Comment navigation


15542

« 1 ... 1502 1503 1504 1505 1506 ... 1555 »

  1. నేనూ నా రచనలు గురించి Dr. K. Sujatha గారి అభిప్రాయం:

    02/15/2007 9:01 pm

    Navven garu
    Your speech is excellant reflection. Perhaps some people have such self analysis and thinking beyond one self. But very few can pen them with critical observations as literature .You are the one successful writer and through your writtings reassured many not they are alone.

    Dr.K.Sujath

  2. పద్యాలు – వాడుకభాష గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    02/14/2007 12:18 am

    “ఛందస్సు లేకుండా కవిత్వం లేదు” – వరద
    కామేశ్వరరావు గారూ,

    కందకీ గీతకీ తేడా తెలియని ‘విద్యావంతుణ్ణి’ నేను. అదేదో గొప్పగా చెప్పుకోడం లేదు; ఉన్న విషయం చెప్తున్నా. అయినా మీ వ్యాసం నాకు బాగా నచ్చింది.

    విశ్వనాథ కవిత్వంలోని తెలుగు వెలుగులు చూపినందుకు సంతోషం. మీరు చెప్పింతర్వాత కొన్ని పద్యాలు చదివి “ఓహో” అనుకున్నాను – “ప్రొద్దుననే లేచి పులికాపు పెట్టును” అంటూ మొదలైన సీసం!

    మధ్యాక్కర వాడుకభాషకు వీలుగా ఉంటుందన్నారుగాని “విశ్వనాథ మధ్యాక్కరల” నీ ఆరుద్ర “శుద్ధ మధ్యాక్కరల”నీ ప్రస్తావించలేదు. ఆరుద్ర రాసినది వాడుక భాషగానే కనపడుతుంది.

    అబ్బూరి ‘చెరకాలం’ రాస్తున్నప్పుడే శ్రీశ్రీ ‘కలకాలం’ తలపెట్టి, ‘చెరకాలం’ కోసం ఉపోద్ఘాతం రాస్తూ,
    “కలకాలం చెరకాలం
    సిలువై తుదికావ్యమై స్పృశించెను వరదా!”

    అని అన్నాడట. అని ‘చెరకాలం’ వ్రాతప్రతిని పట్టుకెళ్ళి పోగొట్టుకున్నాడు! అబ్బూరి దగ్గర మరో కాపీ లేదు! ‘తెలుగు స్వతంత్ర’ లోనూ “అందాకా” లోనూ ప్రచురితమైనవీ, అముద్రితమైనవీ, దొరికినంతవరకు వీళ్ళదగ్గరా వాళ్ళ దగ్గరా సేకరించి, లండన్ వాస్తవ్యులైన పరకాల ప్రభాకర్ 1993లో “కవితా సంచిక” గా ప్రచురించారు. దాంట్లో దాదాపు డెబ్భై పేజీలు ‘చెరకాలా’ నివే! దాని చివర్లో అబ్బూరితో “కవిత్వం అంటే…” అన్న పేరుతో పరకాల జరిపిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ కూడ వుంది.

    విశ్వనాథ వారు అబ్బూరి ప్రయోగాలని చూసి, “నీ స్నేహితులంతా ఛందస్సు మీద విరుచుకు పడతారేం? వాళ్ళకి చాతకావాలి కాని అందులో రాయటానికేం బాధ? నువ్వు రాసి చూపించావు కదా – యింకా యేం కావాలి వాళ్ళకి?” అని మెచ్చుకున్నాడు.

    చెదురుమదురుగా వున్న మరికొన్ని అబ్బూరి రచనల్ని ఒకచోట చేర్చి, వారి కుటుంబసభ్యులు 1995లో “సామిధేని” పేరిట మరో పుస్తకాన్ని ప్రచురించారు. దాంట్లో చేకూరి రామారావు గారి వ్యాసం, “నిరంతరాన్వేషి, నిత్యప్రయోగశీలి వరద,” కోవెల సంపత్కుమారాచార్య గారి వ్యాసం, “ఛందో వరదస్మృతి,” వున్నాయి. నిజం చెప్పాలంటే, ఆ పండితుల వ్యాసాల్లో కన్నా మీ వ్యాసంలో “ప్రవాహ గుణం” బాగుంది.

    ఈ పుస్తకాలు నేను గత రెండేళ్ళ లోపునే కొన్నాను కనుక ఇంకా దొరుకుతున్నాయనుకుంటాను. మీ వ్యాసానికి అవి ఉపయోగపడొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

  3. పద్యాలు – వాడుకభాష గురించి రానారె గారి అభిప్రాయం:

    02/12/2007 12:30 pm

    సురేశ్ గారు, ధన్యవాదాలు. మీ సూచన తెవికీ సభ్యులకు చేరింది. మీ సహాయాన్నర్థించడంకోసం “ఈమాట”ను వేదికగా చేసుకొనవలసిరావడం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే (క్షమించాలి) అయినా మన భాషకు సంబంధించినంతవరకూ తెవికీ ఒక మహావిజ్ఞానసర్వస్వం కానున్నందున వారికిది మోదము, అమోదమూ అయుంటుందని భావిస్తున్నాను. పద్యాలను, వాడుకభాషను రెంటినీ తెవికీలో భద్రపరచి మనందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటికే ఆంధ్రమహాభారతములోని కొన్ని పర్వాలు అందులో వున్నాయి. ఐతే, తెవికీకి మాత్రుక ఆంగ్లవికీపీడియా. అందువలన తెలుగు భాషాపండితులకన్నా, భాషాశాస్త్రవేత్తల సహాయం తెవికీని కాంతివంతం చేయగలదేమో అని నా అభిప్రాయం. మీకు వీలైనప్పుడల్లా మీ సూచనలు, సలహాలు అందించగలిగితే సంతోషం. ఈ దిశగా మీ సూచనలను teluguwiki@googlegroups.com కు పంపగలిగితే మహదానందం.

  4. పద్యాలు – వాడుకభాష గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:

    02/11/2007 4:54 am

    రానారె గారు: ఏ ఒక్కరిద్దరి ఉచ్చారణ బేధంవల్ల భాషాపరిణామం రాదు. ఏ ఒక్క వికీపీడియా లేబుల్ మార్చడం వల్ల రాబోయే భాషా పరిణామాలు ఆగిపోవు! ఈ సమాచార విప్లవ శకంలో, ప్రపంచమే కుంచించుకుపోయి ఒక కుగ్రామంగా మారిపోయే ఈ సంధియుగంలో ఎన్నో భాషామహావృక్షాలే కూకటివేళ్ళతో సహా పెళ్ళగింపబడుతున్నాయి. ప్రపంచం నలుమూలల ప్రస్తుతం మాట్లాడబడుతున్న ఆరువేల పైచిలుకు భాషలలో 90% పైగా భాషలు ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోతాయని భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయం (Cf. Language Death – David Crystal). అప్పటికి తెలుగు సజీవ భాషగానే ఉంటుందని నా నమ్మకం, ఆశ. అయితే, అప్పటి తెలుగు భాష మనం గుర్తు పట్టలేనంతగా మారిపోతుందని మనం ఊహించుకోవచ్చు. ఉదాహరణకు, దంత్యాక్షరాలకు (Dentals), మూర్ధన్యాక్షరాలకు (Retroflexes) తేడా నశించి అవి ఆంగ్లంలోని దంతమూలీయాలు (Alveolars) గా మారిపోవచ్చు. మహాప్రాణాల స్థానంలో ఊనిక (Stress – Primary and Seconary) ప్రాధాన్యతను సంతరించుకోవచ్చు. ఆంగ్లంలో లేని ద్విత్వాక్షర ఉచ్చారణ తెలుగులో కూడా నశించిపోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలుగు భాష agglutination లక్షణాన్ని కోల్పోయి isolating భాషగా మారుతుందేమోనన్న నా అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఏ ఒక్క వికీపీడియా లేబుల్ ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు.

    అయితే, తెలుగు వికీపీడియా లేబుల్స్ అనువాదాల విషయంలో ఒకరకమైన consistency ని, ప్రామాణికతను సాధించడం కోసం, ఎవరైనా తెలుగు భాషాపండితుల సాయాన్ని అర్థించడం మంచిదని నా అభిప్రాయం. ఇంగ్లీష్ వికీతో పోల్చి చూసుకునేంతవరకు అర్థాలు స్ఫురించని సముదాయ పందిరి (దు.స.), వీక్షణ జాబితా (దు.స.), ఇసుకపెట్టె వంటి పదాలు, -ము కారాంత పదాల, బిందు పూర్వక (సున్నతో అంతమయ్యే) పదాల వాడకంలో consistency మొదలైన విషయాల్లో ఉపయోగంగా పండితుల సాయంతో ఒక శైలి నియమావళిని రూపొందించడం కూడా అవసరమేమో. ఏది ఏమైనా, ఇప్పటికే తెలుగువికీ కోసం ఎంతో కృషి చేస్తూ, దీనిని భారతీయ భాషలలో ఎన్నదగిన వికీపీడియాగా తయారు చేసిన మీ బృందానికి అభినందనలు.

    మంచి వ్యాసాన్ని, మంచి చర్చను అందించినందుకు కామేశ్వరరావుగారికి అభివందనాలతో,
    సురేశ్.

    దు.స. = దుష్ట సమాసము

  5. గణపతి బప్పా మోరియా! గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 10:58 pm

    Dear Writer-

    This is really a good story. Sunnitamga sutaaramga bagavantunni gurinchi haasyam melavinchi cheppadam really superb. Especially the sentence is really marvellous!–
    “భక్తుల మనసులో ఏర్పరచుకున్న రూపం తప్ప దేవుడికి వేరే రూపం ఏమి లేదు”.
    rajay
    http://www.tirumala-hills.blogspot.com

  6. ఈమాట గురించి గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 9:12 pm

    All..

    Yes its a really appreciable effort by the team

    Keep the ball rolling great.

    regards.
    rajay
    http://www.tirumala-hills.blogspot.com/

  7. రంగు తోలు గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 9:08 pm

    Good one.
    కథా శిల్పం బాగున్నది. రెండు లేక మూడు సంఘటలని ఏకీకరించి ఆ సంఘటనలతో కథా సౌందర్యాన్ని వెలికి తీయ్యదం అన్నది కథకుల కౌశల్యం. నిడదవోలు మాలతి గారు american background లో చెప్పిన కథ కౌశలం అలోచింప దగినదిగా ఉన్నది.

    regards
    rajay
    http://www.tirumala-hills.blogspot.com/

  8. నేనూ నా రచనలు గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 8:31 pm

    Yes sir Naveen- You are remembered in association with Ampasayya rather than equated with Ampasayya is 200 percent correct. I am one of those that have read including Udyogam Kosam which I appreciated much more than Ampsayya for the content and visleshanatmaka rachana chaaturyam.

    May you have great time ahead!

    regards.
    rajay
    http://www.tirumala-hills.blogspot.com/

  9. వర్షానంతరం గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 8:25 pm

    సౌఖ్యపు సంపెంగ మొగ్గలు
    అన్న పదం బాగున్నది.

    http://www.tirumala-hills.blogspot.com/

  10. వలసపోతున్న మందహాసం గురించి rajay గారి అభిప్రాయం:

    02/10/2007 8:21 pm

    Dear sir.

    Yes ‘Alala Andam to’ leka ‘Alala vastram to’ anna padam baaguntundemo.

    regards.
    rajay
    http://www.tirumala-hills.blogspot.com

« 1 ... 1502 1503 1504 1505 1506 ... 1555 »