పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:23 pm

    Interesting topic – మీ అసలు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

  2. మాగ్నెట్ గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:20 pm

    నచ్చేసింది మానసా!

  3. అందం గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:18 pm

    “చేసిన పాపం చెప్పేసుకుంటే పోతుంది” అన్న ఒక hidden agenda తో రాసిన కథల్లా అనిపిస్తాయి మీవి.

  4. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/14/2018 8:41 pm

    శ్రీ అశ్వఘోష విరచితమ్ బుద్ధచరితమ్ (అర్థ తాత్పర్యములతో) – భాస్కర్ హనుమత్ కొంపెల్ల గారి పుస్తకం అజో విభో కందాళం ఫౌండేషన్ వారి క్రింది లింకు వద్ద లభ్యం :

    https://www.avkf.org/AVKF/publicat/show_details.php?book=19177

  5. అడ్డగాడిద గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/14/2018 1:36 am

    ప్రియమైన శ్రీ ఆకెళ్ల మూర్తి గారూ,

    కడుపునిండా తినగలిగి, తిన్నది అరిగించుకుంటూ, ఆరోగ్యవంతంగా ఉన్న భోజన ప్రియులను చూసి వారికి “దంత సిరి” ఉంది అని అంటారు కదా.

    మరి అలాగే దంత వేదాంతం అంటే తిండికి యావలేక పోవటమా ?

    ” గాడిదలకు తిండి యావ ఉండదు, దొరికినది తిని బతుకుతాయి. వానా గాలీ ఎండా చలీ ఏవీ పట్టించుకోవు. ఎవరేనా తిట్టినా కొట్టినా నోరుమూసుకు భరిస్తాయ్ ” లాంటి ఉవాచలు అన్వయించుకుంటే దంత వేదాంతం గురించి కొంత అర్ధమైనట్లుగా అనిపించటం లేదా!

  6. అడ్డగాడిద గురించి మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:

    11/13/2018 11:47 am

    దంత వేదాంతం అంటే ?

  7. బురద గురించి venkat అభిప్రాయం:

    11/13/2018 6:00 am

    చాలా బాగుంది. నగ్నంగా నిలబెట్టేసారు. చదువుతుంటే, నా గురించేమో అనిపించింది.

  8. నవంబర్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    11/12/2018 3:01 pm

    ఎంత చూసినా ఇందులో బొమ్మ ఏవిటో అర్ధం కాలేదండి. “బొమ్మలు” అన్నారు. ఒకటి కంటే ఎక్కువగా ఉన్నయా? నాకు కనిపించినది ఒకటే. 20 పక్షులు బాగానే ఉంది మరి ఆ కాళ్ళేమిటో కలగాపులగంగా? ఇంతింతై అన్నదానికి అర్ధం స్ఫురిస్తోందా అందులో? నా మట్టిబుర్రకి అందటం లేదు మరి. ఇరవై ఏళ్ళంటే మాటలు కాదు ఈ వేగమైన డిజిటల్ యుగంలో. ఏది ఏమైనా ఏమీ ప్రకటనలు లేకుండా, ఉచితంగా తెలుగు కోసం కష్టపడుతున్న నిర్వాహకులకీ, సంపాదకులకీ అభినందనలు.

  9. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ అభిప్రాయం:

    11/12/2018 3:49 am

    ఏల్చూరి మురళీధరరావు గారికి శత సహస్ర వందనాలు.

    మీ వ్యాసం ఆసాంతం నన్ను కట్టి పడేసింది. గణపవరపు వారి ప్రబంధరాజము మీద ఇంత విస్తృతంగా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.

    ఇకపోతే, పద్య కవిత్వం బాగా అలవడి అదికాస్తా చిత్ర కవిత్వం పై మక్కువ గా మారింది. గర్భ కవిత్వం, ద్వ్యక్షరీ, త్ర్యక్షరి, ముక్త పదగ్రస్తం వంటి ప్రయోగాలు బాగానే చేయగలిగినా ప్రబంధరాజ కావ్యాన్ని దానిపై పరిశోధిత వ్యాసాలను చదివి మరిన్ని మెళుకువలు సాధించాలని ఆశ.

    కాని ఆ పొత్తము అంగడిలో అలభ్యంగా ఉంది. అలాగే అంతర్జాలంలోనూ లభించుట లేదు. అది ఉపలబ్దమయ్యే మార్గము సూచించ గలరు.

    భవధీయుడు
    రాళ్ళపల్లి సున్దర రామ శర్మ
    Akshara Vinyasam
    Natelugu savvadi blogspot.com
    +919440597260

  10. పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/11/2018 10:24 pm

    అడవితల్లి వొడిలో సేదతీర్చుకోవాలనే ధ్యాసే కాని, పురుగూ పుట్రా ఉంటాయ్ జాగ్రత్త జయతి బిడ్డా అంటే ( అదంతా మనమేర్పరచుకున్న భయాందోళనల తప్పు అభిప్రాయాలు అంటూ నవ్విన ); జీవితం సుఖంగా జరుగుబాటు కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోవద్దా అని కేకలేసే ( “How Much Land Does a Man Require?” by Leo Tolstoy కధ సదివినావు గందా అంటూ నవ్విన ); జీవన సాయంసంధ్యలో పనికొస్తుంది డబ్బులు కూడబెట్టాల బిడ్డా అంటే (
    ఉదయ సంధ్య, సాయంసంధ్య, అసుర సంధ్య, గోధూళివేళ వంటి సంధ్యలను ప్రకృతి వొడిలోనుండి వీక్షణానందజనిత తన్మయత్వంతో ఉన్న జయతి బిడ్డ చిరునవ్వు తప్ప మారుమాట్లాడలేదు ).

    అమరేంద్ర గారూ! కాలం నాడు ” భద్రం కొడుకో! నా కొడుకో కొమరన్న” అని విలపించిన గద్దరన్న చేత మళ్లీ భద్రం బిడ్డో! నా బిడ్డో జయతమ్మా అని సుద్దులు చెప్పించాలనిపిస్తోంది అని అన్నా సంటిబిడ్డలా నవ్వుతున్నది మీ జయతి బిడ్డ.