అవతలి కొసను తాకాల్సిన
ప్రాణమొకటి
నీళ్ళబయటి చేపై
కొట్టుకుంటూనే వుంటుంది
లోపలి ఆశ మాత్రం
అదే దారికేసే చూస్తూంటుంది.
Category Archive: సంచికలు
ఎఱ్ఱాప్రగడ రామాయణం కూడా రచించాడనీ, అది లభ్యం కావడంలేదనీ అంటారు. ఎఱ్ఱాప్రగడ రామాయణంలోవని ఒకట్రెండు పద్యాలు కొందరు లక్షణ కర్తలుదాహరించడమే ఈ అపోహకు ఆధారం. ఆ ఊహ నిజమై, ఇరవైయవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో హఠాత్తుగా నన్నెచోడుని కుమారసంభవం ప్రత్యక్షమైనట్లు ఎఱ్ఱన రామాయణం కూడా మున్ముందెపుడైనా ప్రత్యక్షమైతే తెలుగు భాషా, తెలుగు జాతీ చేసుకున్న అదృష్టం పండినట్లే.
సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములో చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును.
క్రితం సంచికలోని ఈమాట 20వ వార్షికోత్సవ ప్రత్యేక గడినుడి -25కి గడువుతేదీ లోగా ఆరుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన ఆరుగురు: 1. భమిడిపాటి సూర్యలక్ష్మి, 2. గిరిజ వారణాసి, 3. రాజేశ్వరి రావులపర్తి, 4. ఆళ్ళ రామారావు, 5. సుభద్ర వేదుల, 6. రవిచంద్ర ఇనగంటి*. విజేతలకందరికీ మా అభినందనలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
అడ్డం కొకు..రోకొ లో కొ… సమాధానం: కొడవటిగంటి పాపరహితంగా బబ్లూ సోదరి సమాధానం: చెల్లి ఆది లేని వృత్తం నశించక తప్పదని మధురమైన ఉత్తర్వు […]
(అడగ్గానే బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్‌కు
బోలెడన్ని కృతజ్ఞతలు బోలెడంత ప్రేమతో – సం.)
ఈ సంచిక ఈమాట ఇరవయ్యవ జన్మదిన సంచిక. ఈమాట ఇన్నేళ్ళుగా కేవలం నడవలేదు. ఇరవై ఏళ్ళుగా ఇంతింతై ఎదిగింది. రెక్కలుగట్టుకు ఎగిరింది. అమెరికా తెలుగువారికోసం ప్రాణం పోసుకున్న ఒక చిన్న ప్రయత్నం ఈరోజు ఎల్లలు లేని ప్రపంచపు తెలుగు పత్రికగా మూర్తిమంతమయింది; ప్రపంచవ్యాప్తంగా పాఠకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక ఉనికిని, ఒక గౌరవాన్ని సంపాదించుకుంది. ఇందుకు కారణం మా శ్రమ మాత్రమే కాదు. అంతకు ఎంతో ఎక్కువగా మీ ప్రోత్సాహసహకారాలు, ఆదరాభిమానాలే అన్నది సుస్పష్టం. మీ అండ ఇలా ఉన్నంత కాలం ఈమాట నిరాఘాటంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది మా నమ్మకమే కాదు. మామాట కూడా. తెలుగు సాహిత్యానికి ఒక మూలకేంద్రంగా ఈమాట ఉండాలన్న కోరికతో సాంకేతిక భాషాసాహిత్యాల పరంగా నవతరాలలో పరిణమిస్తున్న అభిరుచులకు అనుగుణంగా పాతకొత్తల మేలుకలయికగా ఈమాటను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కాలానుగుణంగా మారుతూ వస్తున్నా, ఈమాట ఆశయాలలో కాని, సాహిత్యం పట్ల, పరిష్కరణ-ప్రచురణ పద్ధతుల పట్ల ఉన్న శ్రద్ధ, ఆచరణలలో కాని ఏ మార్పూ లేదు. ఇది ముందుముందు కూడా ఇలాగే కొనసాగుతుందని, ఏ రచననైనా నిరపేక్షంగా సాహిత్య పరిధులలోనే పరిశీలిస్తూ, రచయితలకు విమర్శ, పరిష్కరణల అవసరం తెలియజేస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించే మా ధోరణిలోనూ ఏ మార్పూ రాదని హామీ ఇస్తున్నాం. ఈ ప్రయత్నంలో మేము కొందరి మనసులు నొప్పించి, మరికొందరిని నిరాశపరచి ఉండేవుంటాం. అది ఈమాట పట్ల, సాహిత్యం పట్ల మాకున్న అభిమానాన్ని, గౌరవాన్ని నిలుపుకొనే ఉత్సాహంలో మేము తెలియక చేసిన పొరపాటే కాని తెలిసి చేసిన తప్పిదం కాదని సవినయంగా మనవి చేస్తున్నాం. తప్పులుంటే మన్నించి ఈ సాహిత్యప్రయాణంలో తోడు రమ్మని, తోడు కమ్మని, ప్రపంచం నలుమూలలా ఉన్న రచయితలనూ పాఠకులనూ మరొక్కసారి మనసారా ఆహ్వానిస్తున్నాం. రండి, అందరం కలిసి సాగుదాం. ఈమాటను మరిన్ని పదుల మైలురాళ్ళు దాటిద్దాం.
ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది.
సాలవృక్షాల క్రింద మా దారులు వేరైన చోట దారి నుండి పక్కకి తొలిగి నవోదయ స్కూలుకు వెళ్ళే బాటలో నుంచున్నాను. నడిచి వచ్చిన వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూశాను. అడవి కనబడలేదు. చుడిపహాడ్ మాత్రం మసకగా కనిపిస్తూ ఉన్నది. రేపు రాలేను. కాళ్ళు పుండ్లుపడి ఉంటాయి. ఎల్లుండి గురువారం. సంత రోజు. శుక్రవారం వచ్చి ఇదే సాలవృక్షాల క్రింద వేచి ఉంటాను. అడవి నాకింకా కావాలి.
పుస్తకమంతా బాగున్నప్పటికీ, నాకు అందులో ఒక వాక్యం ప్రత్యేకంగా నచ్చింది. ఇన్నేళ్ళకీ ఆ వాక్యం మరచిపోలేక పోతున్నాను. ఇది ఏదో కవిత్వం పూనిన వాక్యం కాదు. ఇది ఏదో రహస్యం మన చెవిలో గుసగుసలాడే వాక్యం అంతకంటే కాదు. ఇది గుండెను మెలితిప్పి కళ్ళ నీళ్ళు కార్పించే వాక్యమూ కాదు. ఏదో అందమైన, మధురమైన పదబంధాలతో నిండి ఉన్న వాక్యం కాదు.
నీకు నువ్వు తెలియదు. తెలుసుకూడానేమో. నువ్వంత చెడ్డవాడివి కాకపోయినా ఉత్తముడివీ కాదు. నీనుంచి నువు తప్పించుకోలేవు, నీకు విమోచన లేదు. ఆ బిచ్చగత్తెకు ఇచ్చింది రూపాయేనని గుర్తుపెట్టుకోవు. చందాలు మొహామాటానికే ఇచ్చావనీ మనసులో పెట్టుకోవు. మొక్కుబడికీ, ప్రదర్శనకీ తప్పించి నీ వల్ల ఏ కాజ్‌కీ ఇసుమంత ప్రయోజనం కలగదనీ గమనించవు. ఆ మురికినీళ్ళతోటే రోజూ రాత్రిపూట కూచుని కడుక్కుంటూ ఉంటావు.
ఆ అన్న తినడం పూర్తి చేసి, చేయి కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి, మళ్ళీ ఇందాకటి కుర్చీ మీదే కాళ్ళు ముడుచుకుని కూర్చుంటూ ‘ఏం తమ్ముడూ ఏం సంగతి?’ అన్నట్టుగా కొన్ని వివరాలు అడిగాడు. చాలా క్యాజువల్‌గా మాట్లాడుతున్నవాడల్లా కుర్చీలోకి మరింత ఒరుగుతూ, నా ముఖాన్ని పరీక్షగా చూసేలా తల పైకెత్తి, ‘డైరెక్టర్ అవడమంటే మాటలా?’ అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. ‘చూడు, ఈ ప్రశ్నకు జవాబు చెప్పు? ఒక తల్లి తన కొడుక్కు పాలిస్తున్నప్పుడు ఆమె చేతులు ఎక్కడుంటాయి?’
వాళ్ళందరూ స్టేజీ సర్దేశారు. మొహాలకి పూసుకున్న రంగులు తుడిచేసుకున్నారు. తళుకుల బట్టలు మార్చి అతుకులేసిన పాతచొక్కాలు తొడిగేసుకున్నారు. కథానాయకుడున్నాడుగా, నువ్వడిగిన మాటలు మహబాగా చప్పట్లమధ్య మళ్ళీ మళ్ళీ చెప్పి గొంతు జీరబోయినవాడు, వాడు మాత్రం నల్లవిగ్గు తీసేసి ఎర్రజుట్టు దువ్వుకున్నాడు, సీసా మూత తెరుచుకు కూచుని, అప్పుడప్పుడూ ఏదో గుర్తొచ్చి అమ్మలక్కలు లంకించుకుని శివాలెత్తుతున్నాడు.
శబ్దానికీ నిశ్శబ్దానికీ, ఊహకూ వాస్తవానికీ, చలనానికీ అచేతనకూ, ఉనికికీ ఉనికి లేమికీ, బయట ప్రపంచానికీ అంతర్లోకాలకూ, ప్రయాణానికీ జీవితానికీ మధ్య హద్దులు చెరిపేసి ఆలోచనకూ, భావానికీ, అనుభూతికీ, అక్షరానికీ, పదానికీ, వాక్యానికీ, రచనకూ మధ్య ఉండే హద్దులు అధిగమించి, నిన్నటికీ రేపటికీ మధ్య నిర్మించిన అక్షరవారధి ఈ పుస్తకం.
బ్యాగ్‌ల నిండా తడిబట్టలు. దులుపుతుంటే రాలిపడుతోన్న ఇసుక. తప్పుకుంటుంటే చుట్టుకుంటోన్న సముద్రపు నీటి వాసన, నీచు వాసన. తీరంలో నా పాదాలను తడిపినట్టే తడిపి వెనక్కి పోయిన అలల్లా… సెలవులు. దేవుడా, మళ్ళీ ఎప్పుడు?
నువ్వొచ్చి నన్ను ఎలా చూస్తావు? ఏ రూపంలో?
మబ్బుల్లేని నక్షత్రం లాగానా, లేక నీళ్ళమీద పొరలాగా
అంచెలంచెలుగా తాకుతూ పరుగెత్తే చిల్లపెంకు లాగానా?
నీకు ఏదైతే బాగుండదో నాకు తెలుసు,
కోయిల కుహూ కుహూల మధ్య నిశ్శబ్దం, నీకు బాగుంటుంది.
మెల్లగా పేరేగి కిందనుండి పాక్కుంటూ ఒకతను బయట పడినాడు. ఒంటిమీది గాయాలను కూడా పట్టించుకోకుండా, ఒక్క గెంతున ఆమె దగ్గరకు పోయినాడు. “ముయ్ లంజా, ముయ్ నోరు!” అంటూ ఆమె చెంపలమీద రెండు పీకినాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. నూర్రూపాయల రేకును తీసి పెద్దాయన చేతిలో పెడుతూ “ఆమెను కొట్టింది ఎందుకు?” అని అడిగినాను. “తెలుగులో అరిసింది సారు, లంజముండ! దానికే వాడు ఏబైతో సరిపెట్టేసినాడు.” గుండె కలుక్కుమనింది.
ఆ పక్కన
ఏ చాటునో
మలిన ప్రేమ
కాముకులో
అజ్ఞానంతో
వారు చెక్కుకున్న
పొడి పేర్లో
ఈ పుస్తకము ఎందుకు ముఖ్యమైనదో అనే విషయమును పరిశీలిద్దామా? సంస్కృతములో మనకు దొఱికిన కావ్యములలో ఇది పురాతనమైనది. అంటే అంతకు ముందు కావ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండవచ్చును. అవి ఏలాగుంటాయి అన్నది ఊహాగానమే. ఇది మొట్ట మొదటి కావ్యము.
పీకో సెకన్ల వ్యవహారం
తారా స్థాయిలో
కాళీ నృత్యం
ఆమె నల్లని
కురుల కొసలకి చిక్కుకుని
ఎగిరెగిరి పడుతుంటావు