‘కేశం’ అంటే అంటే తమిళంలో ‘కురులు’ అనుకుంటాను. అత్తియప్పన్ – తంగంల అనుబంధం ఊహించినట్టే జరిగింది. ఆ ఇద్దరూ చనిపోవడం ఒక విధంగా సుఖాంతమే! అనువాదం ఇంకొంచెం సరళంగా వుండవలసింది అనిపించింది.
యాస, మాండలికం మీద తెలుగులోసాహిత్య రంగంలో చాలా చర్చ జరుగుతూనే వుంది. ఉనికిని చాటి చెప్పేది కాబట్టి దానిని మేము వాడుతున్నాము అనే వర్గం ఒక వైపు. ఇతరులకి అర్ధం కావాలి కదా చెప్పదలుచుకున్నది అని మరో వైపు.
వుండేది – సరి కాదేమో. వున్నది. కధా కాలానికి వుంది. కథ ముగిసే నాటికి కూడా వుంది. కాబట్టి ‘వుంది’ సరైన వాడుక అనుకుంటాను.
అలాగే ‘అండా’ అన్న పదం. సందర్భాని బట్టి అది నీరు నిల్వ వుంచే పాత్ర అని ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని అండా అన్నది తెలుగు ‘బిందే’ కన్నా పెద్దది అని అనుకోలు. ఆ రెండింటి మధ్య తేడా చాల సున్నితమైనది. అంతర్జాతీయ అనువాదాలలో కూడా ఇటీవల ఒక వాదన వినపడుతోంది. మూలంలో ఉన్న పదాలకు (పర భాషలోని) అర్ధాలు, వివరణ, పాదసూచికలు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఆలోచించదగ్గ విషయమనిపించి ఇక్కడ ప్రస్తావించడం.
ఊహల ఊట 28
గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
That is not a bedroom dream తః తః గారు!
That’s a girl’s classroom dream. You (me) develop it in the head ever so slowly. Savoring it. I use it to this day.
This one below, from my love potion collection, is a bedroom dream. This works like a charm too. I gave it the name,
‘Inscrutable’
అసలుకి;
నీ పక్కలోనే ఉంటా నేను.
నువ్వు నా చెంప మీద ముద్దిస్తూనే ఉంటావు
నే నవ్వుతూ థాంక్యూ స్వీటీ! అంటూనే ఉంటా.
ముక్కుమీద కళ్లజోడు జారుతుండగా
కలువల నా కళ్లతో
లేప్టాప్ మీద ఎక్కడో వెబ్సైట్ లో నీ రాతలే చదువుతూ
“ఏమిటీ చచ్చు ఎనాలిసిస్?” అని ఒపీనియన్ కొట్టి
అక్కడ రుసరుసలాడుతా.
ఇక్కడ నీ ముద్దులు కురుస్తూనే ఉంటాయి,
నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు.
“సాహిత్యసమాజాలు బలంగా ఎదగడానికి సాహిత్యాభిలాష, సాహిత్య కృషికి తగిన ప్రోత్సాహం మాత్రమే సరిపోవు.”
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
స్వప్నవాసవదత్తం గురించి పొర్ల వేణుగోపాల రావు అభిప్రాయం:
09/09/2023 8:00 am
చాలా వివరంగా కథను తెలిపారు సర్. చాలా బాగుంది. పాత్రల చిత్రీకరణ. తెలుగు భాసుడు భాస్కర్ గారు. హృదయ పూర్వక అభినందనలు సర్👌👌👌🤝🤝🤝🙏🙏🙏
కేశం గురించి Anil అట్లూరి అభిప్రాయం:
09/08/2023 8:47 pm
‘కేశం’ అంటే అంటే తమిళంలో ‘కురులు’ అనుకుంటాను. అత్తియప్పన్ – తంగంల అనుబంధం ఊహించినట్టే జరిగింది. ఆ ఇద్దరూ చనిపోవడం ఒక విధంగా సుఖాంతమే! అనువాదం ఇంకొంచెం సరళంగా వుండవలసింది అనిపించింది.
యాస, మాండలికం మీద తెలుగులోసాహిత్య రంగంలో చాలా చర్చ జరుగుతూనే వుంది. ఉనికిని చాటి చెప్పేది కాబట్టి దానిని మేము వాడుతున్నాము అనే వర్గం ఒక వైపు. ఇతరులకి అర్ధం కావాలి కదా చెప్పదలుచుకున్నది అని మరో వైపు.
వుండేది – సరి కాదేమో. వున్నది. కధా కాలానికి వుంది. కథ ముగిసే నాటికి కూడా వుంది. కాబట్టి ‘వుంది’ సరైన వాడుక అనుకుంటాను.
అలాగే ‘అండా’ అన్న పదం. సందర్భాని బట్టి అది నీరు నిల్వ వుంచే పాత్ర అని ఊహించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాని అండా అన్నది తెలుగు ‘బిందే’ కన్నా పెద్దది అని అనుకోలు. ఆ రెండింటి మధ్య తేడా చాల సున్నితమైనది. అంతర్జాతీయ అనువాదాలలో కూడా ఇటీవల ఒక వాదన వినపడుతోంది. మూలంలో ఉన్న పదాలకు (పర భాషలోని) అర్ధాలు, వివరణ, పాదసూచికలు ఇవ్వాల్సిన అవసరం లేదని. ఆలోచించదగ్గ విషయమనిపించి ఇక్కడ ప్రస్తావించడం.
ఊహల ఊట 28 గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
09/07/2023 7:40 am
కథ మధ్యలో అడ్డం తిరిగింది. అయినా బాగుంది.
నిండు వేసవి గురించి Suryanarayana అభిప్రాయం:
09/06/2023 1:28 am
Writer has narrated the above story very nicely. This story has has taken me to my childhood days. It is worth to share such stories to our children.
వికసితం గురించి దివాకర్ అభిప్రాయం:
09/05/2023 7:14 pm
చాలా బావుంది కవిత.
ముఖ్యంగా…
“వెలిసిపోతున్న నీడలను
కొలుచుకుంటూ”
బాగా నచ్చింది.
అనాదిగా గురించి రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్ అభిప్రాయం:
09/05/2023 2:25 pm
ప్రకృతి లోని ద్వందాలను చక్కటి భావ చిత్రాలతో వివరిస్తూ జీవన్మరణాలను కూడా జంటగా చూపడం బాగుంది.
గుళిక వేదాంతం గురించి Kishore Karnam అభిప్రాయం:
09/04/2023 4:07 pm
Beautiful explanation of quantum physics and intersection with philosophy.
నా జానపద కల గురించి Lyla yerneni అభిప్రాయం:
09/04/2023 2:53 pm
That is not a bedroom dream తః తః గారు!
That’s a girl’s classroom dream. You (me) develop it in the head ever so slowly. Savoring it. I use it to this day.
This one below, from my love potion collection, is a bedroom dream. This works like a charm too. I gave it the name,
‘Inscrutable’
అసలుకి;
నీ పక్కలోనే ఉంటా నేను.
నువ్వు నా చెంప మీద ముద్దిస్తూనే ఉంటావు
నే నవ్వుతూ థాంక్యూ స్వీటీ! అంటూనే ఉంటా.
ముక్కుమీద కళ్లజోడు జారుతుండగా
కలువల నా కళ్లతో
లేప్టాప్ మీద ఎక్కడో వెబ్సైట్ లో నీ రాతలే చదువుతూ
“ఏమిటీ చచ్చు ఎనాలిసిస్?” అని ఒపీనియన్ కొట్టి
అక్కడ రుసరుసలాడుతా.
ఇక్కడ నీ ముద్దులు కురుస్తూనే ఉంటాయి,
నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు.
-Lyla
Happy Labor Day! Friends!
సెప్టెంబర్ 2023 గురించి శామల అభిప్రాయం:
09/04/2023 5:58 am
‘సాహిత్య సమాజం’ అన్న పదానికి ప్రమాణాలు స్ఫురించటం లేదు. సాహిత్యసమాజం ఎందుకు, ఏ ఆశయంతో ఎదగాలి? అందునా బలంగా? చారిత్రాత్మకంగా ఎన్ని సమాజాలు, ఏదేశాల్లో, ఏ కాలాల్లో సాహిత్యపరంగా ఎదిగాయి? బలంగా? ఆ ఎదుగుదల ఎటువంటి పరిగణనీయమైన ప్రయోజనాలు సమాజానికి ఒనగూర్చింది?
సాహిత్యాభిలాష పైన పేర్కొనబడ్డ ఎదుగుదలకి ముఖ్య ప్రేరణాంశం అనుకుందాం. సాహిత్యాభిలాష రచయితలో ఉండాలా, పాఠకుడిలో ఉండాలా? ఇరువురులోనూ సమపాళ్ళలో ఉండాలా?
సాహిత్యాభిలాష కొరవడితే బాధ్యత రాసేవాడిదా, చదివేవాడిదా, ఇద్దరిదీనా?
సాహిత్యకృషికి ప్రోత్సాహం, తగినంత, ఎక్కడినించి వస్తుంది, ఎవరిస్తారు, ఎవరివ్వాలి?
ఈ అంశాల తర్వాతకదా, ఇవి సరిపొయాయా ఇంకా ఏమైనా తక్కువయాయా అనే చర్చ?
నేడు కావ్యాలు రాయించుకుని, అంకింతం చేయించుకుని మాన్యాలిచ్చే రాజులు లేరు, సమీప భవిష్యత్తులో ఉండే అవకాశాలు లేవు. మాన్యాలే ప్రోత్సాహాలనుకుంటే!
ఆఁ, పిల్లాపెద్దా అతుక్కుపోయి చదివే, పిదప సినిమాలు తీయగలిగే ‘హారీ పాటర్’ శృంఖల రాయి; పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. సాహిత్యం అని కొందర్ననమను, నేను విఠలాచార్య జానపదం అంటాను.
మొన్నీమధ్య (అర్ధశతాబ్దం క్రితం) దాకా విశ్వనాథ వంటి మహామహిన్విత కవులు అనేకమంది దారిద్ర్యంలో మ్రగ్గారు. నేడా పరిస్థితి లేదు. సాంకేతికత పుణ్యమాని, అణాకాని వాళ్ళు కూడా యూట్యూబ్‌ని ఆశ్రయించి కోట్ల లైకులూ, లక్షల డాలర్లు వెనకేసుకుంటున్నారు.
పస ఉన్న, హృదయాన్ని కదిలించగల ఇంకో తిలక్‌ని, మల్లాదిని, కొకుని, చలాన్ని చూపించండి; ప్రశంసలూ, సంపదలూ కోకొల్లలుగా ఎందుకు కురవవో చూద్దాం.
ప్రచురణ సంస్థల రోజులు పోయాయి, రచయితలు వెబ్‌మాగజైన్‌ల మీద ఆధారపడే రోజులూ చరమదశకి వచ్చాయి.
సమాచారం మెరుపు వేగంతో ప్రపంచం అంతా వ్యాపించే రోజు ఇది.
‘ప్రతిభ దాగదు.’ ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’ అన్నవి డిక్టేషన్ వాక్యాలు కాదు, అక్షర సత్యాలు అని నిరూపించగల సత్తా నేటి సాంకేతికకీ ఉంది, నేటి యువతరానికీ ఉంది.
గీతాచారి గురించి Sasikala అభిప్రాయం:
09/04/2023 3:09 am
👌👌నిజంగా చారి గారి బొమ్మల్లో పల్లె మోటుతనం నిజాయితీగా కనపడేది.చాలా బాగా వ్రాశారు.