Comment navigation


15534

« 1 ... 1545 1546 1547 1548 1549 ... 1554 »

  1. కృష్ణరాయల కవిపోషణ గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:

    05/07/2006 5:12 am

    1. రామారావుగారు “రాయవాచకాన్ని మంత్రులకోసం రాసిన పాఠ్యపుస్తకంగాను, “కృష్ణరాయవిజయాన్ని” రాయల యుద్ధవిజయాల మీద కావ్యంగాను “క్లుప్తీకరించడం” ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి ఈ రెండు పుస్తకాల మీద విస్తృతమైన పరిశోధనా వ్యాసాలే వెలువడ్డాయి. ముఖ్యంగా శ్రీ సి. వి. రామచంద్రరావు రాసిన 2 పుస్తకాలు, “రాయవాచకం”పై P. Wagoner విస్తృతానువాదం/చర్చ: Tidings of the king ఈ సందర్భంలో చూడదగ్గవి.
    రామారావే గారే ఉదహరించిన Textures of time లో 30-40 పేజీల చర్చ వుంది. ఇంకా చాలా చెప్పవలసి వుంది కానీ, ఇది సరయిన జాగా కాదేమో!

    2. కామేశ్వరరావుగారు (2006లో కూడా) ఆముక్తమాల్యద కావ్యకర్త రాయలుకాదనే వాదనను కొట్టివేయలేం అనడం కూడా నాకాశ్చార్యాన్ని కలిగించింది.

    3. విప్లవ్ గారు కోరిన/అడిగిన (సాంఘిక, సామాజిక) స్థితిగతులపైన సమాచారం నిజానికి అందుబాటులోనే వుంది. గత 30-40 సంవత్సరాలలో అధిక సంఖ్యలో పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు (ఎక్కువభాగం పాశ్చాత్యులవి) వెలువడ్డాయి.
    ఆ మాటకొస్తే, నారాయాణరావుగారు సందేహించినట్లు, రాయలు కవి పక్షపాతి అని చూపించే ఆధారాలే ఈనాటికీ బయటపడలేదు.

    4. అష్టదిగ్గజాలు వున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆరుద్ర “సమగ్రాంధ్రసాహిత్యం”లో ఇవ్వబడిన Table ని చూడండి. ఇక్కడా కూడా చాలా వివరణ అవసరం వుంది. ఇది 17 శతాబ్దంలో వచ్చిన ఒక phenomena. భోజుడిగురించి, అక్బర్ గురించి … ఇలాంటి కథలే ఆ కాలంలో ప్రచారంలోకి వచ్చాయి.

    5. Burton Stein, Vasundhara Filliozat, రాళ్ళపల్లి చేసిన రచనలు ఆకాశానికి ఎత్తివేయబడ్డాయి. రాళ్ళపల్లి రాయల మీద రాసినవి నాకు తెలిసి మూడు వ్యాసాలు. ఆ మూడు వ్యాసాల్లో ఎక్కడ మన ప్రస్తుత చర్చకు ఉపయోగపడే విషయాలున్నాయో ఆ చరిత్రను “అవలోడనం” చేసిన విజ్ఞులు తెలుపగలరు. అలానే Stein, Filliozat రచనలు కూడా.

    ఏదేమయినా, తెలుగు వారి సౌకర్యార్థం గత 30 యేళ్ళలో “విజయనగరం” మీద English, French, Portugese, German లలో వచ్చిన పరిశోధనా విషయాలను క్రోడీకరించి రాయవలసిన అవసరం వుందని అనిపిస్తుంది.

    భవదీయుడు,
    శ్రీనివాస్

  2. ఎంగేజ్మెంట్ గురించి Srikar గారి అభిప్రాయం:

    05/06/2006 10:47 pm

    Thank you viplav garu, looking for more “stories” from ur keyboard.

    Srikar (itsme)

  3. యథార్థ చక్రం – 1 గురించి Srikar గారి అభిప్రాయం:

    05/06/2006 10:36 pm

    waiting for next part!

  4. కృష్ణరాయల కవిపోషణ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    05/06/2006 9:43 pm

    భూషణ్ గారు కోట్ చేసిన పేరా తరువాత అదే తెలుగు నాడిలో వెల్చేరు గారు ఒక వాక్యం రాసారు: “ఇదీ ఈ పద్యానికి పైకి కనిపించే అర్ధం.” అని.

    ఆ తరువాత ఎలా అర్ధం చేసుకోవాలో చెబుతూ, పండితులు కవులు రాజాశ్రయం కోసం వస్తారు … వాళ్ళకు అగ్రహారాలూ, అక్షర లక్షలూ ఇవ్వక్కరలేదు … అంటూ కనీసం రెండు రకాలుగా అర్ధాలు చెప్పారు (సంపాదకులు ఆ పూర్తి వ్యాసం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం వల్ల నష్టం లేదు అనుకుంటాను, ముఖ్యంగా ఆ శీర్షిక పేరు: “ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక” అన్న విషయంతో సహా).

    అయినా ఇంత చిన్న పరిచయానికే “కృష్ణరాయల కీర్తికే కళంకం” వచ్చేట్లయితే, ఆ కీర్తి ఆనుపానుల మీద నిజంగా డౌటు వచ్చి తీరాలి.

    నాదొక సందేహం:

    (అన్ని వ్యాఖ్యలనూ పక్కకు పెట్టి నాకు నేను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేసాను).
    ఇది ఒక ఉపమానం అయి ఉండవచ్చా: పండితులకూ, భిక్షులకూ ఊళ్ళు పంచి ఇస్తే — ముఖ్యంగా డబ్బు దస్కం, ఈ రెండు కులాల వారిని కులభ్రష్టులుగా మిగులుస్తుంది, అందుకే వాళ్ళ పట్ల భక్తి చాలు అని అన్వయించుకుంటే తప్పు ఎక్కడ?

    విప్లవ్

  5. ఎంగేజ్మెంట్ గురించి విప్లవ్ గారి అభిప్రాయం:

    05/06/2006 9:03 pm

    itsme:
    >దీనిని కథ అని కూడా అంటారా???

    I know, itsme గారూ, నాకూ అదే సందేహం వచ్చింది.

    Brhamanandam Gorti:

    >మీ కథలకి తెలుగు పేరు పెడితే బాగుంటుంది.

    ఎంగేజ్మెంట్ తెలుగే అనుకుంటా! వరపూజ, నిశ్చితార్ధం లాంటివి అమెరికా తెలుగు వాళ్ళు చేసుకోగా వినలేదు. అమెరికాలో అయినా ఇండియాలో అయినా, చేసేవి అవే అయినా ఎంగేజ్మెంట్ అనేదే ఇప్పటి వాడుకగా విన్నాను.

    >మన భాషని కాపాడుకోవలసిన బాధ్యత మనదే, ముఖ్యంగా
    > రచయితల దని నా నమ్మకం.

    రచయితలకు రాయడమే ఒక తలనొప్పి అనుకుంటే దానికి తోడు భాషను కాపాడటం అనే మరో జంఝాటాన్ని తగిలిస్తే ఇప్పటి రాజకీయ నాయకులూరుకోరు. కొన్నేళ్ళ కిందట ఒక పెద్ద నాయకమ్మణ్యులు అనగా విన్నది, “వీళ్ళని స్టేజీలెక్కించి చెడగొట్టేది మేమే అనేది మరిస్తే ఎట్లా!” అని ఒకానొక అమెరికా తెలుగు సభల్లో విని నాకాశ్చర్యం కలగలేదు. ఆయన సిద్ధాంతాన్ని నిరూపించినట్టవుతుంది, రచయితలు రాయాలని అనుకోక మరింకేదో తలకెత్తుకుంటే.

    అది నా ప్రస్తుత నమ్మకం.

    విప్లవ్

  6. ఈమాట కొత్త వేషం గురించి పద్మ గారి అభిప్రాయం:

    05/06/2006 7:44 pm

    దయ చేసి ఈ మెయిలు అడగద్దండీ. స్పాం మెయిలు ఎక్కువయిపోతుంది. బుధ్ధిలేని anonymous కామెంట్సు తగ్గించడానికి “log on” సౌకర్యం పెడితే మంచిది..

    ఈమాట సంపాదక వర్గం మీ ఈ మెయిలు ని వేరే ఎవ్వరికీ ఇవ్వదనీ, ఈమాట వల్ల మీకు స్పాం/లేదా ఇతర unsolicited మెయిలు రాదనీ పూర్తి నమ్మకంతో చెప్పగలను.

    కొన్ని అరుదైన సందర్భాల్లో, ఈమాట పాఠకులని తమ అభిప్రాయం విషయమై సంప్రదించవలసి వస్తుంది. పాఠకులు “ఉత్తుత్తి ఈమెయిలు” ఉపయోగించినప్పుడు సంప్రదించే వీలు లేక ఆ అభిప్రాయం తిరస్కరించబడే అవకాశం ఉంది.

    logon వల్ల పాఠకులు ఇంకొక అదనపు పాస్ వర్డ్ ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది కదా! ఈ అసౌకర్యం వల్ల పాఠకులు తమ అభిప్రాయం తెలియచేయకుండానే తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ, comment spam ఎక్కువగా ఉంటే ఈమాట లో login గురించి పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటి దాకా ఈమాటలో వచ్చిన అభిప్రాయాలు స్థాయిలో ఈమాట రచనలకి సరితూగగలిగేలా ఉన్నాయి. “..ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు, ఒప్పు తప్పొరయు రసజ్ఞుల..” కన్నా ఏ పత్రిక కోరేదేముంది? 🙂

  7. కృష్ణరాయల కవిపోషణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/06/2006 4:59 pm

    వెంకటరత్నంబాబు గారు ఇచ్చిన reference చాలా ఉపయోగకరమైంది. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ వెబ్ సైట్ లో అల్లసాని పెద్దన దానాలను వివరించే శాసనాలు మూడున్నాయి. అవి 65, 66, 68 అంకెలవి. ఆ లింక్ ఇది – http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_16/stones_51_to_75.html

    ఐతే ఈ శాసనాలు చెప్పే సీమలు పెద్దనకు ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో ఇవి చెప్పవు. కృష్ణరాయల అధికారంలో వున్నాయని, పెద్దనకు వాటి మీద కొన్నిరకాల హక్కులున్నాయని చెప్తాయి గాని అంతమాత్రం చేత రాయలే అవి ఇచ్చి వుండనక్కర్లేదు. అంతకు ముందు పాలించిన వీరనరసింహుడో సాలువ నరసింహుడో ఐనా ఐవుండొచ్చు. ఏమైనా, ఈ సైట్ గురించి మనందరికీ చెప్పిన వెంకటరత్నంబాబు గారికి మళ్లీ కృతజ్ఞతలు.

  8. కృష్ణరాయల కవిపోషణ గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    05/06/2006 1:47 pm

    ఒక రచననీ దాని రచయితనీ వేరుగా చూడగలగటం విమర్శకుడి తొలికర్తవ్యం. అలాకానప్పుడు అసలు విషయాన్ని కూడ అనవసర వ్యక్తిగత ప్రసక్తితో కలిపి అవతలపారెయ్యటం జరుగుతుంది.

    ఇకపోతే ఇక్కడ వున్న విషయం “నిర్ణయాలు (లేదా సిద్ధాంతాలు) శాస్త్రీయంగా (అంటే scientific గా) సాధారాలు, సహేతుకాలు ఐన మార్గాల ద్వారా సాధించారా లేక వట్టి ఊకదంపుడు ద్వారానా” అన్నది. మరో ముఖ్యమైన విషయం – ఒక నిర్ణయం సాధించటానికి ఇంతశ్రమ అవసరంఐతే ఒక సందేహం లేవనెత్తటానికి ఉన్న ప్రమాణం ఇంతకన్న చాలా తక్కువ అనేది. ఒక సిద్ధాంతాన్ని disprove చెయ్యటానికి ఒక counter-example సరిపోయినట్లు ఒక సందేహం లేవనెత్తటానికి ఒక ఆధారం చాలు.

    వెల్చేరు గారు చేసినది నా దృష్టిలో అలాటిపని. ఆయన పరిశోధకుడు. పరిశోధకుల పని ప్రశ్నలు వెయ్యటం, సందేహాలు రేపటం. అలాకాకుండా అదివరకు అందరూ నడుస్తున్న దారినే కళ్లుమూసుకుని వెళ్లేవారు పరిశోధకులు కారు; వారి వృత్తికే అన్యాయం చేసినవారు. ప్రచారంలో వున్న నమ్మకాల్ని ప్రశ్నించి అవి శాస్త్రీయంగా సమర్ధనీయాలే అని రుజువు చెయ్యటం పరిశోధకుల పని. అదివరకు చూడని కొత్తకోణాలున్నాయేమోనని వెదకటం వారి కర్తవ్యం. అలా చేసినప్పుడే చర్చలు, వాటిద్వారా కొత్తవిషయాలు వెలికిరావటమూ జరుగుతాయి. ఒకానొకచో కొత్తవిషయాలు రాకపోయినా పాతవాటినే కొత్తవిధంగా చూడటం ఐనా జరుగుతుంది . ఇదీ ఆధునిక పరిశోధనా మార్గం.

    నిజానికి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా – ఆయన ఆ సందేహం వెలిబుచ్చబట్టే ఇంత చర్చా సాధ్యమైంది.

  9. ‘వ్యయ’ ప్రయాస గురించి kari venkataratnam babu గారి అభిప్రాయం:

    05/06/2006 10:48 am

    క్రొత్తపూల నెత్తావులతొ మత్తు గాలి వీచగా-వెండితెర పాట-నెర కు అందమ ను అర్థము-నెర జాణ పదము వలె-వాసన కి తావి పర్యాయపదమా? కాక
    మకరందానికా? గొల్లపూడి గారు సెలవియ్యవలె-

  10. మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2 గురించి yoga గారి అభిప్రాయం:

    05/06/2006 7:50 am

    ఈ అనువాద సీర్షిక ని అందిస్తున్న అఫ్సరు గారికి ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇది కొత్త రచయిర(త్రు) లకు చాలా స్ఫూర్తి దాయకంగా మార్గ దర్శకంగా ఉంటుంది.
    యోగా.

« 1 ... 1545 1546 1547 1548 1549 ... 1554 »