మంత్ర భాషణం

సగం నిద్రలో పలవరించే
మసకదారుల వెంట నడుస్తూ నేను

సూటిదనం మొహం చాటేసి
ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
జల్లెడ లోంచి జారిపోయే నీళ్ళు
అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్
అంతా చదివాక ఏమీ వుండదు
అయినా
మనసుగదిలో వేలాడుతూ
ఏదో వింత పరిమళం

పర్లేదు
ఇదో తీరు మంత్రభాషణం
అతుక్కుపోకున్నా
అనుసరించొచ్చు అప్పుడప్పుడు