పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16439

  1. జులై 2025 గురించి పారుపల్లి కోదండ రామయ్య అభిప్రాయం:

    07/01/2025 11:27 pm

    చాల బాగా రాసారండి సరి అయిన సమయంలో.

  2. అద్దంలో జిన్నా గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    07/01/2025 10:38 pm

    భూషణ్,
    గత 2023 లో మిల్పిటస్ లో జరిగిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో రచయిత చదవగా ఆ సభా విశేష సంచికలో ప్రచురించిన ప్రసంగ వ్యాసం కదా!. ఆ మాట చివర్న ప్రస్తావించి ఉంటే సంతోషించి ఉండేవాడిని. యథాతథంగానే ఉంది మరి.

  3. ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన గురించి Sanath Pasumarthy అభిప్రాయం:

    06/27/2025 11:13 pm

    ఈ అహింస, శాంతియుత జీవన మనస్తత్వం కొన్ని సందర్భాలలో అవసరమైన ధర్మాగ్రహాన్ని కూడా చంపేస్తుందెమో అనిపిస్తుంది. ఈ బౌద్ధ వాసనలు వంటబట్టబట్టే, క్షాత్రం చూపాల్సిన చోట క్షమను చూపి, ఘజ్నీ, ఘోరీ వంటి వాళ్ళు ఓడినా, క్షమించి వదిలెసే ఆత్మహత్యా సదృశమైన పనులను చేశారు మన రాజులు.

  4. షాంగ్రి-లా – 2 గురించి Ramesh అభిప్రాయం:

    06/26/2025 8:27 am

    మీ యాత్రానుభవాలు ఎంతో అందంగా చక్కగా , బాగుంటాయి, థాంక్స్ అండి.

  5. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Lakshmi అభిప్రాయం:

    06/26/2025 1:42 am

    ఎమర్జన్సీని వామపక్ష నియంతృత్వం అని మొదట కీర్తించింది మహాకవి శ్రీశ్రీ. ఎమర్జెన్సీ సమయంలోనే ఆప్రకటన చేశాడు. అప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ రచయితలు, విప్లవ రచయితలు జైళ్లలో మగ్గుతున్నారు. శ్రీశ్రీ మాటలను అవకాశవాదం, పిరికితనంగా కమ్యూనిస్టు రచయితలు ఖండించారు కూడా. ఇంతకాలానికి శ్రీశ్రీ అభిప్రాయాలను చిలకపలుకులలా వల్లిస్తున్నారు బొల్లోజు బాబా. హిందుత్వ నియంతృత్వం విజృంభిస్తున్న వేళ ఇందిరా నియంతృత్వాన్ని ఆదర్శంగా చూపుతున్నారు బాబా.
    ఈ వరవర రావు వ్యాసం చూడండి. https://www.andhrajyothy.com/2025/editorial/why-sri-sri-was-suspended-by-virasam-1419057.html

  6. పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/23/2025 6:39 pm

    జయదేవ్ గారికి: వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు. “మితి మీరి” అన్న పై వాక్యం లోని సందర్భాన్ని తరువాయి వాక్యం లోని “అన్న” గారి మీద వ్యాఖ్యానానికి అన్వయించుకోవాలి.

  7. పంచేంద్రియాలు: 4 రుచి గురించి జయదేవ్ మెట్టుపల్లి అభిప్రాయం:

    06/19/2025 4:47 pm

    మీ వ్యాసం చాలా బాగుంది. రుచులకు కొత్త కొత్త తెలుగు పదాలు పరిచయం చేశారు. మంచి పరిశోధనా వ్యాసం. “అన్న” గారిలా మాంసాహారం తినడం మంచిది కాదన్నారు?

  8. హిందూ మతం అంటే ఏమిటి? గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:

    06/13/2025 10:24 pm

    @పి. తిరుపాలు
    హ్యూయాన్ సాంగ్ హిందూమతం గురించి చెప్పింది ఇది. తమరు చెప్పింది కాదు.

    Hiuen Tsang, the Chinese Buddhist monk and traveler, observed that Hinduism was more prevalent than Buddhism in India during his visit in the 7th century CE. He noted the presence of various religious faiths and acknowledged the tolerance among people towards different beliefs, with individuals changing their religions voluntarily. Hiuen Tsang also described aspects of Hindu society, including the caste system, the prevalence of Sati, and the education of women.

    Here’s a more detailed look at Hiuen Tsang’s observations:

    Religious Landscape:
    While Buddhism was a significant religion, Hiuen Tsang’s writings indicate that Hinduism was more widespread.

    Tolerance and Religious Freedom:
    He observed a general atmosphere of tolerance where people of different faiths coexisted and could freely choose their religion.

    ఇక ఇస్లామ్ లో ఉండే పరమతసహనం గురించి, హిందువులపై, భారతదేశంపై ముస్లిములకుండే అభిప్రాయాన్ని గురించి తన ‘Pakistan Or The Partition Of India” అనే పుస్తకంలో అంబేడ్కర్ ఇలా అంటున్నారు. The brotherhood of Islam is not the universal brotherhood of man. It is a brotherhood of Muslims for Muslims only. There is a fraternity, but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity.

    Ambedkar opined that Muslims think of Hindus as inferior beings and would find it hard to accept the authority of a Hindu majority government.

    To the Muslims, a Hindu is a Kaffir. A Kaffir is not worthy of respect. He is low-born and without status. That is why a country that is ruled by a Kaffir is Dar-ul-Harb to a Musalman. Given this, no further evidence seems to be necessary to prove that the Muslims will not obey a Hindu government. The basic feelings of deference and sympathy, which predispose persons to obey the authority of government, do not simply exist. But if a proof is wanted, there is no dearth of it. In the midst of the Khilafat agitation, when the Hindus were doing so much to help the Musalmans, the Muslims did not forget that as compared with them the Hindus were a low and an inferior race.

  9. హిందూ మతం అంటే ఏమిటి? గురించి P. తిరుపాలు అభిప్రాయం:

    06/12/2025 1:48 pm

    హిందు మతమంటు లేదన్నది నిజం. హిందు అన్నది ఒక ప్రదేశాన్ని సూచించే మాట. చైనీయ యాత్రికుడు హ్యూహాన్స్చాంగ్ ఇండియా యాత్ర చేసినపుడు ప్రదేశం పేరుగా ‘హిందు’ శబ్దాన్ని తన రచనలలో వాడాడు. అది దేశాన్ని తెలియజేస్తుందేగాని, మతాన్ని కాదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కనుకనే రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అన్న పదం వాడారు. అనేక మతాలు అంటే కేవలం క్రిస్టియన్, ముస్లిం మతం మాత్రమే కాదు. జైన మతం, బౌద్ద మతం, సిక్కు మతం మాత్రమే కాదు, ఈ రోజు హిందు మతంగా వ్యవహారించే మతంలోనే వివిధ మతాలు ఉన్నాయి. వైష్ణవం, శైవం (అందునుండి పుట్టిన పిలకలు – వీరశైవం లాంటివి), శాక్తేయం లాంటివి. ఇంకా స్థానిక గిరిజన మతాలు కూడా! అందుకే బహుళత్వంలో ఏకత్వం అనేది. ఆధునిక మతవాదులు గిరిజన మతాలను కూడా హిందు మతంలో చేర్చి వారి అస్థిత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. హిందువులకు మతసహనం ఎక్కువ అని ఎందుకు అంటున్నారంటే మొదటి నుండి ఇన్ని మతాల మధ్య ఐక్యత ఉంది కాబట్టి. ముస్లిం మతానికి కూడా ఆతాహతు (కలిసి పోవడం) ఉంది. ఆధునిక మతవాదులు మాత్రమే వేరు చేసి చూస్తున్నారు. హిందు మతం ఉండే మత సహనం ఆధునికం కాదు. ఇప్పుడు మాత్రమే మత సహనాన్ని ముస్లిం, క్రైస్తవ మతాల పట్ల చూపలేకపోతున్నారు.

  10. చలం సాహిత్యం-విముక్తి గురించి ప్రతాప్ రెడ్డి ఏ అభిప్రాయం:

    06/12/2025 11:01 am

    శివశంకర్ ప్రసిద్ధ రచయిత. ప్రసంగ వ్యాసం సమతూకంగా చాలా బాగుంది. రచయితకి హృదయపూర్వక అభినందనలు.