వస్తున్న వసంత ఋతు శుభాకాంక్షలతో ఈమాట మే 2009 సంచికకు స్వాగతం.
కొత్తగా:
- ప్రత్యేకంగా ఈమాటలోనే ఒక సాహిత్య చర్చావేదికను ఏర్పాటు చేశాం.
- ఈమాట రచనలపై అభిప్రాయాలు రాసేవారికై ఒక నియమావళిని ప్రవేశపెడుతున్నాం.
ఈ సంచికలో మీకోసం:
- అభిప్రాయ నియమావళి అవసరాన్ని వివరిస్తూ పాఠకుల కోసం ఈమాట సంపాదకుల వ్యాసం. చర్చకు ఆహ్వానం.
- ఒక తెలుగు పుస్తకం కావాలి – వేలూరి వెంకటేశ్వర రావు సంపాదకీయం.
- “పునరపి”, “గాలిపటం” గిరిధరరావు, బ్రహ్మానందంల కథలు.
- వినీల్, ఇంద్రాణి, కనకప్రసాద్, కామేశ్వరరావుల కవితలు.
- “ఊడుగపూత పరిమళం” రచయిత పతంజలిపై గొరుసు జగదీశ్వర రెడ్డి జ్ఞాపిక.
- “మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా” పై జెజ్జాల మోహనరావు, పరుచూరి శ్రీనివాస్ పాటలతో కూర్చిన వ్యాసం.
- ఈమాట పూర్వాపరాలపై తన జ్ఞాపకాల మాలిక సురేశ్ కొలిచాల వ్యాసం.
- కంప్యూటర్ పూర్వాపరాలపై హనుమంతరావు, మనకు తెలియని త్యాగరాజు గురించి బ్రహ్మానందం, నాకు నచ్చిన పద్యం పై బృందావనరావుల శీర్షికా వ్యాసాలు
- పొరపాటున బహిర్గతమైన – ఈమాట ముఖ్య సంపాదకుడు, ప్రచురణకు వచ్చే రచనలపై తన సంపాదక బృందానికి రాసిన – ప్రైవేటు ఉత్తరం
ఎప్పటిలాగే ఈ సంచికపై మీ అభిప్రాయాలను, విశదంగా, విశ్లేషణాత్మకంగా మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం.