పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. శ్లోకము గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    04/02/2025 9:01 am

    వాగ్వల్లభ దుఃఖభంజనము పుస్తకం కోసం నేను ఇంటర్నెట్ గాలించి లాభం లేకపోయింది.

    వ్యాసకర్త గారు కాని మరెవరైనా కాని ఈవిషయంలో ఏమైనా సహాయం చేయగలరా?

  2. కొన్ని సమయాలలో కొందరు మనుషులు గురించి జ్యోత్స్న అభిప్రాయం:

    04/02/2025 8:28 am

    మీ చిన్ననాటి ముచ్చట్లలో ఎన్ని షేడ్స్ నో అద్భుతంగా చిత్రీకరించి, నాకు బొమ్మ అబ్బలేదు అంటారేమిటో 🙂 కళ్ళు ఆపకుండా అక్షరాల వెంట పరుగులు తీసినా, మనసు మాత్రం తెలీని ఆ సీమలని జనాలని పరిచయం చేసుకొచ్చింది..

  3. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి ఎ.ఎన్. జగన్నాథశర్మ అభిప్రాయం:

    04/02/2025 7:49 am

    1970-80 దశకాల్లో రేడియోల్లోనూ, పత్రికల్లోనూ వచ్చిన ఇంటర్వ్యూలు చదివి, మా నాన్న పెదవి విరిచేవారు.

    ఏమైంది? ఇంటర్వ్యూ బాగానే ఉందిగా? అంటే…ఇంటర్వ్యూలు ఎప్పుడూ వృత్తిరీత్యా చెయ్యకూడదురా! ఆసక్తిమీదా, అనురక్తిమీదా చెయ్యాలనేవారు. అసలు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే, ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి ‘పెంపు’ ఆధారపడుతుందనేవారు.

    అలాగే ఇటు ఇంటర్వ్యూ చేసే వక్తికీ, అటు ఇంటర్వ్యూ చేయబడుతున్నవక్తికీ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండాలనేవారు. అంతేకాదు, నిజానికి ఇంటర్వ్యూలో బలం అంతా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే ఆధారపడతుందనేవారు.

    ఆనాడు అవి చాదస్తపు మాటలు అని కొట్టిపారేశాను. తర్వాత్తర్వాత అవి గొప్పమాటలని తెలిశాయి. ఇన్నాళ్లకు ‘ఈమాట’ లో వేలూరిగారితో ఓ సంభాషణ చదివి, నాన్న మాటలు నిజమనిపించాయి. మా నాన్నంటే నాకు మరింత గౌరవం పెరిగింది. అలాగే వేలూరిగారిమీదా, వారిని ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్, సాయి బ్రహ్మానందం గొర్తిమీదా కూడా గౌరవం పెరిగింది.

    ఇంతటి గొప్ప ఇంటర్వ్యూని ప్రచురించిన ‘ఈమాట’కు అభినందనం. అభివందనం.

  4. మౌనంబంతట మాటలాడె… గురించి Vasu అభిప్రాయం:

    04/02/2025 6:59 am

    భైరవభట్ల కామేశ్వరరావుగారూ,

    నమస్తే. నేను వాసుని. ఈ పద్యాలన్నీ ఎంతో తియ్యగా ఉన్నాయి. వాల్మీకిని మొత్తం అనువాదం చేయ సంకల్పించారా, సర్?

    -వాసు-

  5. లంకమల దారుల్లో – వలపటెద్దు కథల్లో గురించి C.Suseela అభిప్రాయం:

    04/02/2025 6:17 am

    శ్రుతకీర్తి, చాలా మంచి విశ్లేషణ అందించావు. ప్రకృతి లోని అందాలు, దానితో పెనవేసుకున్న బంధం, అందులొ పొందే సాంత్వన, మూగప్రాణులతోని అనుబంధం, చదువుతుంటే ప్రతికథా మనసును హత్తుకున్నాయి. వివేక్ గారి కథలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.

  6. సిద్ధార్థ ముక్కుపుల్లలు — స్థానీయ సాంస్కృతిక అధివాస్తవ ప్రతీకలు గురించి Rajasekharam Mallipudi అభిప్రాయం:

    04/02/2025 2:50 am

    This is a fascinating and thought-provoking review that will make readers rethink their beliefs about cultural symbols. It is a tour de force into the heart of Siddartha’s poetry.

  7. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Suraj Sayyed అభిప్రాయం:

    04/01/2025 6:41 pm

    ఏది అసలు చరిత్ర

    ఏది ఏమైనా ఎమర్జెన్సీని ఆర్ఎస్ఎస్ సమర్ధించింది అనేది చారిత్రక వాస్తవం. ఇందిరా గాంధీని దుర్గగా కీర్తించిందెవరు? ఇంకాస్త వెనక్కు వెళితే గాంధీ హత్యకు ప్లానింగ్ చేసిన, A1గా ఉండాల్సినటువంటి సావర్కార్‌ని గాంధీ హత్యకేసు నుంచి ఎలా తప్పించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరా గాంధీ సావర్కార్‌ని తమ నెత్తికెత్తుకొని స్వాతంత్ర యోధుడు హోదా ఇవ్వడం, సావర్కర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం మరచిపోతగునా? గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం గురించి ప్రపంచమంతా తెలుసు. అలాంటిది ఆర్ఎస్ఎస్‌ను గాంధీ హత్య జరిగిన తర్వాత కేవలం ఒక 15,16 నెలలు మాత్రమే నిషేధించి తర్వాత వదిలేశారు కదా! ఇదేమిటి? నెహ్రూకు, పటేల్‌కు ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్‌తో ఉన్న అక్రమ సంబంధాల్ని ఎవరైనా కాదనగలరా?

    ఆర్ఎస్ఎస్‌ను సంతృప్తి పరచడానికి ఇందిరాగాంధీ సిక్కుల స్వర్ణ దేవాలయం ధ్వంసం చేసింది. ఆర్ఎస్ఎస్ కళ్ళలో ఆనందం చూడడానికి రాజీవ్ గాంధీ బాబ్రీ మసీదు తాళాలు తీయించి పాత విషయాన్ని మళ్లీ తిరగదోడడం చరిత్ర ఎలా మరిచిపోతుంది? ఇక పీవీ నరసింహారావు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. నగ్నంగా ఆర్ఎస్ఎస్‌ను హిందూ తీవ్రవాద సంస్థలను బలపడేలా చేశాడు. చివరగా చెప్పేదేమంటే కాంగ్రెస్ బిజెపి రెండు కూడా ఆర్ఎస్ఎస్‌కు రాజకీయ పనిముట్ల లాంటివి. ఓకే నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి, ఒకే మనిషికి రెండు కళ్ళ లాంటివి, రెండు చేతుల లాంటివి. ఇటీవల రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటి? కాంగ్రెస్లో ఉండి, బిజెపి కోసం పనిచేస్తున్న నాయకుల్ని ఏరివేయాలి అన్నాడు. ఇది దేన్ని సూచిస్తుంది? కాబట్టి ఇక్కడ ఎటువంటి పక్షపాతం లేకుండా చరిత్రను పరిశీలించి ఎవరు రాసిన అది మాత్రమే నిజమైన చరిత్ర అవుతుంది. అంతేకానీ హేతుబద్ధత లేకుండా, మన అభిమానాలు దురభిమానాలు ప్రాతిపదికన చేసే చరిత్ర పరిశీలన వలన అసలు నిజాలు బయటికి రావు !

  8. వేలూరిగారితో ఒక సంభాషణ గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:

    04/01/2025 4:36 pm

    ఎంత అద్భుతంగా ఉంది! పెద్దయింతర్వాత వేలూరి గారిలా అవ్వాలని నిర్ణయించుకున్నా! ఎంత అద్భుతమైన జీవితం — ప్రవాహంలో ఒడ్డున ఉండకుండా, దూకి ఈదులాడిన జీవితం. 1992 నుంచీ ఆయన మాకు గురువుగారిలా ఉన్నాడు, అదీ నాకు సంతోషం!!

  9. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Rao Vemuri అభిప్రాయం:

    04/01/2025 1:54 pm

    వ్యాసం బాగుంది. మిగిలిన భాగాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నాళ్ళబట్టో thermionic emission, incandescent lamp, byproduct వంటి మాటలకి తెలుగు మాటల కోసం వెతుకుతున్నాను. ఇప్పుడు దొరికాయి!!

  10. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం గురించి Srinivas అభిప్రాయం:

    04/01/2025 12:18 pm

    ఈ వ్యాసం ఆసక్తికరంగా ఉంది. ఈ రోజుల్లో, ఈమాటలో పాపులర్ సైన్స్ పై అనేక వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. అనుభవజ్ఞులైన రచయితలు పాఠకులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా సంక్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సరళీకరించి వ్యాసాలలొ అందిస్తున్నారు. రచయితకు ధన్యవాదములు. ఈ వ్యాస పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.