జలంధరమ్మకి నచ్చిన ( పున్నాగపూల రచయిత్రి జలంధర చంద్రమోహన్ గారికి నచ్చిన ) డా. మైథిలి అబ్బరాజు గారి హృద్యమైన కథల సంపుటి ” తన్మాత్ర ” ప్రతులు కోసం యీ క్రింది లింకు :

    https://books.acchamgatelugu.com/product/tanmatra/

    Tanmatra – తన్మాత్ర Author: Dr.Maithili Abbaraju
    No.of pages : 232 Published by: JV Publications Price: Rs. 200

  7. సాంగత్యం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/10/2023 11:29 am

    ఎప్పుడన్నా వచ్చి రాత్రికి ఉండి ఆమెను విసిగించి, హింసించి పోయే అన్న… వారానికి ఓ రోజుండి పోయే భర్త… సంవత్సరంలో ఓ వారానికి మించి ఉండని కొడుకు… ఆమె సాంగత్య భాగ్యం లభించిన కౌమారవయస్సు చిన్నా…

    రక్తసంబంధం కానిది సాంగత్యం. సాంగత్యం వల్లనే మనకు సంస్కారాలు అబ్బుతాయి. గంగానది పాపాన్ని పోగొడుతుంది. వెన్నెల తాపాన్ని పోగొడుతుంది. కల్పవృక్షం దైన్యాన్ని పోగొడుతుంది. అయితే ఈ మూడింటినీ సజ్జన సాంగత్యం పోగొడుతుంది. సజ్జన సాంగత్యం జీవితాలను మారుస్తుంది. దశా దిశా నిర్దేశం చేస్తుంది. సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.

    “మనుషులు అవసరాన్ని మించిన అవసరం కోసం, సంతృప్తికి మించిన సుఖం కోసం వెంపర్లాడుతుంటారు. వీళ్లు జంతువులనుంచి ఎదిగినవాళ్లు కాదు చిన్నా! అక్కడ నుంచి మనిషిగా దిగజారినవాళ్లు. వీళ్లు జాలిపడాల్సిన వాళ్లే తప్ప ద్వేషించాల్సినవాళ్లు కాదు.” అన్న తల్లి

    “(డైరీలో) నేను రాసినవన్నీ… సమాజం లో తనచుట్టూ ఉన్న మనుషుల నైజం గురించి తాత్విక దృష్టితో రాసినవన్నీ … ఎప్పటికైనా నీకే ఇస్తాలే చిన్నా” అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దయాసముద్రి ఆ తల్లి పాదాలను నా కన్నీళ్లతో కడగాలని ఉంది… కనిగిరి భాస్కర్ రెడ్డి మాస్టారు గారూ!

    ~ కనిగిరి కె.కె. రామయ్య (త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు)

  8. విభాజకం గురించి Mehdi Ali అభిప్రాయం:

    01/07/2023 11:53 pm

    హృదయాన్ని స్పృశించే కథ.

  9. గడినుడి – 74 సమాధానాలు గురించి బి.మణి నాగేంద్రరావు అభిప్రాయం:

    01/06/2023 7:54 pm

    పైన సమాధానాలకు పూర్తిగా వివరణలు ఇచ్చివుంటే సమంజసంగా వుండేది. నాకు తోచినవి కింద ఇచ్చాను.

    1. దేశబంధు చిత్తరంజన్ దాస్ గారి పేరు ముందుగా చెప్పవలసినది.
    17. వెంకుని ఒకటి రెండు లైన్లలో పరిచయం చేయాల్సింది.
    21. కుయిలి గురించి ఒక లైన్లో పరిచయం చేయాల్సింది.
    27. అలాగే ‘లనా’ గురించి కూడా.
    36. వావిలాల గారి పూర్తిపేరు ముందుగా చేపాల్సింది.
    43. అలాగే ‘కొండా’ గారి పేరు కూడా.
    40.బాజీ, 42. చాకో లను కొంచెం పరిచయం చేయాల్సింది.
    నిలువు 7. ‘నురమాకు’ బహుశా ‘కుమరను’ అయివుండవచ్చు. కొంచెం వివరించవలసినది.
    23. విజయలక్ష్మి పండిట్ని పరిచయం చేయవలసింది.
    38. డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ లను ఒక వాక్యంలో పరిచయం చేయవలసినది.
    ఇవి కొన్ని మాత్రమే. ఈ విధంగా సమాధానాలను వివరించి వుంటే, ఈ కార్యక్రమం ఇతరులు విజ్ణానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.

    (ఈ మాట లోని గడి-నుడి పూర్తి చేయాలంటే అపారమైన చారిత్రక అవగాహన, భాషాపరిజ్ణానం వుంటే తప్ప సామాన్యులకు సాధ్యం కాదని నాకు అర్ధమయింది. నేను నాలుగైదు సార్లు ప్రయత్నం చేసి పూర్తి చేయలేకపోయాను.)

  10. ఊహల ఊట 20 గురించి Lyla yerneni అభిప్రాయం:

    01/06/2023 7:41 pm

    That’s the one అన్వర్ గారు. ఇదివరలో తెలుగు అనువాదం చదివాను. Now I read an English translation, thanks to you. – Lyla