దాన్తె ఇటాలియన్ భాషలో తెలుగులో నన్నయలాంటివాడు. అతనికి పూర్వం ఒకరిద్దరు ఆ భాషలో కవులున్నా, దాన్తె కావ్యంతో ఆ భాషకు గొప్ప గుర్తింపు వచ్చింది. హోమర్ గ్రీకు, వర్జిల్ లాటిన్‌తో సాటిగా దాన్తె ఇటాలియన్ గుర్తింపు పొందింది. దాన్తెకు మనమేమీ బిరుదులివ్వనవసరం లేదు. ఆయనకు బోలెడంత ఆత్మవిశ్వాసం. తిక్కనకేమీ తీసిపోడు.
ఫిబ్రవరి 2021
సాహిత్యసృష్టి చాలా చిత్రమైనది, ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపగల శక్తి కలది. శతాబ్దాలుగా సాహిత్యకారులు, ఎన్నో విభిన్నమైన జీవననేపథ్యాల నుండి వచ్చి కూడా, అంతకు ఎన్నోరెట్లు విభిన్నమైన జీవనపార్శ్వాలని గమనిస్తూ కూడా, జీవితానికి ఏ లక్షణాలు ప్రాథమికమనుకుంటామో అవే సాహిత్యంలోనూ ప్రతిఫలింపజేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. సమాచారప్రసారాలు సంక్లిష్టమైన కాలంలో కూడా యుద్ధం-శోకం, ప్రేమ-పగ ఆకలి-కోరికల చుట్టూ తిరిగిన దేశదేశాల కథల మధ్య, క్లాసిక్స్ అని చెప్పబడ్డ మహోత్కృష్ట సాహిత్యం మధ్య గల సామ్యాలను విమర్శకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. జీవనవిధానాలు, దేశకాలసంస్కృతులూ ఎంత విభిన్నమైనవయినా సాహిత్యకారులు స్పందించే తీరులోని ఏకత్వాన్ని ఈ విశ్లేషణలు ఎత్తిచూపుతాయి. ఇప్పుడు, ప్రపంచం లోని ఏ మూల ఉన్న విషయమైనా చూపుడువేలి చివరే దొరికే ఈ రోజుల్లో, కథల్లో సామ్యాలు కనపడం మరింత సహజం. ఇవన్నీ ఒకే ఆలోచనకు చెందినవనుకోవడం మరింత సులువు. అంతమాత్రాన అవన్నీ ఒకే కథలనుకోవడం తగనిపని. కథావస్తువులో ఎంతటి ఏకత్వమున్నా శైలీశిల్పాల విన్యాసమే భిన్నత్వానికి దారులు వేస్తుంది. అదే ఒక మామూలు విషయాన్ని కథగా కళగా మారుస్తుంది. ఒకే కథను వేయి గొంతులలో వినిపిస్తుంది. ఏ కథకు ఆ కథనే ప్రత్యేకంగా నిలుపుతుంది. అందుకే, ఇప్పుడు మనం వెదుక్కోవాల్సింది కథావస్తువుల్లోని సామ్యాలను కాదు. కథనాలలోని భిన్నత్వాన్ని. ఒకే వస్తువును సాహిత్యం ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలలో ప్రతిఫలించగలదో గమనించాలి. వస్తువులోని సామ్యత కాదు, అది ప్రకటించే విధానంలోని వైవిధ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతీ కథ ఒకేలా ముగియదని, ముగియనక్కరలేదని, ఏ కథ ముగింపు ఆ కథే వెతుక్కుంటుందని గుర్తించి, ఆ మలుపులను, ముగింపులను అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. రచయితలకైనా, విమర్శకులకైనా ఆ సూక్ష్మదృష్టి, ఆ వివేచన కొరబడినప్పుడు, వస్తుసామ్యమే ప్రాతిపదికగా కథలను పోల్చుకుంటూ, తమ భావజాలానికి, తమ అవసరాలకు సరిపోయినట్టుగా మాత్రమే ఆ కథను వివరించాలని ప్రయత్నించినప్పుడు, అన్ని కథలకూ ఒకే ముగింపు బలవంతపు అవసరం అవుతుంది. ఈ మూస ఇందులో ఇమడని జీవితాలను వెక్కిరిస్తుంది. విస్తరించుకుపోవడమే ప్రధాన లక్షణమైన సాహిత్యాన్ని పరిధి గీసి దాటనివ్వని ప్రమాదకర ధోరణి ఇది. గుంపుగా కాక మనలేని సాహిత్యసమాజంలో ఏకాకుల గొంతులు వినపడవు. వాటిని ఆహ్వానించి వినడం వినిపించడం నేర్చుకోని సాహిత్యసమాజానికి ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉండదు.
స్టాఎల్ ప్రణయ జీవితం కేవలం ప్రణయ జీవితమైతే చెప్పుకోవాల్సిన పనిలేదు. తన రాజకీయాలతో అనుసంధానం చేసి, అప్పటి రాజకీయనాయకులకు ప్రేరణను కలిగిస్తూ, వారి ద్వారా చాణక్యుడి తరహాలో రహస్య చర్యలు చేపడుతూ సామాజిక, రాజకీయ జీవితంలో తన కార్యక్రమాల నిర్వహణకు ఆ ప్రణయసంబంధాలను ఉపయోగించుకుంది.
జగదేకవీరుని కథ సినిమాలో ’దేవకన్యలు రాత్రిపూట వచ్చి జలకాలాడే ఒక తటాకం’ అన్న చక్కని కల్పన ఉంది. బహుశా ఏ స్టూడియోలోనో ఆ తటాకపు సెట్టువేసి ‘ఏమి హాయిలే హలా’ అని ఆ పూల్‌గర్ల్స్‌తో పాడించి ఉంటారు. కానీ కె. వి. రెడ్డిగారు, మాధవపెద్ది గోఖలేగారూ ఈ వాదీదర్బత్ చూసి వుంటే ఆ సెట్టూ గిట్టూ ఆలోచన పెట్టుకోకుండా ఆ సన్నివేశాన్ని ఇక్కడే చిత్రించి ఉండేవారు.
“అమ్మమ్మా! నీకు తాతయ్య అంటే కోపమా?”
“అదేం లేదురా. మీ తాతయ్యకి నా స్వభావాన్ని అర్థం చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన స్వభావంలో ఇమిడిపోతూ వచ్చా అనేక భయాల కారణంగా.”
“అంత భయం ఉన్నదానివి రేపు అంత పెద్ద అబద్ధం ఆడటం ఏంటి అమ్మమ్మా! అదీ నువ్వు పూజించే దేవుడి ఎదురుగా. దేవుణ్ణి మోసం చేయడం కదా అది!”
మాతృత్వంలోని మాధుర్యం, తల్లిప్రేమ గొప్పతనం, అమ్మ అనిపించుకోవడం స్త్రీమూర్తికి గౌరవం అంటూ గొంతెత్తి అరుస్తున్న సమాజం నిజంగా తల్లుల పట్ల ఎలా ప్రవర్తిస్తోంది? ఒక స్త్రీ తల్లిగా మాత్రమే మిగిలిపోక ఒక మనిషిగా కూడా తన జీవితాన్ని మలచుకోవాలనుకుంటే? అసలు పిల్లలే వద్దనుకుంటే? అందరు మగవారు తండ్రి పాత్రలకు ఎలా సరిపోరో, ఆడవారు కూడానూ అందరూ తల్లి పాత్రలకు సరిపోరు అన్న వివేచన అసలు వస్తుందా?
అసలు దయ్యాలు, సైతానూ అన్నవే లేకపోతే, క్రీస్తుమతం పొడిపొడిగా రాలిపోతుంది; ఏళ్ళబట్టి అబద్ధాలూ పొరపాట్లతో, అసత్యాలతో, అద్భుతాలూ వింతలతో, రక్తపాతంతో, అగ్నిజ్వాలలతో, అనాగరిక ప్రపంచం నుండి ఎరువు తెచ్చుకున్న కల్పిత కథలతో మన పూర్వీకులు, పోపులు, ఫాదరీలు, వేదాంతులు, క్రైస్తవం పేరుతో నిర్మించిన భవనం నామరూపాలు లేకుండా కుప్పకూలిపోతుంది.
మూలఘటిక కేతన కవి, వ్యాకర్త, ధర్మశాస్త్రకర్త. తిక్కన మహాకవికి సమకాలికుడై ఆయనకు తన దశకుమారచరితము అనే దండి మహాకవి కావ్యపు తెలుగుసేతను అంకితమిచ్చి ఆయన మన్ననలు పొందిన కేతన ఇంత గట్టిగా తానే తెలుగుకు మొదటగా వ్యాకరణం రాస్తున్నాను అని చెప్పుకున్నాడు.
కర్నూలు నవాబగు గులాం రసూలుఖానుగారి కోటను తనిఖీచేయగా రహస్యాయుధాగారము బయల్పడెను. అంతట ఆయనను పట్టుకొని పదచ్యుతుని చేసి తిరుచినాపల్లిలో ఖైదుచేసిరి. ఆతడక్కడ ఇంగ్లీషువారి మెప్పుకై క్రైస్తవ దేవాలయములో ప్రార్థనలకు హాజరగుట ప్రారంభించెను. అప్పుడొక వాహబీ ఫకీరతనిని వధించెను.
ఆయన ఆరోజు రాత్రి మూవీ చూడాలన్నాడు. పెద్దగా సినిమాలు చూడడు, ఏమయిందో మరి? ప్లే చేశాను. గుజారిష్. అక్కడేముందో మన జీవితాల్లోనూ అదే, ఏం చూస్తాం? అని తనే మధ్యలో ఆపి ‘నీకు కాలేజి లవ్ స్టోరీ ఏం లేదా?’ అన్నాడు. ‘పూర్తిగా చదివితే ఉండేదేమో’ అన్నాను. ఎందుకో ఆయన వైపు చూడలేదు. ‘ఉండి ఉంటే బాగుండేదా?’ అన్నాడు. ‘ఎవరూ? నాకు చెప్పు?’ నవ్వాడు.
సూరీడు మంచునీ
మంచు చెట్లనీ కప్పుకునుంటే
ఇంకా తెల్లారనట్టు మోసపోయాను.
పడవపువ్వుల్ని కుట్టుకుని
నది
ఇసకంచు చీర చుట్టేసుకుంది.
నిర్లక్ష్యంతోనో
అవసరం లేదనో
ఎడతెరిపి లేకుండా
పరుగులు తీస్తూ
చిటికెడు సమయాన్ని
వారి దోసిట్లో
ఆత్మీయంగా పోయలేని మనం
యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని నగిషీలుగా అద్దుకుంటూ
లోపలి ఆర్తిని అణచడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి సాంద్రంగా ఒక పాట మొదలవుతుంది.
కన్నీరు జారి చార కట్టడం
రెప్పల వెనుక మెలకువని
తట్టి నిద్ర లేపడం
లబ్‌డబ్‌లతో పెనవేసి చాచిన
చేతిని విదుల్చుకోవడం
శ్వాసల మధ్య నీరవాన్ని
గుర్తించి గౌరవించడం
ఈ కన్నీటిదీవి ఇప్పుడు
నా వాస్తవికత
ఈ దుఃఖసముద్రం
నా సహచరి
ఆ ఎడారులు
ఆ పక్షుల్లేని అరణ్యాలు
ఈ తలుపుల్లేని ఇల్లూ
ఇప్పుడిదే నా ప్రపంచం
పాతాళంలో పడి ఉన్న
పెళుసు లోహాన్ని నేను
గునపంతో తవ్వు
బురదంతా కడుగు
నిప్పుల కొలిమిలో
నిలువునా కాల్చు
తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.
గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవడానికి చూస్తూ
రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను
ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. సినీ నేపథ్యగానమే గాక లలితసంగీతం లోనూ కృషి చేసి, సుందరకాండను పండిత పామర జనరంజకమైన గీతంగా అలతి పదాల్లో రాసి తానే బాణీ కట్టి ఆలపించిన ఆ గాయకుడు ఎమ్. ఎస్. రామారావుగా ప్రసిద్ది పొందిన మోపర్తి సీతారామారావు.
ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల
1995లో తన ‘క్రాస్‌రోడ్స్’ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.
క్రితం సంచికలోని గడినుడి-51కి మొదటి ఇరవై రోజుల్లో పంతొమ్మిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-51 సమాధానాలు.