ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు.
Category Archive: సంచికలు
తల నిమిరే కొద్దీ ఆమె కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. అతడు ఆమెకు దగ్గరగా జరిగాడు. కాలిపై కాలు వేసి హత్తుకున్నాడు. ఆమె అతన్ని దగ్గరగా తీసుకుంటూ వెనక్కి వాలింది. మీదకు వంగి ముద్దుపెట్టుకున్నాడు, ఆమెను చుట్టిన చేతితో తల నిమురుతూనే. ఆమె భుజంలో తలను దాచుకున్నాడు. ఆమెకి అర్థమయ్యింది. సుతారంగా వీపుని నిమిరింది. కొన్ని నిమిషాల తర్వాత, భుజం పైకి ఎత్తింది ఆమె, అతడిని కదిలించడానికి.
గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా?
ఎప్పటిదో పొడి జ్ఞాపకం ఒకటి
చినుకు తడి తగిలి
గుప్పున అలుముకుంది
ఒక నిశ్శబ్దపు గాలికెరటం తాకి
ఒళ్ళంతా సన్నని వణుకు
ఉరుములూ మెరుపులూ లేని ఒలిపిరి
ఒకటే ధారగా…
ఈపాటికే అతనొచ్చేసి
ఆ నది ఒడ్డున తోచిందేదో
రాసుకుంటూ చదువుకుంటూ ఉంటాడు
లేదూ
చదివేందుకూ రాసేందుకూ ఏముందని
కలాన్నీ కాలాన్నీ ఆ నదిలోకే విసిరేశాడో
మూడేళ్ళ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదనీ, ఎప్పటిలాగే అహంకారం నిండిన వదరుబోతుగా కొనసాగుతున్నాననీ అర్థమయింది. నన్ను నేను మాయబుచ్చుకుంటున్నాననీ తెలిసివచ్చింది. అటు ఓమ్ పురిని చూస్తే తన వినమ్రతా స్వభావంతో అంకితభావంతో ఎంతో ఎంతో నేర్చుకుంటున్నాడన్నదీ స్పష్టం.
ఆగి నిలబడి చూసినా
నాది కాదనే అనిపించే లోకం.
దిగులు బుడగకు బయటే స్థిరపడి
అనుభవానికి రాని సౌందర్యం.
ఘడియఘడియకీ సముద్రాలు దాటి వెళ్ళే
పక్షిరెక్కలతో మనసు.
రాజా! నువ్వు నన్నెందుకు తీసుకువెళ్తున్నదీ నాకు తెలుసని నీకూ తెలుసు. పాత తెలుగు జానపదచిత్రాలు నువ్వు చాలానే చూసి ఉంటావు. వాటిల్లో కథానాయకుడు, కథానాయికని రక్షించటానికి మారువేషం వేసుకుని వస్తాడు. వచ్చింది కథానాయకుడని, కథానాయికని రక్షించటానికి అలా వచ్చాడని ప్రతి ప్రేక్షకుడికీ తెలుస్తుంది. కాని, ప్రతినాయకుడికి మాత్రం తెలీదు. కొంప తీయకుండా నేను, అలాంటి ప్రతినాయకుడ్ని అనుకుంటున్నావేమో నువ్వు. కానే కాదు.
లోకపు పచ్చి వాసనలను
కప్పి పెడుతున్న
రాత్రి
కన్ను పొడుచుకున్నా
కానరాని చీకట్లలో
కరుకు గొంతుకతో
గాలి హూంకరిస్తున్న
రాత్రి
ఈ గదిలో చేరిన రెండేళ్ళకి మొదటిసారి పైకొచ్చింది. ఒక పెళ్ళీడు కొచ్చిన అమ్మాయి, వయసుకు సంబంధించిన ఆవేశమేమీ లేకుండా చాలా సూటిగా తొణక్కుండా మాట్లాడింది. చాలా స్పష్టతతో గూడా. అపుడపుడూ పలకరింతనవ్వులూ పరిచయవాక్యాలూ తప్ప మేమెప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. తన పని తాను చేసుకుపోయే మంచి పిల్ల. ఏం చేయాలిపుడు?
చిన్న గోనె పట్టా
దానిపైనే కూర్చుని
చుట్టూ ఆవరించిన
చీకటి తునకలను చెదరగొడ్తూ
ఒక్కో పాటని
గాలి వీస్తున్నంత సహజంగా
నేర్పుగా
పాడుతాడు
తాతగారి కవితలోని పదగుంభనమూ ప్రౌఢత్వమూ యీ మనుమడు పుణికిపుచ్చుకున్నట్టు లేదు. రామభద్రకవి రచనలో ప్రౌఢతకన్నా సారళ్యము, ఓజస్సు కన్నా మాధుర్యమూ ఎక్కువగా కనిపిస్తుంది. తన కవిత గురించి చెప్పుకున్న సందర్భాలలో కూడా ‘మామక నవ్యకావ్యము సమంచిత మాధురి సాధురీతి’ అని, ‘మాధురీగతి ప్రబంధ మొనర్చిన నొప్పుగాక’ అనీ, మాధుర్య గుణాన్ని ప్రధానంగా పేర్కొన్నాడితను. పైన యిచ్చిన రెండు పద్యాలూ ఈ గుణానికి చక్కని మచ్చుతునకలు.
ఈ మనుషులకి శవపేటికమీద ఉంచిన తాటాకుకు అర్థమే తెలియదనుకోవాలా? అది వారికేమీ కాదని అనుకుంటున్నారా? చనిపోయిన వ్యక్తి తన ఊరికోసం తిరిగివచ్చాడని వీళ్ళకెవరికీ తెలియడం లేదా? హార్వీ మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపోతే ఈ ఊరి పేరు ఎవరికి తెలిసేది? ఈ ఊరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులోనో సమాధి అయిపోయి ఉండేది.
సంస్కృతములో విసమ లేక విషమ వృత్తములలో మూడు పాదములు ఒక విధముగా, ఒక పాదము వేఱొక విధముగా లేకపోతే అన్ని పాదములు వేఱువేఱు విధములుగా ఉంటాయి. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ వృత్తమైన ఉద్గతా(త) వృత్తమును వివరించి అందులో దాగియున్న తాళవృత్తముల మూసలను కూలంకషముగా చర్చించుటయే.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
అడ్డం భక్తులకి సంతానాన్ని ప్రసాదించే దేవత కోసం ఆరుద్ర పదాలు (4) సమాధానం: కూనలమ్మ ఒకటి అడ్డంలో కవిగారు “అచ్చోట తిరగేసి కొడితే దాని […]
క్రితం సంచికలోని గడినుడి 20కి అన్నీ సరైన సమాధానాలతో పంపిన మొదటి అయిదుగురు: 1. మార్కండేయులు జి వి ఎస్ ఎస్ 2. బాలా త్రిపుర సుందరి 3. రవిచంద్ర ఇనగంటి 4. సుభద్ర వేదుల 5. భమిడిపాటి సూర్యలక్ష్మి. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 20 సమాధానాలు, వివరణ.
సాంస్కృతికంగా బలమైన సమాజాల్లో ప్రతీ తరం రాబోయే తరాలకు బహుముఖీనమైన కళావారసత్వాన్ని ఇచ్చి వెళ్ళడం, ఆ నీడన కొత్త తరాలు తమ ఆలోచనలను రూపు దిద్దుకోవడం పరిణామక్రమంగా జరిగే విషయం. ఆ వారసత్వం లేని సమాజం ఎక్కువకాలం ఉండలేదు. తెలుగులో సాహిత్యసంగీతాది కళలలో లబ్ధప్రతిష్టులైన ఎందరో కళాకారులు నిన్నటి యువతరానికి తమ వారసత్వాన్ని అందించి పడమటిగూటికి చేరుకుంటున్నారు. వారికి వారి కళ పట్ల ఒక స్పష్టమైన జ్ఞానం, కళలకు లక్షణాలే కాని కచ్చితమైన నిర్వచనాలు ప్రయోజనాలు ఉండవన్న విచక్షణ ఉన్నది. అది వారి వారి సృజనలో ప్రతిఫలించింది. ఆ బహుముఖీనత వల్లనే ఆ కళలు పండితపామర విచక్షణ లేకుండా పదిమందికీ చేరినది, అందరినీ అలరించినదీ. అలా చేరితేనే మంచిదనో గొప్పదనో కాకపోయినా కళ సమాజంలో ఎక్కువమందిని చేరగలగాలి. వారి అభిరుచిని పెంపొందించగలగాలి. కనీసం మంచీ చెడూ చర్చించే అవకాశం ఇవ్వగలగాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సృజనకున్న అనేకరూపాలను సమానంగా సహృదయంతో స్వీకరించి విశ్లేషించగల విమర్శా దృక్పథం ప్రస్తుతం సంగీతం, చిత్రకళ వంటి ఇతర కళలలో కొంతయినా కనిపిస్తున్నది కాని తెలుగు సాహిత్యంలో మాత్రం లేదు. బహుముఖీనతను విస్మరించి నిర్వచనాల సంకెళ్ళలో ఒకే రకమైన సాహిత్యాన్ని రచయితలు విమర్శకులు అందలమెక్కించడం వల్లనే సాహిత్యం తెలుగు సమాజంలో ఒకప్పటి ప్రాభవాన్ని పోగొట్టుకున్నది. సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చి కొంత కాలమయినా ఎవరూ ఆవైపుగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.