రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వెనక్కి తిరిగిన ఓ చూపు

రచన: సురేష్ రావి
ఫిబ్రవరి 2021

నిన్నారేపులను తవ్వుకుంటూ వెళ్ళే దారివెంట
గాలిమడుగులో తప్పిపోయిన ఊపిరులను లెక్కగట్టి
ఒద్దికగా నిలబడిపోయిన వానల్లో
తడిసిన రెప్పల అలికిడికి చెవులు ఒగ్గి
పాతక్షణాలన్నీ ఒకటొకటిగా ఆవిరైపోతుంటే
వెనక్కి తిరిగిన ఓ చూపు చెబుతోంది
నకారాత్మమొకటి మరింతగా చిక్కబడుతుందని.

నాకు నేను ఒక షరతుగా మారిపోయాక
కుంచించుకుపోయిన ఆకాశానికి ప్రయాణం కట్టడానికి
ఈ నా రెక్కల బలిమి ఎంతైతేనేమి
నాకు నేనొక్క బంధనంగా కట్టబడి
ఎక్కడెక్కడి స్వేచ్ఛలన్నీ
కళ్ళ ముందరే నర్తిస్తోంటే
మనసంతా నింగి నలుపు.

యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని నగిషీలుగా అద్దుకుంటూ
లోపలి ఆర్తిని అణచడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి సాంద్రంగా ఒక పాట మొదలవుతుంది.

సరిగ్గా అప్పుడే
గుండె నుండి ఆకాశం కురవటం మొదలవుతుంది.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Sambhamurthy Landa February 1, 2021 11:18 am

    గుండె నుండి ఆకాశం కురవడం మొదలవుతుంది.
    గొప్ప ముగింపు

  2. 2
    సురేష్ రావి February 4, 2021 5:34 am

    Thank you very much Sambamurthy garu

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • వెనక్కి తిరిగిన ఓ చూపు
  • అక్షయం

ఇటువంటివే…

  1. ఎదిరి చూపు
  2. ముందు చూపు
  3. తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు
  4. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు
  5. తలుపుల్లేని ఇల్లు

ఫిబ్రవరి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 3
  • Question
  • అ సత్యం
  • అమ్మలేకపోవడం: అనేక సందర్భాలు
  • అసంపూర్ణంగా
  • ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం
  • కొత్తగా
  • గడినుడి – 52
  • గల్ఫ్ గీతం: 8. సలాలా
  • చూశావా
  • డివైన్ కామెడీ: దాన్తె అలిగ్యేరి
  • తలుపుల్లేని ఇల్లు
  • తేలికపాటి వెన్నెల
  • పుస్తక పరిచయాలు
  • ఫిబ్రవరి 2021
  • బహుముఖాలు
  • మూఢనమ్మకాలు
  • మూతబడ్డ పుస్తకం
  • రెండు కవితలు
  • విలక్షణ గాయకుడు: ఎమ్. ఎస్. రామారావు
  • విశ్వమహిళా నవల: 7. మదామ్ దె స్టాఎల్
  • వెనక్కి తిరిగిన ఓ చూపు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 52
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తేలికపాటి వెన్నెల
మూతబడ్డ పుస్తకం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.