రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం

రచన: శ్రీకాంత్
మార్చి 2016

1

వాన వాసన వేసే పూలరేకుల వలే తాకుతాయి
నీ చేతులు, ఈ చినుకులూ
గోప్యంగా తేలొచ్చే
చల్లటి గాలీనూ-

ఆ గాలిలో, ఆ లేత పసుపుపచ్చ కాంతిలో, సీతాకోకచిలుకలు-
ఏ లోకాలను విసురుతున్నాయో
ఆ రెక్కలు కానీ

వెన్నెల కళ్ళాపి జల్లినట్టు, నీ చుట్టూ పచ్చిక కాంతి-

తలలు వాల్చిన
ఆకుల కింద చేరి, ఊయలలూగే నీడలు, వజ్రాలూ
మెరిసే నీ కళ్ళూ-

2

మరి ఏం ఉంది
అప్పుడు నాకు-?

3

సరస్సుల అంచులలో తేలికగా ఊగే అలలపై కదిలే నాచూ
రెక్కలూపక ఆ వెలుతురులో
అలా నిశ్చలంగా తేలే
తూనిగల నిశ్శబ్ధమూ

నాలో: ఒక శిశువు
ఊయలూగుతూ, నిద్రలోకి జారుకున్నంత మెత్తదనం
పెదవిపై మిగిలిన
పాల తడి వంటి
ఒక ఇష్టమూనూ-

కానీ మరి ఇదంతా
ఏమిటీ అని అంటే

4

ఏమీ లేదు – ఉన్నదంతా, ఇక మనకు మిగిలినదంతా
ఇక ఇదే ఉదయం
ఇక ఇదే జీవితం-

కొంత నాతో, కొంత నీతో, కొంత ఇలా మనకి మనతో-
కానీ, కన్నా

5

మరి ఇంతకూ
సంధ్యా సమయంలో, కలువ పూల చుట్టూ గుమికూడి
ఒక బిందువులోకి

పునర్యానం
అవుతున్న
ఆ వలయాలను చూశావా నువ్వు?

(07-08-2013)

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    వెంకటేశ్వరరావు April 4, 2016 11:59 am

    చూసినా ఏం ఉంది
    అప్పుడు నాకు-?
    అదే ఉదయం
    అదే జీవితం

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నిన్ను కావలించుకునే…
  • నిన్ను ఎవరైనా పలకరిస్తే
  • లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  • మూడు కవితలు
  • Poems on M/other: మూడు కవితలు

ఇటువంటివే…

  1. లిఖిత: ఒక మధ్యాహ్నం
  2. లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  3. లిఖిత: నా చీకటి
  4. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  5. ఉదయం

మార్చి 2016 సంచికలో ...

  • ఉద్యోగపర్వము – రాయబారాలు
  • ఏం జీవితం!
  • కోటిగాని కతలు: శ్రీశైలంలో సన్యాసి
  • తత్వం…
  • నాకు నచ్చిన పద్యం: ఒక ఉన్మాది మనస్సినీవాలి
  • పద్యంలో ఉప్పెన
  • మరి వేరే ఎవరు?
  • మార్చ్ 2016
  • రాగలహరి: శివరంజని
  • లిఖిత: ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం
  • లిఖిత: ఒక మధ్యాహ్నం
  • లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
  • లిఖిత: కాలంలో ఒక క్షణం, నీతో –
  • లిఖిత: నా చీకటి
  • వల్లూరి జగన్నాథరావు
  • వాసకసజ్జిక, విరహోత్కంఠిత
  • విజయనగరం జ్ఞాపకాలు – పట్రాయని సంగీతరావు
  • సత్సంగం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే
లిఖిత: ఒక మధ్యాహ్నం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.