అడ్డం
- సుఖం సంపద (3)
సమాధానం: పోడిమి - రావిచెట్టుకి మిరియము? (3)
సమాధానం: పిప్పలి - త్రిభుజాకారంలో ఉన్నా తినడం సమస్యకాదు (3)
సమాధానం: సమోస - ప్రశ్నించు పాదం (3)
సమాధానం: అడుగు - అసురుడి పెళ్ళాం? (3)
సమాధానం: రక్కసి - ఒక అమ్మాయి వావి-వరస చివర చేర్చుకుంది (3)
సమాధానం: వాసవి - పలక తయారుచెయ్యడానికి ఇది కావాలి (3)
సమాధానం: కలప - సుఖమెరుగని అవస్థ (2)
సమాధానం: నిద్ర - వేదపాఠం పాదము చూపే హస్తాక్షరాలు (4)
సమాధానం: సంతకాలు - వారివి క్రమం తప్పడం పరిపాటి (3)
సమాధానం: వావిరి - బతిమాలడానికి పట్టుకునేవి (2)
సమాధానం: కాళ్ళు - వృంతాకి రంగు (3)
సమాధానం: వంకాయ - దొంగ తలతెగిన పాండవ సోదరుడు సుమా! జాగ్రత్త!! (5)
సమాధానం: కుసుమాలుడు - నాటక భాగములో తల దూరిస్తే ఒడి (5)
సమాధానం: అంకతలము - తార పశువుల్ని తోలేటప్పుడు చేసే ధ్వని (2)
సమాధానం: రిక్క - కవిరత్నకంచెల ఇటునుండి (3)
సమాధానం: రవిక - ముందు బావి కనిపించిందంటే వెనుక ఇది ఉండాలి (2)
సమాధానం: గొయ్యి - హారం ఖరీదు యముడికి మరోపేరు (4)
సమాధానం: దండధర - పాడరా గానగంధర్వా..తిరిగి వాయించు ఢంకా (3)
సమాధానం: నగారా - వీడో బంకముచ్చు బోయవాడు (3)
సమాధానం: లుబ్ధుడు - పిల్లల్ని పడుకోపెట్టాలంటే ఇలా చెయ్యి (3)
సమాధానం: జోకొట్టు - కుళ్ళిపోయే ఆభరణం (3)
సమాధానం: మురుగు - ఇది అగ్గిమీద వేస్తే భగ్గుమంటుంది (4)
సమాధానం: గుగ్గిలము - భూమి వెల ఇరవైఎనిమిదిలోసగం (2)
సమాధానం: ధర - బంగారు కృష్ణపుష్పము (3)
సమాధానం: కనక - శ్రామికుడి తిరుగుబాటు ఆయుధం (2)
సమాధానం: సమ్మె - ఆకాశ భారతి (5)
సమాధానం: గగనవాణి - నలభైరోజుల్లో కలి మొదలుపెట్టే వలయం (5)
సమాధానం: మండలకము - తెలుగు సరిగా వ్రాయలేకపోవడం జబ్బు (3)
సమాధానం: తెగులు - తోకలేని కోతికి నిజంగానే తోక లేదు! కానీ రామాయణంలో ఉన్నాడు (2)
సమాధానం: వాలి - ఈ భూమి పశుమందల మేతకు వదలిన బంజరు (3)
సమాధానం: అలగా - అతి కౄరులు మాత్రమే ఎక్కేది (4)
సమాధానం: ఉరికంబం - బాల్య వివాహాలు మొదలైతే నుయ్యి (2)
సమాధానం: బావి - ఒక రకం చేప (3)
సమాధానం: పురవ - 40 నిలువే (3)
సమాధానం: రక్తప - బాలక్రీడలో అమ్మను వదిలి తిను (3)
సమాధానం: నములు - ఉదాహరణకి మిత్రభేదము హేతువు (3)
సమాధానం: తంత్రము - వరి పంట పండే నేల సరిగ్గాలేని మాటుంగా రాణి (3)
సమాధానం: మాగాణి - వక్రంగామొదలయ్యే చెట్టు చెప్పేది గాలిమాట (3)
సమాధానం: వదంతి - శిబిరము నిర్మించు గురుడా! (3)
సమాధానం: గుడారు
నిలువు
- రోకలిపోటులో ఇట్నుండి కనబడే తీరు (3)
సమాధానం: పోలిక - ఈ రుచి నసాళానికి అంటాలంటే ఇదుండాల్సిందే (5)
సమాధానం: మిరపకాయ - వీడో 31 (3)
సమాధానం: పిసిని - కలిపి వ్రాత (2)
సమాధానం: లిపి - సూర్యుడు తండ్రి (3)
సమాధానం: సవిత - సత్యవాదులు అప్పుడప్పుడు చేసే ప్రతిఘటన (3)
సమాధానం: సవాలు - హి హి! అవి వాత దెబ్బలు కావు. ఇంకా పెళ్ళి కాలేదు (5)
సమాధానం: అవివాహిత - పడమటి రాగం (3)
సమాధానం: గుజ్జరి - దమ్మిడీలో సగం డబ్బు (2)
సమాధానం: కాసు - రుసుమా? కొంచెం అటూ ఇటుగా (3)
సమాధానం: సుమారు - టొంకరకి ముందు? (3)
సమాధానం: వంకర - వేపి తొంగలి ఉద్భిజ్జము (5)
సమాధానం: కుక్కగొడుగు - ఒక వాద్యవిశేషం (4)
సమాధానం: డుబుడక్క - అప్పకవీయంలో తిరగబడ్డ ప్రాణి (2)
సమాధానం: కప్ప - ముకుంద మురారి అని అప్పుడప్పుడంటే అసలు ధరలో మినహాయింపు లబిస్తుంది (3)
సమాధానం: ముదరా - ప్రాప్తించు గుహ (3)
సమాధానం: కలుగు - అంధకారము (5)
సమాధానం: రజోరసము - కళ్ళకి కట్టినట్టు కథ చెప్తే అటక కనిపిస్తుంది (3)
సమాధానం: నట్టుక - విష్ణుమూర్తిగా ఆరాధించే శిల గండకీనదిలో లభ్యం (4)
సమాధానం: సాలగ్రామం - ఈ చెట్టెక్కితే తలకిందులుగా పడ్డారే (3)
సమాధానం: మునగ - దొంగలు వేసేవి (3)
సమాధానం: కన్నాలు - ఇచ్చిపుచ్చుకునే సంబంధం చివరి సగం పోయి అగ్నిపర్వతం లోంచి పుట్టేది మిగిలింది (2)
సమాధానం: లావా - నీటగల జన్మి అట్నుంచి పట్టుకుంటే వదలదు (3)
సమాధానం: జలగ - అందము మధ్యలో గార పడితే మనోహరము (5)
సమాధానం: నయగారము - ఇదే అడ్డంలో వ్యాఘ్రం పరకాయ ప్రవేశం చేస్తే హంసగా మారుతుంది (5)
సమాధానం: తెలిపులుగు - సింహగిరివనాల్లో పండిన పంట వెనకపడింది (2)
సమాధానం: వరి - కాలహరణము చేస్తే గరళంగా మారేది (3)
సమాధానం: అమృతం - ఈ ఆహారపదార్థం అలంకారం (3)
సమాధానం: ఉపమా - ఆడుగుఱ్ఱము (3)
సమాధానం: కంఖాణి - వినయవతిలో వర్చస్సు లోపించిందని మనవి చేసుకుంటున్నాను (3)
సమాధానం: వినతి - ప్రకృతి వనరుల మధ్య విలపించు (3)
సమాధానం: వనరు - హృదయం లేని సేన ధైర్యం (2)
సమాధానం: చేవ