ఈమాట సెప్టెంబర్ 2013 సంచికకు స్వాగతం!

ఈ సంచికతో ఈమాటను సాంకేతికంగా మరిన్ని సదుపాయాలు కలిగిన సరికొత్త వర్డ్‌ప్రెస్ లోకి మార్చాం. అందుకు అణుగుణంగా, పాఠకుల సౌకర్యం కోసంగా ఈమాట వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. పాఠకులందరికీ చిరపరిచితమైన ఈమాట వేషాన్ని మరికొంత మెరుగు పరిచాం; మీకు నచ్చిన రచనని మీ మిత్రులతో ఫేస్‌బుక్, గూగుల్+, ఈ-మెయిల్ ద్వారా వెంటనే పంచుకునే వీలు; ఒక రచయిత రచన చదివే పాఠకులకి ఆ రచయిత ఇతర రచనలు కనిపించే అమరిక; ముఖపత్రంలో పాత సంచికల నుండి కథలు, కవితలు, వ్యాసాలు ఎప్పటికప్పుడు యాదృచ్ఛికంగా కనపడే ఏర్పాటు; ఇలా ఎన్నో. త్వరలోనే మొబైల్ పరికరాలలో కూడా ఈమాటను చదువుకునే వీలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా ఊహలకి రూపాన్నిచ్చి, నవ్వుతూ మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించినందుకూ, ఇకనుంచి ఈమాట సాంకేతిక నిర్వహణా భారంలో పాలు పంచుకుంటున్నందుకూ అశ్విన్ బూదరాజుకి మా హార్దిక కృతజ్ఞతలు.


ఈమాట గ్రంథాలయంలో కొత్తగా మహాభారత యుద్ధ కథ తేలికపాటి వచనంలో; సామాన్యుల కథలు – కోళ్ళ మంగారం మరికొందరు. అపురూప శబ్ద తరంగాలు: తెలుగువారికి చిరపరిచితమైన రక్తకన్నీరు నాటకం; రెండు ఉగాది కవిసమ్మేళనాలు.

ఈ సంచికలో…

  • కవితలు: అదే నేను – మండువ రాధ; పల్లెటూరు to పట్నం: The Seven Seater – పాలపర్తి ఇంద్రాణి.
  • కథలు: ఇంటి మొగుడు – బులుసు సుబ్రహ్మణ్యం; రాతి పడవ – వేలూరి వేంకటేశ్వర రావు; ట్రిల్ – లైలా యెర్నేని, సమ్మోహనామృతం – మండువ రాధ; దానవోద్రేక స్తంభకుడు – ఆర్. శర్మ దంతుర్తి; ఏటి గట్టున ఇల్లు – ఆర్. దమయంతి.
  • వ్యాసాలు: స్వప్నలోకచిత్రకారుడు మచాడో – వాడ్రేవు చినవీరభద్రుడు; దశావతార స్తుతి – జెజ్జాల కృష్ణ మోహన రావు; శ్రీ సూర్యనారాయణా… – లక్ష్మన్న విష్ణుభొట్ల; బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ – పన్నాల సుబ్రహ్మణ్య భట్టు; పలుకుబడి: ఋతువులు, కాలాలు – సురేశ్ కొలిచాల; కొన్ని త్రిపుర సందర్భాల్లో – బండ్లమూడి స్వాతికుమారి; తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? – వెల్చేరు నారాయణ రావు.
  • నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల – భైరవభట్ల కామేశ్వరరావు
  • శబ్ద తరంగాలు: ఉగాది కవి సమ్మేళనాలు, నాగభూషణం సమర్పణ రక్తకన్నీరు నాటకం – పరుచూరి శ్రీనివాస్.
  • గ్రంథాలయం: తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – కె.వి.ఎస్. రామారావు; కోళ్ళ మంగారం మరి కొందరు – కందుకూరి రమేష్ బాబు