పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. తెలుగు సాహిత్యంలో విమర్శ గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    11/08/2006 5:16 am

    #
    ఉమాకాంతం గారి “నేటి కాలపు కవిత్వం” చదివిన తరువాత నాకైతే అతనికి ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము లోపించాయని అనిపించలేదు. మరి కృష్ణశాస్త్రిగారికి అనిపించింది. ఏది నిజం ఏది కాదు అంటే ఎవరు చెప్పాలి? అయినా ఇవి కావేమో విమర్శకుడికి ఉండల్సిన ముఖ్యార్హతలు.

    ఆర్ద్ర దృష్టి కవితా హృదయము కన్నా వేలూరి గారన్నట్లు నిష్పక్షపాత దృష్టి, నిజాయితీ హృదయమే విమర్శకు ఎక్కువగా కావలసిన సామగ్రి అనుకుంటాను.

    చదవగానే వినగానే మైమరిచి కరిగిపోయే ఆర్ద్రదృష్టి, భావాల వెల్లువలో తూలిపోయే కవితా హృదయం, భావ సమాధికి తన్మయత్వానికి సాయపడుతాయి కాని, పలు దృక్కోణాలనుంచి సమగ్రంగా అవగాహన పొందడానికి, సంయమనంతో విశేషంగా విశ్లేషించడానికి సాయపడడం కన్నా, అవి కొంత అడ్డుగానే నిలబడతాయని అనుకుంటాను.

    రచనలు పలు రకాలైనప్పుడు విమర్శలు కూడా పలు రకాలుగా ఉండడం సహజమూ అనివార్యమూ కూడా. అయితే రకాలు ఎన్నైనా, విషయం పాఠకునికి అందించడమే రచనలన్నింటి ఉద్దేశం. ఆ ఒక్కటి నెరవేర్చడంలోనే ఎన్నో ప్రక్రియలు, మార్గాలు, వైవిధ్యాలూ, సొగసులు, సృజనాత్మకమైన ప్రయోగాలు అన్నీనూ.

    అట్లే విమర్శలు ఎన్నో రకాలున్నా విమర్శించే రచన గురించి విశేషమైన అవగాహనను అందించే వరకూ అవి అన్నీ విమర్శలే, ఖచ్చితంగా. అయితే విశేషమైన అవగాహన కలిగించడం సుళువైన పని కాదు, కొన్ని సార్లు రచన కన్నా కష్టతరమైనది కూడా.

    మరి సమగ్ర విమర్శకు ఏమి కావాలి ? విమర్శకునికి రచనలో ఉన్న లోతులను చూసే నిశితమైన దృష్టి, అది వ్యక్తపరచే భావాలను అందుకునే హృదయ వైశాల్యం, సోంత ఇష్ట అయిష్టాలకు అందనట్టి ఎత్తులో ఉన్న నిష్పక్షపాతం – ఇవ్వన్నీ ఉంటేనే సమగ్రమైన అవగాహన పొందడానికి కానీ, ఇతరులకు అందించడానికి కాని సాధ్యం కాదనుకుంటాను. ఇక అవగాహన పెరుగే కొద్దీ విమర్శ యొక్క అభివ్యక్తీకరణలో స్పష్టత, క్లుప్తత వస్తుంది, సహజంగా. సూటిదనం కూడా ఉండి పాఠకున్ని విసిగించదు.

    మరి విమర్శ చేయడానికి ప్రేరణ, శిక్షణ అవసరమా అంటే తప్పకుండా అవసరమే. అయితే ప్రేరణ అందుకునేదే కాని అందించేది కాదు. ఇక శిక్షణా పద్ధతులు మాత్రం చర్చనీయాంశం.

    చివరగా ఒక్క మాట. తెలుగు భాష యొక్క వెలుగే తగ్గుతున్న రోజుల్లో తెలుగు సాహిత్యం పై చేసే విమర్శలో శిక్షణకు ఎంత priority ఉందో, ఉండాలో తెలియదు. తెల్లటి బట్టపై చిన్న మరక పడితే వేలెత్తి చూపిస్తారు కాని, పూర్తిగా మాయకపోయినా తెలె తెల బోయే బట్టపై మరకలను ఎవరు వెతికి చూపిస్తారు! రచనలు ఎక్కువగా నిస్సారమైనప్పుడు గొప్ప విమర్శలు మాత్రం ఎక్కడినుంచి వస్తాయి అని అనుకుంటాను.

    విధేయుడు
    -Srinivas

  2. తెలుగు సాహిత్యంలో విమర్శ గురించి విప్లవ్ అభిప్రాయం:

    11/07/2006 8:26 am

    వేలూరి గారు రెండు ఉద్దేశాలు చెప్పారు మొదట్లోనే, అందులో ఒకటి:

    “సాహిత్య విమర్శలో ఈ పక్షపాతం అనావశ్యకమైన ఆవేశం గా మారితే, ఆ విమర్శ ల వల్ల సాహిత్యానికి, సాహిత్య విమర్శకీ వచ్చే నష్టాల వివరణ ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి.”

    ఇందులో కొంతైనా నెరవేరినట్టుంది. ఆయన రెండవ ముఖ్యోద్దేశం గా చెప్పినది (“ఈ స్థితినుంచి తేరుకోవడానికి (విముక్తికి) మార్గాలేమయినా ఉన్నాయా”) కొద్దిగా నైనా జరగాలంటే పై మొదటిది విమర్శకులు దాటుకుని వెళ్ళాలి.

    నాకు చాలా డౌట్లు ఉన్నయి, వాటికి తొందర లేదు.

    కామేశ్వర రావు గారన్న మాట:

    “రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు.”

    ఈ మాట మీద కొంచెం వివరణ అవసరం అనుకుంటాను. నా ప్రశ్న: మనం మార్క్సిస్టు విమర్శ అనే సిద్ధాంతకోణం లోనించి ఒక శతాబ్దం లేక దశాబ్దం లో వచ్చిన సాహిత్యాన్ని critic చేయటం తప్పంటారా? (“మార్కిస్టు విమర్శ” మీద అభ్యంతరాలు ఉంటే దాని బదులు మోరలిస్ట్ విమర్శ కాకపోతే మరొకటి అనుకోండి ఇప్పటి మటుకు).

    విప్లవ్

  3. నామాట: సాహితీ సదస్సులు – సంబరాలు గురించి lakshmi అభిప్రాయం:

    11/07/2006 7:25 am

    చాలా బాగా చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లొ సమీక్షలు చాలా అవసరం అని అనిపిస్తోంది.

  4. పనిపిల్లలు గురించి Akella అభిప్రాయం:

    11/07/2006 3:52 am

    కథలో ఏదో చెప్పాలనే తపన ఉంది కానీ ఏమి చెప్పాలో దిశానిర్దేశం లేదు, అసంపూర్తిగా ముగిసిందనిపించింది

  5. పనిపిల్లలు గురించి Sriram అభిప్రాయం:

    11/06/2006 12:04 pm

    Hi Prasad, it’s good…

  6. తెలుగు సాహిత్యంలో విమర్శ గురించి Alok Vastav అభిప్రాయం:

    11/06/2006 10:57 am

    కామేశ్వరరావు గారు పొరబడ్డారు.అక్కిరాజుగారు తమ గ్రంధంలో ఎక్కడా “ఇది నా అభిప్రాయం, “ఈ కవిత నా అభిప్రాయానికి అనుగుణంగా లేదు”, “లేదు కాబట్టి ఇది కవిత గాదు” అని ఎక్కడా అనలేదు.అల్లా అనడం బుద్ధితక్కువదనమని మనకే తెలిసినపుడు వ్యాకరణ, తర్క నిష్ణాతుడైన ఆయనకు తెలియకపోవడమేంటి?

    తాను మండన జేసిన ప్రతి సిద్ధాంతానికీ వేద, పురాణ, ఇతిహాస, అలంకారశాస్త్రం వంటి ప్రామాణికగ్రంధాలను ఉదహరించారు.అక్కడే కట్టమంచివారికీ అక్కిరాజుగారికీ తేడా కనపడేది. ఎవరైతే ప్రత్యక్ష, అనుమాన, ఆగమాలను వాడకండా వాదిస్తాడో అది సిద్ధాంతమవదు రాద్ధాంతమౌతుంది.

    అల్లా ప్రామాణికంగా రాసిన విమర్శని నిరుపయోగమైన సెంటిమెంటులతో తోసిపుచ్చడం పరిణితి చెందని మనసులకే సాధ్యం.

  7. తెలుగు సాహిత్యంలో విమర్శ గురించి Kameswara Rao అభిప్రాయం:

    11/06/2006 10:04 am

    ఇక్కడ కృష్ణశాస్త్రిగారన్న “ఆర్ద్రత”, “కవితాహృదయం” అన్న పదాలని కొంత స్పష్టపరచాలి. వేలూరి వారీ వ్యాసంలో చెప్పినట్టు, రకరకాల కవిత్వాలకి ఒకే విమర్శసిద్ధాంతాన్ని వర్తింపచెయ్యడం తప్పు. ఒకో రకం కవిత్వానికి ఒకో రకమైన రూపం, వస్తువు, పాఠకవర్గం, ప్రత్యేక ప్రయోజనాలూ ఉంటయి. వాటికి తగట్టు ఆ కవిత్వానికి ప్రమాణాలు ఏర్పడతాయి. వాటిని అర్థం చేసికొని దానికి తగినట్టు విమర్శ చేస్తే అది సహృదయ విమర్శ అనిపించుకుంటుంది. లేకపోతే, ఎంత మంది ఎంతగా ఇష్టపడితే నాకేంటి, నేను మెచ్చిందే కవిత్వం అన్నట్టుంటుంది. సహృదయ విమర్శ అంటే ఊరికే రాసిన వాళ్ళను పొగడటం కాదు. వాళ్ళ కవిత్వాన్ని సరిగా అంచనా వేసి (పైన పేర్కొన్నట్టు), దానికి తగట్టు విమర్శించడం. అక్కిరాజు వారీ పని చెయ్యలేకపోయారు.

  8. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి PATHAKUDU అభిప్రాయం:

    11/06/2006 8:56 am

    త్రేతాయుగంలోనే, ద్వాపరయుగానికి చెందిన “భాగవతం” అనే పదం సీతకి ఎలా తెలుసు? ఈ పదానికి వేరే అర్థం కూడా వుందా?
    అడవుల్లో కాపాడేవాళ్ళు ముందు నడుస్తారా, లేక వెనక నడుస్తారా?
    సృష్టికర్త బ్రహ్మకి నారదుడు చెబితేనే గానీ, రామాయణ కథ తెలియదా?
    అంగదుడు రాజవడమేమిటీ? సుగ్రీవుడు కదా రాజు? అంగదుడు యువరాజవుతాడు. రాజూ, యువరాజూ ఒక్కటేనా?
    పడవుల్లో వెళ్ళడానికి సముద్రుడిని అడగడం ఎందుకు, నీళ్ళమీద రాళ్ళేసుకుని వెళ్ళాలంటే అడగాలి గానీ? అడగకపోతే కోపం వొచ్చి, పడవులని ముంచేస్తాడా సముద్రుడు?
    “కాలిలో ముల్లు కూడా తియ్యడు మీ అన్న” అని సీత అనడానికి ఆధారం ఏమిటి?
    తప్పుగా అడిగితే, మన్నించండి.

  9. బహుశా ఇంకో నిజం గురించి Akella అభిప్రాయం:

    11/06/2006 5:05 am

    Time waste story, why its so boring on the net normally, why again in eemata, this kind of stuff?

  10. రాత్రి నృత్యం గురించి Alok Vastav అభిప్రాయం:

    11/06/2006 4:26 am

    OK