ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులుంటాయి.

అప్పుడే బ్యాంకాక్ నగరం మేలుకొంటోంది. ఆకాశంలో వెలుగు రేకలు. దారిలో ఏదో జలప్రవాహపు ఉనికి. చక్కని రోడ్లు… ఫ్లై ఓవర్లు… మెల్లగా పుంజుకొంటోన్న వాహనాల జోరు. నగరం గురించి సరళమైన ఇంగ్లీషులో నా చిన్న చిన్న ప్రశ్నలు. తడబడుటాంగ్లంలో అతని సమాధానాలు. కుదిరిన సామరస్యం.

ఆయుత్సవములో ముస్తఫాకడ దాసులుగా నున్న ఇటలీదేశీయులు బృందగాయకులుగా పాల్గొన్నారు. కామాంధుడైన ముస్తఫా ఆ సభ్యత్వము గైకొని, దాని నియమములను తప్పక పాటింతునని ప్రమాణము చేసినాడు. ఆ నియమములు సుష్ఠుగా నిరంతరము తినుచుండుట, సురాపానము చేయుచుండుట, చుట్టూరా ఏమి జరుగుచున్నను దానిని పట్టించుకొనక యుండుట – అనునవి.

చూడు
ఇదొక
ఊహల లోకం
ఆశల లోకం
నిరాశల నెగడు ముందు
కల్పనల్ని ఎగదోసుకుంటూ
పరచుకునే పొగమీద
పార్థివ హృదయాలను
మోసుకు తిరిగే లోకం!

ఈ భార్యాభర్తలు ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నారు. టైమవుతోందని ఆమె ఒకటే గొణుగుతోంది. మిషన్‌ దగ్గర ఉన్నతను డబ్బులు చేతిలోకి తీసుకోగానే, ఇంక ఎటూ నేను హడావుడిలో ఉన్నాననే ఒక తెలియని అధికారంతో ముందటి ముసలాయన్ని కాదని ఇతడు ముందుకు పోబోయాడు. ఆ ముసలాయన ఏమీ తొణక్కుండా, ‘హలో! నేను ఇక్కడొకణ్ని లైన్లో ఉన్నాను’ అన్నాడు. చేసేదేమీలేక అతడు చేతులు జోడించి సారీ చెబుతూ, భార్య ముఖం వైపు చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు.

ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…

తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?

నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశానికి తెలుసా?

అలా బీచ్‌కెళ్ళి కాసేపు వాక్ చేసొద్దామా? అంటూ ఈ కథలో ఎవరూ డయలాగ్ వేయలేదు. వాక్‌కెళ్ళారు. ఇసుక తెల్లగా, పొడిగా ఉన్నచోట కూర్చున్నారు. చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఇప్పుడు ఈ చోట కథ క్రైమ్ కథలా మారిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ కథలో ఆబ్సెంట్ అయిన కమలాకర్ పాత్ర వల్ల కథ మరో దారిలో ప్రయాణించేందుకు మేకప్ అదీ వేసుకుని రెడీ అవుతోంది.

దూరం
బహుశా కొలుస్తున్నావేమో
దూరం
బహుశా మోస్తున్నావేమో
దూరం
నించి బహుశా చలిస్తున్నావేమో
దూరం
నించి బహుశా నువ్వూ కదుల్తున్నావేమో…

రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్ళలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…

ఛాయాదేవి అంటే క్రమశిక్షణ. ఛాయాదేవి అంటే సమయ పాలన. ఛాయాదేవి అంటే ప్రతిపనీ కళాత్మకంగా చెయ్యడం. ఛాయాదేవి అంటే హాస్య చతురత. ఎంత కష్టాన్నైనా అది సహజమేనన్నట్లు స్వీకరించడానికి సిద్ధంగా వుండడం. మృత్యువు అనివార్యం. కాని అందరూ సంసిద్ధంగా ఉండలేరు. ఛాయాదేవి మాత్రం ఎవరికీ ఎలాంటి తడబాటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని సగౌరవంగా వెళ్ళిపోయారు.

వనజకి కళ్ళనీళ్ళ పర్యంతమయింది. తన సెక్షన్ వర్క్ గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. తన అనుభవంతో సంపాదించిన విజ్ఞానాన్ని ప్రదర్శించటానికి రవంత అవకాశం కూడా ఇవ్వలేదనిపించింది. ఊరుకున్నదాన్ని పిలిచి అప్లై చెయ్యమనీ, సెక్షన్ గురించి పుస్తకాలు చదవమనీ ప్రత్యేకం సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇంటర్వ్యూలో అలా కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థంకాలేదామెకి.

గూడు నాదే నన్న భ్రమలో
మాయాద్వీపపు పక్షినై విహరించిన నాకు
బంధం కేవలం భావనే అన్న ఎరుక కలిగించిన నువ్వు

నీ కళ్ళలో నా నీడ కోసం
వెతికి వెతికి ఓడిపోయాక
ఇప్పుడు నా బొమ్మ ఎదురుగా నువ్వు

గణపతిముని విదేశీయుల పాలనలో కృశించిపోయిన భారతసమాజం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే అకుంఠితమైన శ్రద్ధతో, వేదనతో తన తపఃజీవితాన్ని గడిపాడు. స్వతంత్రోద్యమంలో కొన్నాళ్ళు చురుగ్గా పాల్గొని, మద్రాస్ కాంగ్రెస్ సభలలో సభ్యుడిగా పాల్గొన్నాడు. గాంధీజీ హిందీ భాషోద్యమంతోనూ, హరిజనోద్యమంతోనూ ఆయనకి మౌలికమైన విభేదాలు రావడంతో, కాంగ్రెస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.

ఆకాశమందలి యవిభక్త నాద
మాకారమైయెప్పు నక్షరమునకు

ఆనాదముగణేశు నాదిమమూర్తి
ధ్యానముచేయుట దానిని వినుట

శర్వుని పట్టిగా సత్యనాదమును
సర్వము తెలిసిన సజ్జనులనిరి

వర్గ ప్రాతినిధ్యపు
పక్షపాతపు చూపులేని కవిత
పుంఖానుపుంఖాలుగా సాగి
రొట్టకొట్టుడు ప్రయోగాలతో
సూక్తివాక్యాలతో
నీకు మాత్రమే సందేశమవని
కవిత ఒక్కటి చెప్తావా

క్రితం సంచికలోని గడినుడి-33కి గడువుతేదీ లోగా నలుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, చందన శైలజ, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-33 సమాధానాలు, వివరణ.

రెండు చేతులు కౌగిలించుకునప్పుడు
వచ్చే కడియాల చప్పుడుతో
తరగతి గదులు నిద్రలేస్తుంటాయి
అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.