“మనలో మనం” సదస్సుకు ఆహ్వానం

ప్రాంతాలవారీగా , అస్థిత్వాల వారీగా స్త్రీల సాహిత్య చరిత్రను సమగ్రం చేసుకోవడం లో భాగంగా “మనలో మనం” రచయిత్రుల ఉమ్మడివేదిక ఇప్పటివరకు తెలంగాణా, రాయలసీమల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సులను ఏర్పాటు చేసింది. కొత్త తరం రచయిత్రులను గుర్తించి , ప్రోత్సహించింది. అంతే కాక విద్యార్ధినుల్లో రచనాసక్తి పెంపొందించేలా కృషి జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు “మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది. కోస్తాంధ్ర, వెనుకబడిన తరగతుల, క్రైస్తవ, మైనారిటీ స్త్రీలకు సంబంధించిన సాహిత్యంపై చర్చ, పత్రసమర్పణలు జరుగుతాయి.

సమావేశ స్థలం:

ప్రొ.వి .బాలమోహనదాస్ సెమినార్ హాల్ ,
డైక్మన్ ఆడిటోరియం ,
నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జున నగర్

రచయిత్రులారా ! విస్మరించబడిన మన సాహిత్యచరిత్రను మనమే నిర్మించుకుందాం రండి. మీ రాక ఈ సదస్సుకి బలాన్ని చేకూరుస్తుంది. మరిన్ని ఇతర వివరాలకు…

ఆచార్య తేళ్ళ సత్యవతి 9848531931

డాక్టర్ సమత రోష్ని 9491053654

పుట్ల హేమలత 9441241316

పి. రాజ్యలక్షి 9440286746

హేమలత 9912195330

“మనలో మనం”
రచయిత్రుల ఉమ్మడి ఐక్య వేదిక