పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. నాకు నచ్చిన పద్యం: ఆర్తవబిల్వదళం గురించి తః తః అభిప్రాయం:

    09/04/2023 12:21 am

    మూర్తిగారూ: శ్రీ పరిమి వయసులో మాత్రమే చిన్న. ఆన్‌లైన్లో కొంతకాలంక్రితం ఏల్చూరివారికి జరిగిన సన్మాన సభలో పరిమివారి ప్రతిభా ప్రకాశ పరిచయం కనువీనుల విందుగా జరిగింది.

    చల్లా వారిని ఈమాటకు ముందుగా పరిచయం చేసింది నేనే* ఈమధ్యనొకపరి ఈమాటలో వచ్చిన డా. యెర్నేని ‘సీత’పై అభిప్రాయాల వేదికపై. అంతకు ముందొకతరి అదే వేదికపై మీరిప్పుడిక్కడ గుర్తుకు తెచ్చుకున్న పద్యంతో.

    శ్రీ చల్లా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమాతో ఢిల్లీలో కె.యల్. రావుగారి వద్ద పని చేశారు. గుంటూరు ఏసీ కాలేజ్‌లో కళావాచస్పతి శ్రీ కొం. జగ్గయ్యగారి సహాధ్యాయీ మిత్రుడూనూ. బిల్వ మాల, కదంబ మాల, వ్రజభూమి, మైథిలి (నాటకం) నాకు వారి ద్వారా తెలిసిన వారి రచనలు, అంటే వారి రచనల పేర్లు. వాటి అచ్చు ప్రతులు వారిదగ్గర గూడా లేనట్టే గుర్తు. వ్రజభూమి, మైథిలి ముద్రింబబడలేదేమో గూడా. మైథిలిలో లోపాముద్ర సీతమ్మకు వనదుర్గా మంత్రాన్ని ఉపదేశించినట్టుగా వ్రాశానని చెబుతుండేవారు – వారు చెప్పిందే మరొకతూరి చెప్పటమూ చెప్పినప్పుడల్లా నేను మొదటి సారి వింటున్నట్టుగా వినటమూ మా మధ్య సాధారణమైన విషయం.

    “బిల్వలు మాలలల్లి తొలిభిల్లుని జూటము జుట్టె భక్తిమై గొల్వ కదంబ మాలికలు
    గౌరమ గాత్ర సరాలు జేసె చెంగల్వలు కన్నులైన వ్రజకాంతలకున్ శిఖిపించమౌళి
    శ్రీ చెల్వునిజూపి మైథిలికి సిద్ధవనాంబిక మంత్రమిచ్చెడిన్“ అని,

    “గణములు బంధులై యతులఖండులు గుండెలదాపుమిత్రులై గుణము మహాహియైన శరకోవిదు కోమలి దుర్గ తల్లియై…“ అంటూ మొదలుబెట్టి వారిపై నాల్గు పద్యాలు రాసి వారికి చూపే సాహసం చేయగల, చేసిన – పరిచయం దాదాపు రెండు దశాబ్ధాలపాటు మామధ్య – వారు బెజవాడ సత్యనారాయణపురంలో మా ఇంటికి దగ్గరగా ఉన్న ముత్యాలంపాడులో ఉన్న రోజుల్నుంచి తర్వాత విశాఖపట్నానికి వచ్చి పురుషోత్తపురంలో వారి అబ్బాయి దగ్గర గడిపినంతవరకూ.

    కాటూరి వెంకటేశ్వర రావుగారి వద్ద పద్యవిద్య నేర్చుకున్నానని చెప్పేవారు. విశ్వనాథవారికి మరీ ఆత్మీయులు. ‘శారదికములు’ అన్న చల్లా ప్రయోగం విని విశ్వనాథ “తద్ధితం మీద తద్ధితం చేస్తావా ఆంజనేయులూ?” అన్నారనీ.

    అనంతరకాలంలో వెంపరాల వారికి నివేదించినపుడు వారు తన పదబంధం గ్రాహ్యమేనన్నారనీ చెప్పారు. “నాకేజబ్బూ లేదు. నూట ఇరవై ఏళ్ళు బతుకుతాన”న్న మనిషి చెప్పా చెయ్యకుండా వెళ్ళిపోయాడు. వారు పద్యం చదివే తీరు విలక్షణమైన సౌందర్యం గలిగినది. వారికి నన్నయ మరీ ఇష్టమైన కవి – పిసరంత ‘సబ్ కాస్ట్ ఫీలింగ్‘ ఉన్న వ్యక్తి – “నా గురువులందరూ మీ నియోగులే“ అనేవారు.

    వారి ఋణం ఎప్పటికీ తీరనిది.

    నమస్కారాలతో – తః తః

    *అదను దొరికినపుడు అందరు వినునట్టు
    తప్పుగాదు సొంత డప్పు సుంత
    దాననాదమరచి తాళము తప్పకు
    రామచంద్ర పుత్ర! రామభద్ర!”

  2. గుళిక వేదాంతం గురించి శామల అభిప్రాయం:

    09/03/2023 5:39 pm

    ప్రపంచం నా సౌలభ్యం కోసం, నా ఉనికి నిమిత్తం నేను సృష్టించుకున్నాను. చరాచరవస్తువుల్ని నేనే సృష్టించుకుంటూ పోతున్నాను. నేను సృష్టించినంతమేరకే సృష్టి. జ్ఞానేంద్రియాలనీ, తల్లిదండ్రులనీ, చేతస్సునీ, ఇష్టాయిష్టాలనీ, భాషనీ, గ్రంధాలయాల్నీ లీలావిలాసంగా తయారు చేసుకున్నాను.

    నా సృష్టిలో విధ్వంసం ఒక పార్శ్వం. సూర్యుడిని చంపేసినా నా సృష్టి ఆగదు. నా శరీరాన్ని నాలోనే లయింపచేసుకుంటా కూడా. సమయాన్ని సృష్టించింది నేనే కదా!

    ఉన్నది నేను. నేనే ఉన్నాను.

  3. సగం వాన గురించి Sudha Rani అభిప్రాయం:

    09/03/2023 11:26 am

    తెలుగు భాషకు దుర్దశ పడుతుందేమో అని భయపడుతున్న పాఠకాభిమానులకు ‘బీగం’ లాంటి పదాల వాడుకతో తెలియని ఊరట లభించింది. ఆసాంతం చదివించేలా చేస్తూ, రసాస్వాదన కలిగించింది ఈ కవిత.

  4. గుళిక వేదాంతం గురించి v.srinivasa rao అభిప్రాయం:

    09/03/2023 10:59 am

    చాలా బావుంది, దయచేసి ఇలాంటివి మరికొన్ని వ్యాసాలు వ్రాయండి. క్వాంటమ్‌ ఫిజిక్స్ గురించి మనసు గురించి తెలిపే అంశాలు మీనుండి తెలుసుకోవాలని ఉంది సర్.

  5. అనాదిగా గురించి Sanjay అభిప్రాయం:

    09/02/2023 2:17 pm

    The nature – poetically presented well.

  6. వికసితం గురించి శ్రీరామ్ అభిప్రాయం:

    09/02/2023 3:08 am

    మీ కవిత చదువుతూ మైమరచిపోతూ మధ్య మధ్యలో ముసిముసిగా నవ్వుతూ — కవిత బాగుంది పద్మగారు.

  7. అనాదిగా గురించి డాక్టర్ కె.జి. వేణు అభిప్రాయం:

    09/02/2023 2:36 am

    కవిత చాలా బాగుంది. అద్భుతమైన భావవ్యక్తీకరణ. కవికి అభినందనలు.

  8. నిండు వేసవి గురించి Akshara అభిప్రాయం:

    09/02/2023 2:25 am

    పిల్లలకే కాదు, రిటైర్మెంట్ తరువాత పెద్దల కోసం కూడా ఇలాంటి శిబిరాలు అవసరం అనిపించింది అనురాధగారు. Afterall అరవయ్యో ఏటి దాకా ఒకొప్పుడు ఆ తరువాత కూడా బాధ్యతలతో సతమతవుతున్న వారికి మీరు చెప్పినటువంటి శిబిరాలు ఉంటే వయోవృద్దులకి మంచి కాలక్షేపం. మీ కథ మంచి స్పందన ఆలోచనలు కలిగిస్తుంది. అభనందనలు.

  9. సోల్జర్ చెప్పిన కథలు: ఒంటరి పాట గురించి హైమ అభిప్రాయం:

    09/01/2023 11:40 pm

    మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ పర్సన్. ఒక పెగ్ తాగి ఆయన సర్వీస్‌లో జరిగిన అనుభవాలు కధలు కధలుగా చెబుతుంటే విన్నప్పుడు కలిగే అనుభూతి ఆయన పోయాకా మిస్ అయ్యాం. మీ కధలు చదువుతుంటే ఆరోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఆయన కూడా పాడేవారు, మౌత్ఆర్గన్ వాయించేవారు.

  10. సగం వాన గురించి జూలూరి శైలజ, హైదరాబాద్. అభిప్రాయం:

    09/01/2023 11:04 pm

    కాలం వేళ్ళ సందుల్లోంచి జీవితాలు జారుతున్నట్టు* ప్రారంభమే అద్భుతంగా ఉంది. మొత్తంగా మీ కవిత భావస్ఫోరకంగా అందంగా ఉంది👏👏👌👌