ఏ కావ్యానికయినా దాని భాగధేయాన్ని నిర్ణయించేది కవి యెడ సానుభూతి లేని రంధ్రాన్వేషణాతత్పరులైన పండితులు కారు. సాధారణ పాఠకులు. తెలుగు పాఠకులు మొల్ల రామాయణాన్ని ఆనందంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్నారు. మళ్ళీమళ్ళీ చదువుకొని మననం చేసుకోదగిన పద్యాలు చాలానే ఉన్నాయి అందులో. తాను విదుషిని కాదనీ, శాస్త్రాదులు తనకు తెలియవు అని అన్నాకూడా కవిత్వమనేది ఎలా ఉండాలో కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి మొల్లకు.

ఆవేళ, క్రీడామైదానంలో ఉండుండి వినిపించే ఆర్భాటం ఆకాశాన్ని ముట్టడించినట్టు, ఆ పిలుపు నా మనోవీధిలో మోగింది. చల్లటి జలపాతం తలని తొలిచేస్తున్న ఆ సమయంలోనే, నరాలలో వేడినీళ్ళు ఎక్కించినట్టు రక్తం వెచ్చబడుతూ… ఆ నిముషం గడిచిపోకుండా నా మదిలో నిలిచిపోవాలని ప్రార్థించాను. పొత్రాల్లాంటి వృషణాలున్న మంచి కోడెగిత్త రంకెలాంటి ఆ పిలుపు విన్న తర్వాత, నా మనోవీధిలో అగుపించిన దృశ్యాలు… వాటిని వివరించడం అతి కష్టం.

మరీ బాధ ఏమిటంటే ఇది ఎవడితో పోయిందో వాణ్ణి నేను చూసేను. ఇది వాడితో పోతుందేమోనన్న అనుమానం కూడా వచ్చింది. అయినా జాగ్రత్త పడలేకపోయేనన్న బాధ మరీ పీడిస్తోంది. మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది. పట్టించుకోం. అంతా అయిపోయాక అప్పుడు తడుతుంది, అరే ముందే అనుకున్నావేఁ, అని.

తడబడే అడుగుల పసివాడి
పాదం తగిలితే చాలు
పుడమి తల్లి పుత్రవాత్సల్యంతో పులకిస్తుంది
రెండడుగులు తనవైపు నడిచి పలకరిస్తే చాలు
చుట్టాల్ని చూసిన చిన్నపిల్లలా
సముద్రం అరుస్తూ గంతులు వేస్తుంది

వెళ్ళిన పావుగంటకి ఉపన్యాసం మొదలైంది. బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందీ, అది సాధించడం ఎంత కష్టం, అది రావడానికి ముందు మనిషి తనంతట తాను ఎలా మారాలీ అనేవి విశదంగా చెప్తున్నారు. అహంకారం వదిలించుకోవాలి. నిమిత్త మాత్రుడిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. నిందాపనిందలు పట్టించుకోకూడదు. శీతోష్ణ, సుఖదుఃఖాలకి సమానంగా స్పందించాలి.

ఏది ఏ కాలమో తెలియదు
ఎవరు నీకోసమో కాదో తెలియదు
ఏ తూనీగలు నీపై ఎగిరిపోతాయో
ఎవరి కేరింతలు నీలో అలలై కదులుతాయో
ఏ తామరలూ కలువలు నీలో పులకించి
నిన్ను పగటినో రాత్రినో చేస్తాయో తెలియదు

ఇంతకీ పాఠకరావుకు వచ్చిన కష్టం ఏమిటి? ‘అటూ ఇటూ కాకుండా ఉందే’ అని అతడన్నది దేని గురించి? ఇదీ సరయిన పద్ధతి అని అతనికి అనిపించింది దేన్ని చూసి? ఈ ప్రశ్నలకి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో, కొన్ని తెలుగు కథల్లో అర్థం పర్థం లేకుండా కొందరు రచయితలు వాడుతున్న అనేకానేక రెండుమూడునాలుగు చుక్కల్లా, నీ తల కూడా వేయి ముక్కలవుతుంది.

అనంతకృష్ణశర్మగారు సాహిత్య రంగంలోనే కాదు సంగీత రంగంలో కూడా గొప్ప పండితులన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సంచికలో వినిపిస్తున్న ప్రసంగం మార్చ్, 1960లో అపూర్వ రాగములు అన్న శీర్షిక క్రింద సైంధవి రాగంపై ఆకాశవాణిలో చేసినది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

తొలి అయిదు దశాబ్దాలలో, అంటే 1981-82 వరకు, వచ్చిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమారంగానికి రెండు ప్రత్యేకతలున్నాయి. చాలా మంది పాటల రచయితలు ప్రథమంగా పేరొందిన కవులు కావడం, అలాగే సంగీత దర్శకులు మంచి గాయకులు కూడా కావడం.

క్రితం సంచికలోని గడినుడి 24కి మొదటి 15 రోజుల్లోనే అయిదుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: 1. రవిచంద్ర ఇనగంటి 2. ప్రతిభ 3. అనూరాధా సాయి జొన్నలగడ్డ 4. వైదేహి అక్కపెద్ది 5. భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి – 24 సమాధానాలు, వివరణ.

అడ్డం కయ్యపుతిండి తింటాడా? (7) సమాధానం: కలహభోజనుడు వేసుకునే మెడను బట్టి భయపెట్టే విషప్పురుగు కూడా మేళకర్త రాగమవుతుంది- (7) సమాధానం: శంకరాభరణము చిదంబరంలో […]

రాబోయే సంక్రాంతి (2019) సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ నిర్వహిస్తుంది. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం.

ప్రస్తుతం మనం ఘనంగా వీథుల్లో జరుపుకుంటున్న గణేశ చవితి ఉత్సవాలకు మాత్రం మూలం మరాఠ రాజ్యంలోని పీష్వాలు ప్రారంభించిన గణేశ ఉత్సవాలే. నానాసాహెబ్ పీష్వా రాజ్యకాలంలో గాణపత్యవ్రతం ప్రారంభమైనట్టుగా మనకు మరాఠా రాజ్యానికి సంబంధించిన దస్తావేజుల ద్వారా తెలుస్తుంది.

తెలుగునాట తెలుగు చదవడం రాయడం అటుంచి సరిగ్గా మాట్లాడడం కూడా అరుదైపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో కొందరు పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవారు కలుసుకోవడం, తాము చదివిన కథలూ నవలలూ కవితల మంచీచెడ్డలు మాట్లాడుకోవడం, ఆపైన ఆ ఆసక్తి, అభిరుచులే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పేర ఎదిగి ఒక సంస్థగా మారి అమెరికా తెలుగు ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడమే కాక, ఇరవై యేళ్ళు నిరాఘాటంగా నడవడం అసామాన్య విషయం మాత్రమే కాదు, ఎంతో సంతోషం కలిగించే విషయం కూడా. డీటీఎల్‌సీ అని అందరూ పిలుచుకొనే ఈ బుక్ క్లబ్ కేవలం పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత కొంత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం ఎంతో హర్షించదగిన పరిణామం. వీరి స్ఫూర్తితో అమెరికాలోని ఎన్నో నగరాలలో తెలుగు సాహిత్య సంఘాలు వెలిశాయి, తెలుగు కథ కవితల గురించి మాట్లాడుకుంటున్నాయి, ఏం చేస్తే మన తెలుగు భాష కలకాలం బ్రతికి ఉంటుంది, మరింత అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా దీన్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. డీటీఎల్‌సీ పుట్టి ఇరవై యేళ్ళు అయిన సందర్భంగా సెప్టెంబర్ 29-30 తారీకులలో ఇరవై యేళ్ళ పండగ పేరుతో తెలుగులో ప్రామాణిక భాష అవసరమూ ఆవశ్యకత, తెలుగులో ప్రచురణ వ్యవస్థ, ఇత్యాది అంశాలపై ఒక చక్కటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, డీటీఎల్‌సీ వారి కృషికి, తెలుగు పట్ల వారి ప్రేమకు, వారి నిస్వార్థ ప్రయత్నాలకూ ఈమాట తరఫున హార్దికాభినందనలు తెలుపుతున్నాం.

కరణంగారు లేచి “కృష్ణంరాజుగారూ, మీరు మాట్టాడింది భావ్యం కాదు. పెద్దలనిబట్టో మీ కుటుంబం మీద వున్న అభిమానంతోనో జనం మీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నారు. ఇప్పుడు మీలో మీరే పోటీ పడతానంటే పడండి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తేలుస్తారు. అంతేకానీ ఇలా పేకాటాడో, కోడి పందేలుకట్టో అధికారం అనుభవిస్తామంటే మొత్తం గ్రామాన్ని అవమానించినట్టే!” స్థిరంగా అన్నారు.

హఠాత్తుగా అడవి అదృశ్యమై సాగర దృశ్యానికి తెరతీసింది. అదో విభిన్న సముద్రం. కంటిచూపుకు ఆనేంత దూరంలో చిన్నాపెద్ద ద్వీపాలు. మ్యాపును సంప్రదించగా అవే లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ ద్వీపాలని చెప్పింది. ఏమని వర్ణించనూ ఆ సాగర దృశ్యాన్నీ! మాటలను కోప్పడి మనసే సర్వస్వంగా ఆ సుందర దృశ్య భావనను మనసులో ఆకళించుకోవలసిన క్షణాలివి.

బైట తుఫాను హోరు. ఈదురు గాలులు, వానజల్లులు ఆ బార్న్ చుట్టూ గిరికీలు కొట్టతూనే ఉన్నాయి. సముద్రం పొంగులు తెలుస్తూనే ఉన్నాయి. పెరిగే అలలు విరిగే అలలు. ద స్టార్మ్ రేజ్డ్ ఆల్ ఎరౌండ్ దెమ్. కాని అతని చేతుల మధ్య ఆమె భద్రంగా ఉంది. శరీరంలోని బడబానలం చల్లబడింది. ఆమె పెదవుల మీద నవ్వులు పూచాయి. హి ఈజ్ సో రైట్. హిస్ ఎవిరీ టచ్ వాజ్ కంపాటిబుల్ టు హర్. ఎ గ్రేట్ లవర్. వెరీ టెండర్. అండ్ ఎ జెంటిల్మన్!

ఎర్ర రాతి కొండల వెంబడి దిక్కుతోచక తిరుగుతూ
నా ప్రేమను కనుమలలో పాతిపెట్టేశాను.
ఆ క్షణంలోనేనా విముక్తి కోసం నువ్వు ప్రార్థనలు చేసింది?

ఆకాశంలో నీ రూపురేఖలతో మబ్బులు
నోళ్ళు తెరిచి నా వైపుకి అప్పుడప్పుడు దూసుకు వస్తాయి