ఉన్నట్టుండి శూన్యమైపోవడం
తర్వాత శైల్యమైపోవడం
కానీ తిరిగి చిగురవ్వడానికే
కొంచెం ఊపిరి పోసుకోవాలి
ఇంకొంచెం రేపటిని కలగనాలి
ఒంటరి శరమై లోలోన
ఒక యుద్ధం పరంపరవ్వాలి
గెలవాలి. వెల్తురు చీలిక చూడాలి
అపుడు మొలకవుతాం.
జారిపోవడం కొత్తేమీ కాదుగా
మరి తిరిగి లేవడమూ పాతే.