భావుకుల రచయిత కొ.కు.

[శ్రీశ్రీ “క్రూరుడైన విమర్శకుడు” అని వర్ణించిన రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి) విమర్శనా దృక్పథం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు – వారి సారస్వత వివేచన అనే విమర్శా వ్యాసాల సంపుటి ఒక మేలి ఉదాహరణ. రచయితగా కుటుంబరావుని విశ్లేషిస్తూ రా.రా 1983లో రాసిన ఈ వ్యాసం సాహిత్యాభిమానులందరూ చదవదగ్గది – రచయితగా కుటుంబరావుని ఒక కొత్తకోణం నుంచి అర్థం చేసుకోడానికి మాత్రమే కాకుండా, సాహిత్య విశ్లేషణా పద్ధతి గురించి కూడా ఎంతో నేర్చుకోడానికి కూడా. ఈ వ్యాసాన్ని ప్రత్యేక అనుమతితో ఈమాట పాఠకులకోసం తిరిగి ప్రచురిస్తున్నాం – సం.]