పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. కృష్ణరాయల కవిపోషణ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/06/2006 1:47 pm

    ఒక రచననీ దాని రచయితనీ వేరుగా చూడగలగటం విమర్శకుడి తొలికర్తవ్యం. అలాకానప్పుడు అసలు విషయాన్ని కూడ అనవసర వ్యక్తిగత ప్రసక్తితో కలిపి అవతలపారెయ్యటం జరుగుతుంది.

    ఇకపోతే ఇక్కడ వున్న విషయం “నిర్ణయాలు (లేదా సిద్ధాంతాలు) శాస్త్రీయంగా (అంటే scientific గా) సాధారాలు, సహేతుకాలు ఐన మార్గాల ద్వారా సాధించారా లేక వట్టి ఊకదంపుడు ద్వారానా” అన్నది. మరో ముఖ్యమైన విషయం – ఒక నిర్ణయం సాధించటానికి ఇంతశ్రమ అవసరంఐతే ఒక సందేహం లేవనెత్తటానికి ఉన్న ప్రమాణం ఇంతకన్న చాలా తక్కువ అనేది. ఒక సిద్ధాంతాన్ని disprove చెయ్యటానికి ఒక counter-example సరిపోయినట్లు ఒక సందేహం లేవనెత్తటానికి ఒక ఆధారం చాలు.

    వెల్చేరు గారు చేసినది నా దృష్టిలో అలాటిపని. ఆయన పరిశోధకుడు. పరిశోధకుల పని ప్రశ్నలు వెయ్యటం, సందేహాలు రేపటం. అలాకాకుండా అదివరకు అందరూ నడుస్తున్న దారినే కళ్లుమూసుకుని వెళ్లేవారు పరిశోధకులు కారు; వారి వృత్తికే అన్యాయం చేసినవారు. ప్రచారంలో వున్న నమ్మకాల్ని ప్రశ్నించి అవి శాస్త్రీయంగా సమర్ధనీయాలే అని రుజువు చెయ్యటం పరిశోధకుల పని. అదివరకు చూడని కొత్తకోణాలున్నాయేమోనని వెదకటం వారి కర్తవ్యం. అలా చేసినప్పుడే చర్చలు, వాటిద్వారా కొత్తవిషయాలు వెలికిరావటమూ జరుగుతాయి. ఒకానొకచో కొత్తవిషయాలు రాకపోయినా పాతవాటినే కొత్తవిధంగా చూడటం ఐనా జరుగుతుంది . ఇదీ ఆధునిక పరిశోధనా మార్గం.

    నిజానికి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా – ఆయన ఆ సందేహం వెలిబుచ్చబట్టే ఇంత చర్చా సాధ్యమైంది.

  2. ‘వ్యయ’ ప్రయాస గురించి kari venkataratnam babu అభిప్రాయం:

    05/06/2006 10:48 am

    క్రొత్తపూల నెత్తావులతొ మత్తు గాలి వీచగా-వెండితెర పాట-నెర కు అందమ ను అర్థము-నెర జాణ పదము వలె-వాసన కి తావి పర్యాయపదమా? కాక
    మకరందానికా? గొల్లపూడి గారు సెలవియ్యవలె-

  3. మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2 గురించి yoga అభిప్రాయం:

    05/06/2006 7:50 am

    ఈ అనువాద సీర్షిక ని అందిస్తున్న అఫ్సరు గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇది కొత్త రచయిర(త్రు) లకు చాలా స్ఫూర్తి దాయకంగా మార్గ దర్శకంగా ఉంటుంది.
    యోగా.

  4. సివిలైజ్డ్ ఇన్ అమెరికా గురించి itsme అభిప్రాయం:

    05/05/2006 9:45 pm

    తన భార్య ఆరు నెలల ఎఫైరు ను తెలుసుకోలేని పిచ్చి వాడి కథ ఫన్నీ గా ఉంది

  5. ‘వ్యయ’ ప్రయాస గురించి itsme అభిప్రాయం:

    05/05/2006 9:29 pm

    గొల్లపూడి గారు, చాలా బాగున్నాయి మీ రచనలు. మరిన్ని ఆశిస్తూ
    మీ అభిమాని
    శ్రీకర్

  6. ఎంగేజ్మెంట్ గురించి itsme అభిప్రాయం:

    05/05/2006 9:26 pm

    దీనిని కథ అని కూడా అంటారా???

  7. ఈమాట కొత్త వేషం గురించి yoga అభిప్రాయం:

    05/05/2006 5:25 pm

    దయ చేసి ఈ మెయిలు అడగద్దండీ. స్పాం మెయిలు ఎక్కువయిపోతుంది. బుధ్ధిలేని anonymous కామెంట్సు తగ్గించడానికి “log on” సౌకర్యం పెడితే మంచిది..

  8. ఈమాట కొత్త వేషం గురించి yoga అభిప్రాయం:

    05/05/2006 5:21 pm

    ఈ కొత్త రూపం అత్యంత అద్భుతం గా ఉంది. సూపరు!

  9. కృష్ణరాయల కవిపోషణ గురించి kari venkataratnam babu అభిప్రాయం:

    05/05/2006 12:00 pm

    అల్ల సాని పెద్దన కు సంబంధిచిన inscriptions whatisindia.com లొ చదివితిని.అవి రాయలసీమ ప్రాంతానివి.పెద్దన కు దానమీయబడిన భూములు వివరాలు వున్నాయి.రిసెర్చి కి చాల అనుకూలమయిన వెబ్ .

  10. గతం గురించి pAlana అభిప్రాయం:

    05/05/2006 9:33 am

    “నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడటానికే తప్ప
    నిన్నెటూ తీసుకు వెళ్ళవు”
    **** ఇది కవిత్వమా? లేక ఏదో దారంట పోతూ చేస్కుంటున్న స్వగతమా? నిజానికి చెప్పుకోవాలంటే, రాతి మెట్లమీద, లతలూ పూలతలూ వుండవు. రాతి స్థంభాలమీద లతలు పుష్పలతలు అల్లుకుంటాయి. అది ప్రకృతి లక్షణం. మెట్లమీద ప్రాకే లతలు తొక్కబడి బక్కచిక్కిపోతాయి, ఎండిపోతాయి. వాటిని “ట్రాంపుల్డు వైన్సు” అంటారు. పోనీ, ఆ మెట్ల మీద పూలతలు (మాలతీ, అడవి జాజి, విరజాజి, చంద్రిక) అంటుకు అల్లుకున్నాయి అనుకుందాము. కర్మానికి చతికిల పడ్ద ఆసామి, వాటి పుష్ప పరిమళాన్ని ఆస్వాధించే అదృష్టానికి నోచుకున్నాడనుకోవచ్చును కదా కవి. నల్లరాతి మెట్ల మీద చతికిల పడ్డ ఆసామి మెట్లు ఎక్కడికో తనని తీసుకు పోతాయని చతికిలపడడు. ఫూలు కాకపోతే పూలతల మీద పిర్రమోపడు. కర్మ కాలితే లత పామై కరుస్తుంది. గ్రహచారం చెడితే లతల్లో నల్లటి నాగులు నల్లరాతి నలుపులో కలిసి, చతికిల పడ్ద ఆసామీని ఛటుక్కున కౌగిలించుకుంటాయి. అయినా, మెట్లెక్కిన వ్యక్తి, మెట్లమీద చతికిలపడ్డానికి కారణం, గమ్యంలో అలసిపోవడం. అలిక తీరిన తరువాత తిరిగి ప్రయాణం ముందుకు. గమ్యం చేరే వరకూ ఎన్ని పర్యాయాలు నల్లరాతి మెట్లమీద చతికిల పడాలో? ఆహా! నిజంగా! చతికిలపడ్ద ప్రతీ మెట్టూ ఆసామీని మరింత ముందుకునెట్టే మెట్టు. కవి చెప్పినది నిజం కాదు. నిజానికి ఆ నల్లరాతి మెట్టు ప్రగతిపధానికి ప్రధమ సోపానం! పాములు లేని పూలతలు ఆ మెట్లమీద అల్లుకు అంటుకున్నాయనుకో, మరీ మంచిది. ముందు ప్రయాణం మధురం!
    కాబట్టీ …. ఇది కవితైతే, ఇలా మారిస్తే, చదువుకున్న వాడికి ఆనందాన్నిస్తుంది:
    నల్లని రాతిమెట్లు
    అల్లుకొన్నవి లతలు పూవులు
    చతికిల పడితే తప్ప
    నింగికి నిన్ను తీసుకు వెళ్ళవు !

    ***పాలన*****

    రెండో కవిత మీద “అభిప్రేమ” రేపు!