పి. బి. శ్రీనివాస్ (22 సెప్టెంబర్ 1930 – 14 ఏప్రిల్ 2013)
పి. బి. శ్రీనివాస్ : పిబిఎస్‌గా సంగీతాభిమానులకు చిరపరిచితుడు, దక్షిణభారత సినీసంగీతానికి కలికితురాయి అయిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ కేవలం గాయకుడే కాదు, బహుభాషాకోవిదుడు, సాహిత్యవేత్త కూడా. సహృదయుడు, అజాతశత్రువు, ఆయన స్మృతికి నివాళిగా జెజ్జాల మోహనరావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, పరుచూరి శ్రీనివాస్‌లు సమర్పిస్తున్న బహుభాషా సినీగీతభరిత వ్యాసం ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్; ఆ సంగీత కళానిధి జీవితాన్ని, ఆయన ఛందో విజ్ఞానాన్ని సంగ్రహంగా పరిచయం చేస్తూ ఏల్చూరి మురళీధర రావు వ్యాసం సంగీత సాహిత్య శ్రీనివాసుడు; భారతదేశంలో కవి పుస్తకాన్ని రచించడు, పుస్తకమే కవిని రచిస్తుంది. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు అంటూ తన సిద్ధాంతానికి మరికొంత వివరణ ఇస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు.
ఈ సంచికలో:
- కవితలు: మల్లేపూల్ మల్లేపూల్ – పాలపర్తి ఇంద్రాణి; జాతర – సాయి పద్మ, ఊపిరిపాటకు చూపేదీ? స్వాతికుమారి బండ్లమూడి; మంత్రభాషణం – ఎలనాగ, చతురదూతిక – తిరుమల కృష్ణదేశికాచార్యులు; ఆకుపై నిలిచిన వానచినుకులు – అవినేని భాస్కర్; లెక్కల పాఠం -తః తః; టోపీలు పెట్టబడును – బండి సత్యనారాయణ; పుష్పవివేకం – గరికపాటి మల్లావధాని; సిరినివాస వృత్తము – జెజ్జాల కృష్ణ మోహన రావు.
- కథలు: వదిన – గౌరి కృపానందన్; కతికితే అతకదు – ఆర్. శర్మ దంతుర్తి; పైగదిలో ప్రేమికుడు – శారద.
- వ్యాసాలు: తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం – రాళ్ళపల్లి సుందరం; పలుకుబడి-కాలమానము -సురేశ్ కొలిచాల, సత్య మొహంతితో ముఖాముఖీ 2వ భాగం – భరణి కొల్లిపర, మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – వెల్చేరు నారాయణ రావు; హాయిగ పాడుదునా? – పి. బి. శ్రీనివాస్; ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్ – విష్ణుభొట్ల లక్ష్మన్న, జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్; సంగీత సాహిత్య శ్రీనివాసుడు – ఏల్చూరి మురళీధర రావు; చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు – పి. బి. శ్రీనివాస్.
- శీర్షికలు:నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం – చీమలమర్రి బృందావనరావు.