Comment navigation


15541

« 1 ... 1503 1504 1505 1506 1507 ... 1555 »

  1. పద్యాలు – వాడుకభాష గురించి krishnareddy kapireddy గారి అభిప్రాయం:

    02/10/2007 5:19 am

    ఒక మంచి వ్యాసము. విషయములను అతి చక్కగ వివరించారు. భాషా ప్రయూగములో సరి కొ్త్త రచనల కి ఎంతో ఉపయోగ పదుతుంది. మన తెలుగు భాష విస్తరించాలి. మీ ఈ వ్యాసము ఎంతొమందికి స్ఫూర్తి దాయకము. అభినందనలతో
    కృష్ణారెడ్డి కాపిరెడ్డి

  2. Zenగల్వలు – 1 గురించి balakrishna గారి అభిప్రాయం:

    02/09/2007 9:16 am

    Lot of Freshness in the poetry. At the same time ,the poet has some sort of attraction towards words. Has a sense for the poem as painting but has to get rid of the more words to paint the poem.
    By Any standard,good work. Keep going.

  3. పద్యాలు – వాడుకభాష గురించి రానారె గారి అభిప్రాయం:

    02/09/2007 8:42 am

    “ఈ వారపు సమైక్య కృషి” అంటే అది agglutination అవుతుందా? సురేశ్ గారూ మీ సూచనతో తెవికీ లేబుల్ ను సరిదిద్దుదాం. దయచేసి తెలియజేయండి.

  4. తరం మారినా … గురించి Anil Ivaturi గారి అభిప్రాయం:

    02/08/2007 10:07 am

    “ మరి నువ్వు కూడా కూతురితో వుండచ్చుగా! ఎందుకీ యాతన?” అన్నా.
    , ఛీ, నాకేం కర్మం,” అని రెండు మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చింది.

    ఈ మాట చాలు, పార్వతమ్మ మనస్తత్వాన్ని అంచనా వేయడానికి. she thinks ‘dependence’ is a ‘కర్మం’. So, that is not an option for her.

    డబ్బులు తీసుకో మని యెంత బతిమాలినా తీసుకోలేదు.

    ఈ మాట చాలు, పార్వతమ్మ ఆత్మ విశ్వాసాన్ని అంచనా వేయడానికి. she thinks ‘taking help from some one else’ is also a kind of a dependence. So she said ‘No’.


    But she would rather give than take. అందుకని రెండు మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చింది.

    అట్లాంటి మనిషితో deal చేయాలంటే ‘నేను’ కే కాదు. ఎవరి కైన కష్టమే. అందుకని నాకు, ‘నేను’ పై కోపం కంటె, జాలి ఎక్కువ కలిగింది. ఎందుకంటే ‘నేను’ ఒక ‘సహాయం చేద్దాము అనుకునే ఒక అసహాయుడు’ గా కనిపించాడు కాబట్టి.

    Ayina, Kishan gaaru annatlu, Veluri gaari kadhalalo sentiment kuda untundani naaku ippude thelisindi. 🙂

  5. తరం మారినా … గురించి తుమ్మల శిరీష్ కుమార్ గారి అభిప్రాయం:

    02/07/2007 11:32 pm

    నాకూ JUBV ప్రసాదు గారి లాగానే అనిపించింది. అయితే నేనలా అనుకోవడానికి కారణం కథనం! కథ మనసుకెంతలా హత్తుకుపోయిందంటే, పార్వతమ్మపై మనకెంతో అభిమానం కలిగింది.

    “తమలపాకులా ఉన్నావమ్మా”
    “పార్వతి ఏంటిరా.. పార్వతమ్మా అనలేవూ”
    అమ్మా, పార్వతమ్మల మధ్య స్నేహం
    మొక్కజొన్న కండెలకు డబ్బులొద్దనడం
    “ముష్టి డబ్బు నాకెందుకూ..”

    ఇవన్నీ చదివాక, మన పార్వతమ్మ అనుభవించిన కష్టాలు తెలిసాక, ఆమె కష్టాల పట్ల అంత నిరపేక్షగా ఉన్న (ఉన్నట్లున్న) నేను పై కోపం రావడం సహజం.

    తప్పు కథకుడిదే.., పార్వతమ్మను “మన” పార్వతమ్మ చేసినందుకు.

  6. తరం మారినా … గురించి Anil Ivaturi గారి అభిప్రాయం:

    02/07/2007 1:39 pm

    J U B V గారి comment అర్ధం పర్ధం లేకుండా ఉంది, it needs more clarity. Lyla గారు చెప్పినది correct. నమూనా మీరైతే ఎలా నడిపిస్తారో కొద్దిగా వీలైతే రాయండి, J U B V gaaru. !!!

  7. పద్యాలు – వాడుకభాష గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    01/31/2007 8:24 am

    భాషకి అనువుగా ఛందస్సు మారాలని మొదట గుర్తించింది గురజాడ. అతని అడుగుజాడలో నడిచిన వాడు శ్రీ శ్రీ (ఆ విషయంలో). గురజాడ, శ్రీ శ్రీ సాంప్రదాయిక ఛందస్సులలో రాసిన పద్యాలలో భాషనీ, మాత్రా ఛందస్సుల్లో రాసిన పద్యాలలోని భాషనీ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికున్న కవితత్వం ప్రథానంగా పద్యరూపం కావడం మూలానా, పద్యాలకి వ్యవహార భాష తగదని తెలుసున్న కారణానా, ఆనాటి వ్యావహారిక భాషా వాదులు వచన సాహిత్యం గురించే పోరాడారుగాని పద్యాలజోలికి, కవిత్వం జోలికీ పెద్దగా పోలేదు. గురజాడ ఒకడుగు ముందుకు వేసి కవిత్వంలో కూడా వ్యవహార భాష తెచ్చే ఉద్దేశంతోనే మాత్రా ఛందస్సులని స్వీకరించాడు. ఐతే మాత్రా/దేశి ఛందస్సులలో కథా కావ్యాలని సృష్టించగలమా, సృష్టించినా అవి ఎంత వరకూ జన రంజకం అవుతాయీ అన్నది పరిశీలించాల్సిన విషయం. పాల్కురికి సోమనాథుని ద్విపద కావ్యాలుకాని, రంగనాథ రామాయణం కానీ అంతగా ప్రసిద్ధి చెందకపోవడానికి కారణం కేవలం రాజకీయమనో, పండితుల నిరాదరణ అనో కొట్టి పారేశాం కానీ, వాటిని ఒక పోతన భాగవతం తోనో, మొల్ల రామాయణంతోనో పోల్చి వాటి అనాదరణకి కారణాలు వెతికే ప్రయత్నం జరగలేదు.

    భాషా శాస్త్ర పారిభాషిక పదాలపై నాకు పెద్ద అధికారం లేదు కాని, agglutination, inflection, vowel harmony మొదలైన లక్షణాలన్నీ కలిసి తెలుగు భాషకి ఆ ప్రవాహగుణాన్ని స్తున్నాయి, బహుశా.

    “జ”కి “శో” కి హల్ మైత్రి కుదిరినా అచ్చుల మైత్రి కుదరదు (“అ”కి “ఒ”కి). కాబట్టి ఆ రెండక్షరాల మధ్య యతి సాధ్యం కాదు. అలాగే “వ”కి “వి”కి కూడా కుదరదు. కొంత అరుదైనా నన్నయ్య “ప”కి “వ”కి, “బ”కి “వ”కి యతి వేసాడు. ఉదా:
    “నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
    వ్రత యొక బావి మేలు మఱి బావులు నూరిటికంటె నొక్క స
    త్క్రతువది మేలు…”

    “ప్రల్లదుడైన యొక్క కులపాంసను జేసిన దాన దత్కులం
    బెల్లను దూషితంబగుట యేమి యపూర్వము గావునన్ మహీ
    వల్లభ! తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలో
    …”

  8. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/31/2007 7:00 am

    Morphological typology లో నేను అర్థం చేసుకున్నది తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకే పదంలో ఎన్నో శబ్దాలు (morphemes) ప్రత్యయాల (affix) సాయంతో అల్లుకుపోయి ఉండే భాషలను agglutinative భాషలనీ, ఒక పదంలో దాదాపుగా ఒక శబ్దం మాత్రమే కనిపించే భాషలని isolating భాషలని చెప్పవచ్చు. ఈ రెంటికి మధ్యస్థంగా ఒక పదంలో శబ్దాలు (సంధి) సూత్ర నియతంగా, శబ్దాలు తమ స్వ-రూపం మార్చుకొనే విధంగా సంలీనం చెందే భాషలను fusional/inflectional భాషలని స్థూలంగా చెప్పవచ్చు. తెలుగు, తమిళాదులు agglutinative భాషలనీ, సంస్కృత-లాటిన్ భాషలు fusional భాషలనీ, చైనీస్, ఇంగ్లీష్ భాషలు isolating భాషలనీ చెప్పుకోవచ్చు. “ఇంటిపైనుండి” అన్న తెలుగు పదాన్ని ఇంగ్లీషులో “over the top of the house” అన్న ఆరు విడి విడి పదాలుగా రాయాలి. అనుష్టుప్ ఛందస్సు, విరామయతి, పాదాంత విరామం fusional భాష అయిన సంస్కృతానికి ఒప్పినట్టుగా agglutinative భాష అయిన తెలుగుకు ఒప్పదనే నన్నయాదులు వృత్త ఛందస్సును విరామ నియమాలు లేకుండా అక్షరమైత్రితో స్వీకరించారని కామేశ్వర రావు గారు చెబుతున్నారని నా interpretation!

  9. పద్యాలు – వాడుకభాష గురించి chavakiran గారి అభిప్రాయం:

    01/30/2007 10:22 pm

    agglutinative మరియు isolating అంటే ఏమిటో ఎవరన్నా చెపుతారా?

    కొన్ని ఉదాహరణలతో

  10. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    01/30/2007 4:10 pm

    కామేశ్వరరావుగారు,

    “-‌న్”, “-ల్” వంటి ప్రత్యయాలు మొదలైనవి లేకుండా నేటి కాలపు భాషలో పద్యాలు రాయాలంటే ఛందస్సు (వృత్తాలు) మారాలి అన్న విశ్వనాథ అభిప్రాయం సబబే అని తోస్తోంది. ఒక విధంగా చూస్తే, ఆధునిక భాషలో అద్భుతమైన శబ్దసౌందర్యాన్ని, ప్రవాహగుణాన్ని ప్రదర్శిస్తూ దేశీ ఛందస్సులతో (మాత్రా ఛందస్సులతో) కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఇత్యాదులు సృష్టించిన కవితలే మారిన ఛందస్సుకు ఉదాహరణలని నాకనిపిస్తోంది. ఈ ఆధునిక కవులు వాడిన భాష నిజంగా వాడుక భాషేనా అని కొంతమంది వేసే ప్రశ్నకు సమాధానం మీరు చర్చించకుండా వదిలేసిన “కవిత్వ భాష”. కొన్ని పదాలూ, లక్షణాలూ ఎప్పటికీ వ్యవహారంలోకి రానివీ, వ్యవహార దూరమైనవీ కవిత్వ భాషలోనే ఉంటాయి. “పరిమళపు తుఫానుల్ని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి” అన్న మాటలు కవిత్వంలోనే తప్ప మనం సాధారణంగా మాట్లాడే వాక్యాల్లో వినిపించవు కదా!

    ఇంకో విషయం. “తెలుగు పద్యాలకి ఉండే మరొక ప్రత్యేకమైన లక్షణం ప్రవాహ గుణం, లేక ధార … ఈ నాదం తెలుగు భాష సొత్తు.” అని అన్నారు. ఇక్కడ మీరు తెలుగు భాష agglutinative స్వభావాన్ని వివరిస్తున్నారని నా సొంత అభిప్రాయం ! అయితే, ప్రపంచీకరణ వల్ల, అన్యభాషాప్రభావాల వల్ల తెలుగు agglutinative స్వభావాన్ని కోల్పోయి ఇంగ్లీష్ భాష లాగే isolating భాషగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “ఈ వారము సమైక్య కృషి” అన్న తెలుగు వికీపీడియా లేబుల్ ఇందుకు ఒక ఉదాహరణ 🙂

    కృతజ్ఞతలతో,
    సురేశ్.

    – “శోకింపంగన్” అన్నప్పుడు యతిభంగం కాలేదు. నన్నయ్య “జ”-కారానికి “శ”-కార యతి వాడిన సందర్భాలు ఆది పర్వంలోనే కనిపిస్తాయి.
    – నన్నయ్య “వ”-కారానికి “ప”-కార యతి వాడాడో లేదో నాకు తెలియదు. “వారిజ కాంతల్” కు బదులుగా “వికచ కుసుమముల్” వాడొచ్చని అది పోస్టు చేసిన కాసేపట్లోనే అనుకున్నాను.

« 1 ... 1503 1504 1505 1506 1507 ... 1555 »