ఆదిరప్పళ్ళి తలపోత తుంపరలకింద
వళ్ళంతా తడిసి ముద్దైన తీయటి కలలు
పిల్లల్లా తుళ్ళి ఆడటం మానేసి
పక్కపక్కనే పడుకున్న చెక్క గది కిటికీలోంచి
ఊగే వక్క చెట్లపై పడి వెన్ను విరిగిపోయాయి
Category Archive: సంచికలు
ఆవల దూరంగా
విరిసిన ఇంద్రధనువోటి
నన్నిట్టే పట్టేస్తుంది
పరిగెట్టి పట్టాలని
నీవగుపడలేదని
వెతుకుతాను
చెస్‌తో పాటుగా ఆయన వైకుంఠపాళి కూడా తెచ్చాడు. రంగురంగులుగా ఉండి, అదే నచ్చింది ముందు; కానీ ఆ ఆట ఎందుకాడాలో మాత్రం అతనికి అర్థం కాలేదు. ఎలాగూ పాము నోట్లోంచి జారి క్రింద పడేటప్పుడు, నిచ్చెనెక్కి ఆనందపడ్డం ఎందుకో. అదే చదరంగమైతే! ఆ నలుపూ తెలుపూ గళ్ళ మీద ఎన్ని యుద్ధాలు చెయ్యచ్చు. ఎన్నెన్ని గెలుపోటముల్ని మూటగట్టుకోవచ్చు! ఆలోచిస్తూ, తల గోక్కున్నాడు.
చెక్కిళ్ళపై నీ పెదవుల
రాతలను వెతికిన
చెట్టు కొమ్మల్ని చిరుగాలి
తాకకుండా ముద్దాడిన
చేతిలో నీ ఉత్తరం
కాగితం పువ్వులా
రెపరెపలాడిన
నాకర్థం అయ్యింది. నన్ను పిచ్చివాడని అనుకుంటున్నాడు. పాపం, పిచ్చోడు! ఎక్కువ బేరం చెయ్యకుండా, “సరే. కానీ నా అమ్మకం షరతులకి ఒప్పుకుంటేనే,” అన్నాను. అవేమిటన్నట్టు నా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. పాల్కురికి విరాట్ ప్రసాదరావు షరతులా! మజాకా! నా సిగరెట్ దమ్ము లాగాను. శరీరమంతా గాలిలో తేలిపోతోన్న భావన. నెమ్మదిగా, నా వేళ్ళ మధ్యనున్న సిగరెట్‌ని అతనికి అందించాను.
ఎనిమిది వందల సంవత్సరాలనాటి విషయాల గురించి, బౌద్ధం నుంచి సామ్రాజ్యవాదం, రాచరికం, ఫ్యూడలిజం, కమ్యూనిజం, నక్సలిజం వరకూ వివిధ నేపథ్యాలలో కథలు కట్టాలంటే ఎంతో సాహసం కావాలి. దాన్ని మించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ రెంటినీ మించిన అధ్యయనం, పరిశీలన, సాంఘిక ఆర్థిక రాజకీయ తాత్వికతా ఉండాలి.
మతి తప్పి
తిరిగాను
మది డస్సి
ఆత్మ బంధువని తోచి
వెంబడించానొకడిని
నేనెక్కడ దొరికాను నీకు?
అన్నాడతను హేళనగా
ఇల్ మాత్రిమోనియో సెగ్రేతో అనునది జొవాన్ని బెర్తాతి ఇటాలియను భాషలో వ్రాసిన గేయరూపకమునకు సుప్రసిద్ధ ఇటాలియను సంగీతకర్త యగు దొమీనికో చిమరోసా అను నతడు సంగీతరచన చేసిన సుప్రసిద్ధమైన సంగీతరూపకము . హాస్యరసాన్వితమైన అన్ని ఆపెరాలకును ఇది తలమానికమైనదని సంగీతపండితుల అభిప్రాయము.
ఆరుబయలు ఆటస్థలాలు,
ఆకుపచ్చని పరిసరాలు,
సుతిమెత్తని నీటి ప్రవాహాలు
పంచే సందడిని ప్రేమించాను.
ఓటి మాటల చప్పుడు జొరబడకుండా
కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను!
ఈ శ్యామలా దండకమును మహాకవి కవికులతిలకుడు కాలిదాసు వ్రాసినాడని ప్రతీతి. ఈ చాటుకథ జగద్విదితమే. మూర్ఖుడైన కాలిదాసు సౌందర్యవతి, విద్యావతియైన రాజుగారి కుమార్తెను వివాహమాడి ఆమెచే కనుగొనబడి కాళికాదేవివద్ద పంపబడి ఆ దేవిని ధ్యానించి ఆ దేవిచే నాలుకపైన బీజాక్షరములను వ్రాయించుకొని ఆ దేవిని ఈ దండకము ద్వారా స్తుతించినట్లు కథ. ఇక్కడ రెండు సందేహాలు ఉదయిస్తాయి.
రెండు రోజులు భీకరంగా జరిగేక రెండు వైపులా జవాన్లు చాలామందే పోయారు. కాల్పులు విరమించమని ఆర్డర్ వచ్చి, యుద్ధం దాదాపు అయిపోయేసరికి అబ్దుల్ కరీమ్‌కి కాలులోకి బులెట్లు దిగబడి బాగా గాయాలయాయి. శ్రీవాత్సవ ట్రాన్స్‌మిటర్‌లో ఆర్మీ మెడిక్స్‌కి సమాచారం అందించేడు. కాసేపట్లో హెలికాప్టర్ పంపుతామన్నారు.
మారన ఒక సంస్కృత పురాణాన్ని తెనిగించిన తొలి తెలుగు కవి. ఈయనకు తిక్కనగారంటే మహా గౌరవము. ‘తిక్కన సోమయాజి ప్రసాదలబ్ధ సరస్వతీపాత్రుడ’నని తన కావ్యంలోని ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నాడు. అన్నట్టు ఈయన తండ్రి పేరు కూడా తిక్కనామాత్యుడే. తన మార్కండేయ పురాణం అనువాదాన్ని మారన ప్రతాపరుద్ర చక్రవర్తి సేనానాయకుడైన గన్న సేనానికి అంకితమిచ్చాడు.
“రాజా! ఒక విషయంలో మొదటిసారి పొరపడితే అది అనుభవరాహిత్యం. రెండోసారి పడితే మూర్ఖత్వం. నిన్నటి పొరపాటు ఇవ్వాళ జరగకుండా నువ్వు తీసుకున్న జాగ్రత్త చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మరీమరీ నీతో ముచ్చటలాడాలనిపిస్తోంది. అదే పని పదేపదే చేస్తున్న నీకు విసుగు కలగకుండా మన అభిమాన పాఠకరావు ధోరణిలో మరో వింత కోణాన్ని ఈ రోజు నీ ముందు ఆవిష్కరిస్తాను. విను.”
2003లో హైదరాబాదులో కె.వి.రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె.రాణి, ఎ.పి.కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో కె. రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు.
క్రితం సంచికలోని గడినుడి 22కి మొదటి పదిరోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: సుభద్ర వేదుల, శైలజ, జంధ్యాల ఉమాదేవి, విజయాదిత్య, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకు మా అభినందనలు.
అడ్డం గాడిద బూడిద రంగే, కాదన్నదెవరు? సమాధానం: ధూసరం సంపదలేవీ యిలా వెంటరావని హరిశ్చంద్రుడు వాపోయాడు సమాధానం: తిరమై మల్ల వాహనుల పేర్లలోని మబ్బు […]
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
స్వేచ్ఛాభారతంలో ఇంకొక రోజు, ఇంకొక దౌర్జన్యపర్వం. ఈసారి మళయాళ రచయిత హరీశ్‌పై దాడులు. కారణం? షరా మామూలుగానే మనోభావాలు గాయపడటం. మా స్త్రీలను అవమానించేలా నీ నవలలో ఒక పాత్ర మాట్లాడింది కాబట్టి నీ భార్యాబిడ్డలను బలాత్కారం చేస్తాం, నీ చేతులు నరికేస్తాం అని బెదిరింపులు. ఈ రకమైన న్యాయం మధ్యప్రాచ్య తాలిబన్లకూ, మనదేశపు ధర్మగంగబిందువులకూ మాత్రమే సబబనిపిస్తున్నట్టుంది. ఇది భౌతికమైన దాడి. ఇక రెండవది, మానసికమైన దాడి. ఒక రచన ఆధారంగా రచయిత నైతికత, శీలం అంచనా వేయడం, సోషల్ మీడియా ముసుగులో అవమానాలు, ముద్ర వేయడాలవంటివి. పైకి వేరుగా అనిపించినా ఈ రెండు రుగ్మతలకూ మూలం ఒకటే–తమకు తప్పనిపించే భావాలపై ఉండే విపరీతమైన అసహనం, దానితో వచ్చే క్రూరత్వం. సక్రమమైన రీతిలో స్పందించలేని, వ్యతిరేకించలేని దుర్బలత్వం, దాని ద్వారా వచ్చే అనైతిక ప్రవర్తన, ఇందుకు కారణాలు. ఏ మంచి కోసమైనా సరే, ఎంతమాత్రమూ సమర్థించకూడని లించింగ్ మాబ్ మెంటాలిటీ ఇది. తమను, తమ జీవితపు సంఘటనలను, తమ వాదాభిప్రాయాలను పేలవమైన కథలుగా చెలామణీ చేసే రచయితలు లేరని కాదు కాని, కథలన్నీ రచయిత అనుభవాలుగా, పాత్రల ఉద్దేశాలన్నీ రచయిత అభిప్రాయాలుగా మాత్రమే అనుకోవడం, రచయితకు కాల్పనిక దృష్టి లేదని అవమానించినట్టే. స్పందన వ్యక్తపరచిన అభిప్రాయం గురించి ఉండాలి కానీ వక్త గురించి కాదనేది మౌలిక జ్ఞానం. విమర్శ రచన గురించే తప్ప రచయిత గురించి కాదనేది కనీస మర్యాద. పాఠకుల మాట అటుంచి, కనీసం ఇది విమర్శకులకూ రచయితలకూ అలవడనంత వరకూ సాహిత్యస్పందన దొమ్మిలాట స్థాయిని దాటదు. తమకు నచ్చినట్టే, నచ్చినవే రాయాలి, అనాలి, వినాలి, చూడాలి అనే సాంస్కృతిక నాజీల దౌర్జన్యమూ ఆగదు. రచయితకు, ఆమాటకొస్తే ఏ కళాకారునికైనా తన సృజనను, అది ఎంత వివాదాస్పదమైనదైనా సరే, నిర్భయంగా ప్రకటించగలిగే, ప్రదర్శించగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ తర్వాతే ఏ చట్టబద్ధమైన నిరసనైనా. మనిషిని జంతువు నుండి వేరు చేసే ఒక గొప్ప శక్తి మాట. ఆ మాటకున్న శక్తిని సంపూర్ణంగా గుర్తించేది, దాని విలువను నిలబెట్టగలిగేది సమర్థులైన రచయితలే. వారికి ఆ స్వేచ్ఛనివ్వలేని సమాజం ఒక జంతుసమూహం మాత్రమే.
టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ళ కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం.