ఏది గోచరం
ఏది అగోచరం
నేను గోచరం
నా జీవిక అగోచరం
నా నీడ గోచరం
నా నీడలో లోయలు అగోచరం
కాగితాల మీద కలలపంట గోచరం
నేల రాలిన కల్లలు అగోచరం
పెదాల మీది తైలవర్ణ చిత్రాలు గోచరం
ఎదలోని చీకటిగుహలు అగోచరం
కనిపించే చెట్లూ పూలూ పళ్ళూ
అన్నీ గోచరమే
తలదాచుకునే ఒక్క నీడ తప్ప
వేసవిలో వెన్నెల వాన
శీతంలో నిప్పులవర్షం
అన్నీ గోచరమే
ఏ ఎండకి ఆ గొడుగు పట్టే దేశంలో
సామాన్యుడికి
ప్రతి కాలమూ టోపీల కాలమే
టోపీలు పెట్టడం నేరం కాదు కదా
ఎక్కడెవరూ దోషులు లేనట్టే
చచ్చే జనం తప్ప.