అనువాదం
పగవారి కుట్రో
బంధువుల గూడుపుఠాణో
రాజ్యభారం కోల్పోయి
బికారిలా తిరగసాగాడు రాజు
రాజభోగాలు పోయాయని చింతలేదు
చెట్లూపుట్టలు సంచరించి
అనంతాకాశాన్ని వీక్షించి
మనుషులను పరామర్శించి
కోటానుకోటి జీవరాసులని సందర్శించి
ఆరుబయట ఏకాంతంలో ఆనందంగా నిద్రించాడు రాజు
తన దేశపు విశ్రాంతి మండపాలు ౘావిళ్ళు
అన్నదాన సత్రాలు చలివేంద్రాలు
అరుగులు ఆతిథ్యాలు
వేటికీ కొరతలేదు
కూటికి లోటులేదని గ్రహించి
కొంచం గర్వంతో
తారాస్థాయికెగిరిపోయి
ఆకాశాన విహరించింది మనసు
నదీస్నానంలో ఓలలాడినప్పుడూ
సస్యశ్యామలమైన పొలాల్లో మైమరచినపుడూ
తిరనాళ్ళ కోలాహలాల్లో కలిసిపోయినప్పుడూ
బజార్లలో పల్లెటూరి వీధుల్లో
మాసిన తల పెరిగిన గడ్డంతో
దేశదిమ్మరిలా తిరిగేటప్పుడు
ఉన్నది ఒక్క అసంతృప్తే. కాదు, కోరికే
ఏ కన్ను అయినా
అది శత్రువుదైనాసరే
తన రాజ్యభారం మోసిన
గురుతులను గుర్తించే
చూపు కలిగివుండేనా?
(05-09-2015)
(మూలం: కోళైయిన్ పాడల్‌గళ్(పిరికివాడి పాటలు) 2016, కవితా సంపుటి నుంచి అడైయాళం కవిత.)
మూలం
అడైయాళం
పగై చదియో
ఉఱవు తందిరమో
రాజ్యబారం ఇళందు
నాడోడియాయ్ అలైయలానాన్ అరసన్
సుగబోగ వసదిగళ్ పోనదు పెరిదల్ల
పయణత్తిల్ మరంగళై అఱిందుం
వానై పార్తుం
మనిదర్గళై కణ్డుం
కోడానుకోడి జీవన్గళై దరిసిత్తుం
ఏకాంద వెళియిల్ ఆనందమాయ్ దుయిన్ఱాన్
తన్ నాట్టిల్ సత్తిరంగళ్ చావడిగళ్
అన్నదానంగళ్ తణ్ణిర్ పందల్గళ్
తిణ్ణైగళ్ విరుందోంబల్
ఎల్లాం నిఱైందిరుందన
చోట్ఱు కవలైయిల్లై ఎన్బదుణర్ందు
కొంజం గర్వత్తుడన్
విణ్మీన్ పొరిత్త
ఆగాయత్తిల్ మనం ఉలావినాన్
ఆట్ఱిల్ నీంది సుగిక్కైయిలుం
వయల్‌వెళిగళిల్ నడందు ఇన్బుఱుగైయిలుమ్
తిరువిళా కొణ్డాట్ట కూట్టత్తిల్
నుళైందు తిరిగైయిలుమ్
సందై కడైగళిలుం గిరామ వీదిగళిలుమ్
దాడియుం మీసైయుమాయ్
పరదేశి కోలం కాట్టుగైయిలుం
ఒరే ఒరు కుఱైదాన్, అల్ల, ఎదిర్పార్పు
ఎంద విళిక్కేనుం
అదు ఎదిరియినుడైయదాగ ఇరుప్పినుం
రాజ్యబారం సుమందవనిన్
అడైయాళం కాణుం
పార్వై తోన్ఱుమా?