పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46 గురించి bhaskar అభిప్రాయం:

    08/03/2020 4:23 pm

    ఈనె అనగా ఆకు మధ్యలోని స్టెం. ఈనె īne. [Tel.] The stem or centric fibre in a leaf or feather. వేపయీనెలు withes or twigs of the margosa tree. ఈనె గాజులు īne-gājulu. A game played by girls. ఈనుట = బరెగొడ్లు కనుట, ఈను అంటే ప్రసవించు, ఈనె అంటే ప్రసవించు కాదు. ఈను īnu. [Tel.] v. a. To give produce (as fields of grain.) To yean or bear (young.) To give forth, emit (sound, or splendour.) ఈనగాచి నక్కలపాలు చేసినట్టు all one’s care is thrown away. మెరుగులీనిన emitting radiance. నేలయీనిన విధమున as though the earth calved.

    [శ్రీశ్రీ ఇచ్చిన ఆధారం ప్రసవించె- అన్నదానికి ఈనె- అన్నది సరైన సమాధానమే. తెలుగులో ఒక క్రియాపదానికి ఉండే పలు రూపభేదాలు నిఘంటువులో ఉండవు. ప్రసవించు-, ఈను- అన్న క్రియలకు అమహత్ ప్రథమపురుష (3rd person) భూతకాలిక రూపం ప్రసవించె(ను), ఈనె(ను). ప్రసవించెను, ప్రసవించితిని, ప్రసవించెదను, ప్రసవించుచున్నాను అన్న పలురూపభేదాలను (inflections) నిఘంటులలో వెతకడం సబబు కాదు.– సంపాదకులు. ]

  2. ఆలస్యం గురించి gs rammohan అభిప్రాయం:

    08/03/2020 5:45 am

    good one

  3. నీతో నువ్వే గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    08/02/2020 7:20 pm

    ఎంత బాగుందో. నీ భాషలోని రమణీయత, నీ ఆలోచనల భావాల సున్నితత్వం కలిసి ఈ రచనని ఎంతో అందంగా తీర్చిదిద్దాయ్. నీ చూపు తీక్షణమైనదే కానీ అది పొగరుగా సమాధానాలడగదు; అర్థం చేసుకుంటుంది, ఆశ్చర్య పడుతుంది, కృతజ్ఞత చెప్తుంది.

  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 46 గురించి manjari lakshmi అభిప్రాయం:

    08/02/2020 7:09 am

    అందెల రవళి అంటే గల గల అనిపెట్టి, నోటి కూత అంటే ఈల అని పెట్టాలి. ప్రసవించెకి ఈనె సరిపోతుంది.

    [సవరించినాము. తప్పు చూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  5. వెంకట సత్య స్టాలిన్ గురించి ఇంద్రకంటి వేంకటేశ్వర్లు అభిప్రాయం:

    08/01/2020 11:33 pm

    ఇడ్లీకంటే చెట్నీ బాగుండడం అంటే ఇదే. నా సమీక్ష కంటే రామయ్యగారి స్పందనే అద్భుతంగా ఉంది.

  6. రెండో కథలు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/01/2020 11:03 pm

    A good attempt to tell the Rendo Katha.
    Made me to revisit Chimamanda Adichie’s Ted Talk: The Danger Of A Single Story.

  7. ప్రయాణం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/01/2020 9:04 pm

    చక్కని కథ. చివరిలో ‘అదేమిటో’ అన్న మాట లేకుంటే బావుండేది.

  8. వెంకట సత్య స్టాలిన్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    08/01/2020 9:34 am

    కర్నూలు సాహితీ పెద్దలు ప్రియమైన శ్రీ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు గారూ… త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్ ఉల్ అద్హా) పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజెయ్యమని చెప్పారు స్టాలిన్ (శ్రీరమణ గారి కాలాతీత, భాషాతీత, దేశాతీత వ్యక్తి వెంకట సత్య స్టాలిన్).

    స్థలాభావం వల్లన్నో మరెంచేతనో మీరు ప్రస్థావించని స్టాలిన్ విశ్వరూపంలోని మరో దృక్కోణం: స్వతంత్ర భారత దేశంలో కాశ్మీర్ సంస్థానం విలీనం కోసం తను పోషించిన పాత్ర.

    ఇటు కాశ్మీరీ ముస్లిం సోదరులు, అటు పాకిస్తాన్ సరిహద్దు పఠాన్ గిరిజనుల మనోభావాలను…. సంశయాల డోలాయమానంలో ఊగిసులాడుతున్న కాశ్మీర్ సంస్థానీధీశుడు మహారాజా హరిసింఘ్ కు వివరించి, నచ్చచెప్పి తన రాజ్యాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చెయ్యమని నచ్చచెప్పవలసిందిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టాలిన్‌ను అభ్యర్థించాడు. రంగం లోకి దిగిన స్టాలిన్ అటు పాకిస్తాన్ జాతి పిత (కాయద్ ఎ ఆజం) మహమ్మద్ అలీ జిన్నా, ఇటు కాశ్మీరు సింహం షేక్ అబ్దుల్లా, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ లను తన చాణుక్యనీతితో ఒప్పించి (ఒకప్పటి సహోద్యోగులు, స్నేహితులు పాకిస్తాన్ లోని ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్, భారత్ లోని ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప లకు తలనొప్పి లేకుండా చేసి) చాచా నెహ్రూ కోరిక శాంతియుతంగా సఫలీకృతం చేసాడు.

    స్టాలిన్ చూపిన చాకచక్యానికి 1947 సంవత్సరం లోని ఆఖరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డు మౌంట్ బాటన్ ….1948 జూన్ నుండి 1950 జనవరి 26 వరకూ మొదటి భారతీయ గవర్నర్ జనరల్ గా కొనసాగిన రాజాజీ ( చక్రవర్తి రాజగోపాలాచారి ) కూడా అవురా స్టాలిన్ అని ముక్కున వేలేసున్నారు.

    కానీ ఇవన్నీ బయటకు చెప్పుకోవడం స్టాలిన్‌కు ఇష్టం ఉండదు.

  9. విజయం గురించి SrInivAs bandaa అభిప్రాయం:

    08/01/2020 2:40 am

    ధన్యవాదాలు రహ్‌మాన్‌గారూ!

  10. శిలాలోలిత : విషయ సూచిక గురించి udaya అభిప్రాయం:

    07/31/2020 12:05 am

    చాల చదువుతాము కాని ఏ కొన్నో పదే పదే మనస్సును పలకరిస్తాయి అందులో రేవతి దేవిగారి శిలాలోలిత నన్ను ఎంతగా కదిలించిందంటే — ఆ కవితల వెనకాల భావాలు –అక్షరాలతో వ్యక్తీకరించటానికి నేను రేవతి దేవిగారిని కాదే