నేను కెనడాకు విహార యాత్రికుడిగా రాలేదు. నా దరఖాస్తుల్లోనూ, విచారణల్లోనూ చెప్పినట్టు మా దేశంలో జరుగుతున్న యుద్ధం నుండి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుకున్న భార్యని, దేవతల్లాంటి నా పిల్లల్నీ వదిలేసి తప్పించుకుని వచ్చినవాణ్ణి. నా కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవచ్చన్న ఆశతో మూడు నెలలపాటు అష్టకష్టాలు పడుతూ ప్రయాణం చేసి వచ్చాను. ఫ్లయిటెక్కి నేరుగా అలా వచ్చి ఇలా దిగలేదు.

కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి

బేతాళా! రోజుకో విభిన్నమయిన కథని చదవాలని, పాఠకరావు తాపత్రయం. అదే అతడు ఒక్కోరోజు ఒక్కోరకంగా ప్రవర్తించటానికి కారణం. అంతే కాదు, కాలక్షేపానికి కథలు చదివేవాళ్ళు అవి విసుగు కలిగిస్తే, వాటిని విసిరేసి ఇంకో కాలక్షేపాన్ని వెతుక్కుంటారు. కాని అదే కథాప్రపంచంలోకి మాటిమాటికీ వెళ్ళరు. అందుకని పాఠకరావు కాలక్షేపానికి మాత్రమే కథలు చదువుతున్నాడన్న అపోహని వెంటనే నీ మనసులోంచి తొలగించు.

గొప్పులు తవ్వడానికి,
కలుపు తియ్యడానికి
కాల్వలు కట్టడానికి
పంటకొయ్యడానికి
ప్రయాసపడుతుంటాడు ఒక్కడే, ఒంటరిగా
వాడంటే మాత్రం ఎవరికీ పడదు
ఎవరికీ అర్థంకాని నల్లటి విషాదం వాడిది

పగవారి కుట్రో
బంధువుల గూడుపుఠాణో
రాజ్యభారం కోల్పోయి
బికారిలా తిరగసాగాడు రాజు
రాజభోగాలు పోయాయని చింతలేదు

ప్రతి అక్షరాన్ని సార్థకంగా ఉపయోగించి విశ్వనాథ రచించిన ఆ నవలలో, నాయికకు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారు? దేవీనామమే కావాలంటే, అవి అనంతంగా ఉండగా ఏకవీర అనే పేరునే ఎంచుకోవటానికి కారణం ఏమిటి? ఏదో సార్థకమైన ఉద్దేశం ఉండే ఉండాలి. ఆ కోణంలో పరిశోధన ప్రారంభించేసరికి నిజంగానే గొప్ప అవగాహన, సాంకేతికతలను రంగరించి రచయిత ఆ పేరును ఉపయోగించారని స్పష్టమైంది.

నవల, చలనచిత్రం రెండూ విభిన్నమైన ప్రక్రియలు. ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చటమనేది ఒక పెద్ద అధ్యయన విషయం. దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒకలాగా తీసెయ్యటమే చిత్ర వైఫల్యానికి మూలకారణం. ఆ నవలలో చిత్రంగా తీయటానికి అనువుగా ఉన్న విషయాలను సస్పెన్స్‌, రాజకీయ వ్యూహాలు, గొప్ప చారిత్రక వైభవం, నాటకీయ పరిణామాలు వంటి విషయాలు అన్నింటినీ చిత్రంలో వదిలేశారు.

భారత యుద్ధానంతరం ఒకరోజు అర్జునుడు ద్వారకకు వస్తాడు, కృష్ణుణ్ణి చూడడానికి. ఆ రోజు కృష్ణుడు ఏదో దీక్షలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మడు ఏడ్చుకుంటూ కృష్ణార్జునుల దగ్గరికి వస్తాడు దీనంగా. ఆయన శోకాన్ని చూసి కృష్ణుడు కన్నీరు పెట్టుకుంటాడు. కృష్ణుడి బాధను చూసి అర్జునుడూ కళ్ళనీళ్ళపర్యంతమవుతాడు. సంగతేమిటంటే ఆ విప్రుని భార్య గర్భవతిగా వుండి, శిశువును ప్రసవించగానే ఆ శిశువు చనిపోతాడు.

సంస్కృతములో శ్లోక ఛందస్సు మూలము, కాలక్రమేణ జరిగిన మార్పులు, అందులోని విభిన్న రీతులు మున్నగువానిని సోదాహరణముగా వివరించినాను. శ్లోకపు నడకతో క్రొత్త విధములైన అర్ధసమ వృత్తముల సృజననుగుఱించి కూడ తెలియబఱచినాను. అంతే కాక 16 అక్షరముల అష్టి ఛందములోని ప్రతి పాదములో రెండు శ్లోక పాదములను ఏ విధముగా ఉంచి వ్రాయవచ్చునో అనే సంగతిని కూడ మీముందు పెట్టినాను.

క్రితం సంచికలోని గడినుడి 23కి మొదటి ఇరవై రోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: 1. రవిచంద్ర ఇనగంటి, 2. భమిడిపాటి సూర్యలక్ష్మి 3. శైలజ 4. సుభద్ర వేదుల 5. శ్రీనివాసులు రెడ్డి. విజేతలకు మా అభినందనలు.

గడి నుడి 23 సమాధానాలు, వివరణ.

గాయకుడిగా ఆయన ప్రతిభకు స్పష్టంగా అద్దం పట్టే పాటలివి. మొదటి రెండు 1948లో మహాత్మా గాంధి మరణానంతరం రాసి, హెచ్.ఎం.వి. వారికి రికార్డుగా ఇచ్చినవి. అదే సమయంలో గాంధీకి నివాళులర్పిస్తూ చాలా భారతీయ భాషలలో బాగా పేరు పొందిన గాయనీగాయకులు రికార్డులిచ్చారు.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఇటాలియన్ ఆపెరాలను తెలుగు యక్షగానాలుగా పునఃరచించే బృహత్ప్రయత్నంలో తిరుమల కృష్ణదేశికాచార్యుల రెండవ రచన ప్రచ్ఛన్న పరిణయము. ఇల్ మాత్రిమోనియో సెగ్రెతో (రహస్య వివాహం) అన్న పేరుతో ఈ ఆపెరా మొదటిసారి 1792లో వియెన్నాలో ప్రదర్శింపబడినప్పటినుంచీ ఇప్పటికీ ప్రేక్షకాభిమానాన్ని నోచుకుంటూనే ఉంది. ఒక ఆంగ్లనాటకాన్ని ఆధారంగా చేసుకొని జొవాన్ని బెర్తాతి రచించిన ఈ రూపకాన్ని ప్రముఖ సంగీత కర్త దొమీనికో చిమరోసా స్వరబద్ధం చేశాడు. ఆయన స్వరబద్ధం చేసిన ఎనభైకి పైగా రూపకాలలో ఇది అత్యంత ప్రాచుర్యం పొంది, ఇప్పటికీ కాలానుగుణంగా భిన్న సాంస్కృతిక నేపథ్యాలకు అన్వయించబడి ప్రదర్శించబడుతోంది; ఈ సంచికలో నలుగురు రచయితలు మొట్టమొదటిసారిగా వారి కథలు కవితలు ఈమాట పాఠకులకు అందిస్తున్నారు. ఈమాట తరఫున వారికి హార్దికస్వాగతం; కె. రాణి పాడిన కొన్ని అపురూపమైన పాటలను శబ్దతరంగాలలో సమర్పిస్తున్నారు పరుచూరి శ్రీనివాస్; వినూత్నమైన కథలు, కవితలు, విశేష పాఠకాదరణకు నోచుకున్న గడి, తదితర రచనలతో ఈ సంచిక మీకోసం…

ప్లేన్ ఎక్కాను. ఇండియా నుండి ఇరవై వరకూ మిసెడ్ కాల్స్. అమ్మకేమవ్వచ్చు? హార్ట్ అటాక్? కిడ్నీ ఫెయిల్యూర్? అమ్మకేమీ కాదు. జెనీవాలో ఆ పార్క్ లో బొమ్మను చూడగానే అమ్మే అని అనిపించింది. తల కిందకు వంచి, భుజాలు వంగిపోతూ, చేతులు మోకాళ్ళపై పెట్టుకొని కూర్చున్న బొమ్మ. ఆడో మగో తెలిసే వీలు లేని బొమ్మ. ఛాతీ లేదు. పక్క ఎముకలు లేవు. పొట్ట లేదు. బొడ్డు లేదు. మెడ నుండి తుంటి వరకూ పెద్ద సున్నా. అంతా ఖాళీ.

ఈ చుట్టుకుచుట్టుకు పోతున్న
అల సొరంగమే అయితేనా
నువ్వూ నేనూ అందులో
ఒకళ్ళనొకళ్ళు అల్లుకుపోయి
పడుకుని…
ఎవరికి తెలుస్తుంది
సముద్రం హోరు

వీధిలో పచార్లుచేస్తున్న పెదరాజుగారు పరిపరివిధాల ఆలోచిస్తున్నారు. ‘ఏమయ్యుంటది? ఎలా అని వెదకడం? ఎక్కడని వెదకడం. ఆ రేవు దాటి పోతానన్న బాబయ్యని అనవసరంగా ఇలా రమ్మని గొప్పకి గొరిగించుకున్నాను. ఈ సంగతేంటో తేలకుండా ఆయన వచ్చేస్తే… విషయం ఆయన చెవిన పడితే… ఇంటి పరువు ఇద్దరి నుంచి అద్దరిదాకా గోవిందా గోవింద!

వాడు నాగరికుడు
వాడిక్కొంచం తేనీరు కావాలి
కూర్చున్న కుర్చీని
పెద్దమోతతో వెనక్కి తోసి లేస్తాడు
బాత్రూమ్ తలుపును
గట్టిగా తెరచి ఆపైన
ఢామ్మంటూ మూస్తాడు