పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. సగం వాన గురించి Lahari అభిప్రాయం:

    09/01/2023 7:38 pm

    Super anna kavitha.

  2. సగం వాన గురించి Poojitha charan అభిప్రాయం:

    09/01/2023 6:21 pm

    ‘సగం వాన’ శీర్షికతోపాటు, కవితా ఆసాంతం అలరించింది. చాలా బాగా వ్యక్తీకరించారు. అభినందనలు ✍️✍️✍️💐💐💐

  3. నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి NS Murty అభిప్రాయం:

    09/01/2023 1:35 pm

    శ్రీరామనాథ్‌గారూ,
    మంచి కవి, భావుకుడూ అయిన కవిని పరిచయం చేశారు. ధన్యవాదాలు. చల్లా సీతారామాంజనేయులుగారు, గురుమిత్రులు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్యశర్మగారు దగ్గర దగ్గర ఇళ్ళలో ఉండేవారు. వారు హిందీ పండిట్. ఒకప్పటి సత్యనారాయణపురం రైల్వేస్టేషను దగ్గర నల్లగేటు నుండి బాబూరావు మేడ దగ్గరికి వెళ్ళే దారిలో ఒక ట్యుటోరియల్ కాలేజీ కొంత కాలం నడిపేరు. తర్వాత ఆయనకి ఉద్యోగం రావటంతో దానిని మూసేసి వెళ్ళిపోయారు. 1975లో కాకతాళీయంగా వారితో శ్రీ శర్మగారి ద్వారా పరిచయం అయింది. మాటల సందర్భంలో ఒకసారి ఆయన చెప్పిన ఈ పద్యం ఇప్పటికీ గుర్తుండిపోయింది:

    శ్యామల కోమలోన్మిష వసంత వనాగ్రము లెక్కి, గైరికా
    క్రామిత తీక్ష్ణ శైల శిఖరమ్ములనెక్కి, సుశీత వర్షధా
    రా మృదు కాలమేఘ విసరమ్ముల నెక్కి, క్రమింతురా శర
    చ్ఛ్రీ మకుటోజ్జ్వలార్ద్ర విధురేఖకు నేను కళాత్మనై, శివా!

    మీరు పరిచయం చేసినదీ, ఈ పద్యమూ, రెండూ మంచి భావుకత కలిగినవని వేరే చెప్పనక్కరలేదు.

    అభివాదములు.

  4. సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/01/2023 11:25 am

    బావుంది. ఒక్కసారిగా సోల్జర్ కథలు రాగభరితమైపోయాయి. మరి ఒకటి రెండు ఎపిసోడ్లు సంగీతం చుట్టూ అల్లితే బావుంటుంది.

    తెలుగులో సైన్యపు జీవితాల చిత్రణ అరుదు. ఈ కథలన్నీ పుస్తకంగా వస్తే బావుంటుంది.

  5. నిండు వేసవి గురించి పి.వి.రమణరావు అభిప్రాయం:

    09/01/2023 10:56 am

    గతస్మృతులతో కథని నడిపించి ఓ పరిష్కారం చూపించారు. రచయిత్రికి అభినందనలు.

  6. నిండు వేసవి గురించి Seshu Chebolu అభిప్రాయం:

    09/01/2023 10:37 am

    Simple story, expressed in lucid language! Felt refreshed reading it. Keep it up Anuradha garu.

  7. నిండు వేసవి గురించి వెంపరాల దుర్గా ప్రసాద్ అభిప్రాయం:

    09/01/2023 9:23 am

    కథనం బావుంది. ఒక సారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. కానీ వేరే ప్రత్యామ్నాయ వేసవి శిబిరం వైపు తిప్పేసేరు రచయిత్రి. బాగానే ఉన్నా, ఈనాటి పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండడం లేదు. ఆ దిశగా వాళ్ళని కొద్దిరోజులయినా ప్రోత్సహించడం మానకూడదు. మూలాలను మరుస్తున్న పిల్లలకు మనం నిర్దేశం చేయడం కూడా అవసరమే కదా.

  8. నిన్ను కావలించుకునే… గురించి Adi Ramesh అభిప్రాయం:

    09/01/2023 9:00 am

    Interesting poem.

  9. యాత్ర గురించి శామల అభిప్రాయం:

    09/01/2023 3:48 am

    జయమోహన్ వంటి ఉన్నతస్థాయి సమకాలీన రచయిత భారతదేశంలో ఉన్నారని ఈమాట ద్వారానే తెలిసింది. ఆ ఎరుక ఒక సంపదగా భావిస్తాను. రచయిత పాటవాన్ని యథాతథంగా (ఇనుమడింపజేసి కూడా అయిఉండవచ్చు, నాకు తమిళం తెలియదు) ఆంధ్రంలో అనుసృజన చేసిన రచయితలకి ధన్యవాదాలు.

    జయమోహన్ పరిచయవాక్యాల్లో ఉదహరించినట్లు ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించినది పద్మభూషణ్ కాదు, పద్మశ్రీ.

    ఆయన మిగతా కథలు విషయప్రధానమయితే, ఈకథలో విషయంకంటే నాటకీయత పాత్ర ఎక్కువ ఉందని నాకనిపించింది. కథలో చెప్పినట్లుగా కొన్ని అనుభవాలు వ్యక్తపరచలేము, కైలాసమానసరోవరయాత్రలో స్వానుభవం.

    కేదార్‌నాథ్ నుంచి కైలాసపర్వతానికి నడకమార్గం లేదు.

  10. ఊహల ఊట 27 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    08/28/2023 1:01 am

    వృక్షత్వం, ఈ పదం ఈ మాటకే అందాన్నిచ్చింది. పూసలాయించడం బాగుంది.

    ఈనెల ఊహల ఊట చదువుతుంటే అప్పుడే కుంతల పెద్దదైపోయిందా అనిపించింది. మా బాల్యం కూడా అక్కడక్కడా గుర్తు వచ్చినది.

    తులసి గారి జ్ఞాపకాల పందిరికి, ఊహల ఊటకి జయహో జయహో!