నవంబర్ 2016

🔸 అమెరికన్ ఫోక్ సంగీత ప్రపంచపు దిగ్గజం, వాగ్గేయకారుడు అయిన బాబ్ డిలన్ స్వతహాగా వివాదాస్పదుడు కూడా. ఆ పాటకుడిని ఈ ఏడాది సాహిత్య విభాగపు నోబెల్ బహుమతికి ఎంచుకోవడం కూడా అలాగే వివాదాలకు దారి తీసింది. బాబ్ డిలన్ కేవలం గాయకుడేనా? కవి అవునా, కాదా? అనే ప్రశ్న మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చింది. డిలన్ ఎందుకు కేవలం పాటకాడు కాదో తన అభిప్రాయం చెప్తున్నారు ఈ వ్యాసంలో వేలూరి వేంకటేశ్వరరావు.

🔸 అత్యంత లఘుకావ్యమైనా అమరుకాది శృంగార కావ్యాలతో సమంగా ప్రసిద్ధమైన పుష్పబాణవిలాస కావ్యాన్ని టీకా తాత్పర్యాది సహితంగా తెలుగు చేసి అందిస్తున్నారు తిరుమల కృష్ణదేశికాచార్యులు.

🔸 ఈ సంచిక నుండి సాధారణ కథావ్యాసాది లక్షణాలతో పొసగనివిగా అనిపించే రచనలకు చోటు కల్పిస్తూ స్వగతం అనే ఒక కొత్త కేటగిరీ మొదలు పెడుతున్నాం పూడూరి రాజిరెడ్డి రచనతో. ఈ కొత్త విభాగం ఈమాట రచయితలకు తమ ఆలోచనలు, ఊహలు, అభిప్రాయాలు, మ్యూజింగ్స్ వంటివి ప్రచురించుకునేందుకు ఒక కొత్త వెసులుబాటు నిస్తుంది. రచయితలు వినియోగపరచుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

🔸 మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు. వీలైనంత త్వరలో ఈమాటలో కొంత కొత్త ఒరవడి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. మీ ఆదరణ, ప్రోత్సాహం ఈమాటకు ఎల్లప్పుడూ ఉంటాయనీ ఉండాలనీ కోరుకుంటున్నాం.


ఈ సంచికలో:

  • కథలు: తన మాట కోసం – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్; తెగులుకు శిక్ష – ఆర్ శర్మ దంతుర్తి.
  • కవితలు: ఆకు – అవినేని భాస్కర్; ఆండ్రాయిడ్ మనిషి – విజయ్ కోగంటి; రెండు కవితలు – పాలపర్తి ఇంద్రాణి; ఫ్రాగ్మెంట్స్ – బొల్లోజు బాబా; ఇంక పోతారనగాను – కనకప్రసాద్.
  • స్వగతం: నా టేస్టులేనితనం – పూడూరి రాజిరెడ్డి.
  • వ్యాసాలు: Yippie! I’m a poet and I know it – వేలూరి వేంకటేశ్వర రావు; వెణ్బా (ధవళగీతి) – జెజ్జాల కృష్ణ మోహన రావు; శ్రీనాథుని ఆంధ్రీకరణసూత్రం: అర్థపరిశీలన – ఏల్చూరి మురళీధరరావు.
  • పద్యసాహిత్యం: సమూలాంధ్రపుష్పబాణవిలాసము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; నాకు నచ్చిన పద్యం: – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: దీపాల పిచ్చయ శాస్త్రిగారి ప్రసంగం – శ్రీనివాస్ పరుచూరి; హృదయకమలములను – కనకప్రసాద్, వసుంధర అయ్యంగార్.