2015లో దాసరి అమరేంద్ర ఆక్టివా స్కూటరు మీద దక్షిణభారతదేశమంతా తిరిగారు. ఆ అనుభవాలు ‘కొన్నికలలు ఒక స్వప్నం’ అన్న పేరుమీద పుస్తకంగా ఈ నెల వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ఒక అధ్యాయం ఈమాట పాఠకుల కోసం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దక్షిణ భారతంలో గణపతి చాలావరకు బ్రహ్మచారిగా కనిపిస్తే, ఉత్తర భారతంలో ఒక భార్యతో గానీ ఇద్దరు భార్యలతో కానీ కనిపించడం కద్దు. ఒక భార్యతో కనిపించే విగ్రహాలలో కనిపించే సతిని లక్ష్మీదేవిగా, శక్తిగా పరిగణించడం ఉత్తర భారతదేశంలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.

ఆ రోజుల్లో, కళ కళ కోసమే అని వాదించే అబ్సర్డిస్టులు, నాటకాన్ని సాంఘిక, రాజకీయ మార్పుకి వేదిక కావాలని వాదించే బ్రెఖ్టియన్ల మధ్య వాదోపవాదాలు వాడిగా వేడిగా నడిచేవి. కెనెత్ టైనన్ అబ్సర్వర్ పత్రిక నడిపేవాడు. అతను ఉద్యమకారుల పక్షాన, ఐనెస్కో కళాకారుల పక్షాన ఉండేవారు. ఐనెస్కో కళాకారుల కవిత్వకాల్పనికతను సమర్థించేవాడు. మొదటినుంచి ఐనెస్కోనే నా హీరో.

సంస్కృత కావ్యసాహిత్యం అనగానే మనకు ముందుగా కాళిదాసు (క్రీ. శ. 4వ శతాబ్ది) గుర్తుకు వస్తాడు. శివ పార్వతుల పుత్రుడైన కుమారస్వామి జననాన్ని వర్ణించే కాళిదాసు రచన కుమారసంభవమ్ కావ్యంలో కథ అంతా శివ పార్వతుల గురించే అయినా ఎక్కడా గణేశుని గురించి దీనిలో ప్రస్తావన కనిపించదు. ఏకాదశ సర్గలో చేసిన వర్ణన ద్వారా కుమారస్వామి జననం ద్వారానే పార్వతి మొదటిసారి తల్లి అయ్యిందని కవి మనకు విస్పష్టంగా తెలియజేస్తాడు.

అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత.

తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ మున్నగు భాషలలో గణములను జ్ఞాపకములో ఉంచుకొనడానికి య-మా-తా-రా-జ-భా-న-స-ల-గం అనే ఒక సులభసూత్రము వ్యాప్తిలో నున్నది. ఛందస్సు నేర్చుకొనే విద్యార్థికి ఇది తెలిసిన విషయమే. గణము యొక్క పేరు ముందే ఉండడము వలన అందులోని గురు లఘువులను తెలిసికొనుట సులభము అవుతుంది.

ఈ పరిస్థితులున్న సమాజంలో భావ వ్యక్తీకరణ, వాక్‌-స్వాతంత్రము ఇవన్నీ నాగరిక ప్రపంచంలో మాటలుగానే వాడబడుతున్నాయి. కులవ్యవస్థ పాతుకుపోయున్న సమాజంలో ఈ కొత్త నిర్వచనాలేవీ చొచ్చుకుపోయి ప్రభావితం చేసేంతగా బలపడలేవు. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది చదువు లేకపోవడం. రెండవది, మనకు లభించే చదువుల నాణ్యత.

జ్ఞాపకాలు కవితల్లాగో తీయని కలల్లాగో దుఃఖాంతపు నిర్వేదంలాగో మరెలాగో వుండటం ఒక ‘సంగతి’. కానీ జ్ఞాపకాలు పరిశోధకులకు పనికివచ్చే పాఠాలుగా వుండటం మాత్రం కవిత్వ ప్రయోజనాన్ని మించిన ఆవశ్యకం. మోహన్ గీసిన రేఖలూ క్రోక్విల్ గీతలూ సౌందర్య సమీక్షకు సిసలైన సుబోధకాలు.

అలాగే అంతకు ముందు సాహిత్యంలో విఘ్నకారకులుగా, దుష్టులైన భూతగణాలతోపాటు వర్ణించబడ్డ వినాయకులు చివరకు ఒకే వినాయకుడి రూపు దాల్చడం, ఆ వినాయకుడు గజముఖుడైన గణేశునితో విలీనం చెందడం, గణేశుడు పార్వతి పుత్రుడిగా, స్కందుని సోదరుడిగా శివపార్వతుల కుటుంబంలో చేరిపోవడం– ఈ కథనాలన్నీ పురాణాల్లోనే కనిపిస్తాయి.

‘సార్, మీరు కూడా ఏమన్న చెప్పదలిస్తే చెప్పండి సార్!’- సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు, మ్యూసిక్ సిట్టింగ్ గదిలోకి కాఫీలు అందించ పోయిన బోయ్‌తో- అప్పటికి గదిలో కూర్చున్న నిర్మాత తాలూకూ బంధు గణం తమ వాడు నిర్మించబోయే సినిమా సంగీతం ఎలా ఉండాలన్న విషయంలో ఆయనకు తమకు తోచిన సలహా ఇతోధికంగా అందచేస్తున్న నేపథ్యంలో.

మారిషస్ వంటి బహుభాషీయ దేశంలో భాషా సంపర్కంవల్ల ఇక్కడి తెలుగు భాషలో అనేక మార్పులు వస్తున్నాయి. భాషలో మార్పులు రావటం సహజం. కాని, వివిధ భాషల సంపర్కంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో, లేఖనంలో ఎన్నో దోషాలు వస్తున్నాయి. సాధారణంగా ఒకభాషలో శిక్షణ పొందేవాళ్ళకు ఆ భాషాప్రయోగం ఎటువంటి సమయ సందర్భాలలో చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఆ భాషా ప్రయోగం ఏ విధంగా చేయాలో స్పష్టంగా తెలియదు.

ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా? గత ఏడెనిమిదేళ్ళుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్ళని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్ళను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహ అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.

కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది.

“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”

“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.

ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.

మాజిక్ రియలిజంను – మాంత్రిక వాస్తవికత – నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యంకాదు. వేర్వేరు రచయితల మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. చంద్రశేఖరరావు కూడా తనదైన చిత్రమైన మాంత్రిక వాస్తవికతను క్రమంగా సృజించుకోగలిగారు. ఆ తర్వాత ఆయన రాసిన కథలన్నింటిలోనూ అదే మౌర్నింగ్ వాతావరణం, గుడ్డసంచి భుజానికి తగిలించుకుని తిరిగే మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహిని, పార్వతిలాంటి అవే పాత్రలూ, అదే విషాదభరిత కథనమూ…

“హైదరాబాదు జర్నలిస్టు కాలనీలో (ఇప్పుడది అపోలో హాస్పిటల్ దగ్గర వుంది.) చిన్న ఇల్లు కట్టుకున్నాను. దానికి సీతమ్మ గడప అని పేరుపెట్టుకున్నాను. బావుందా?” అని అడిగారు. “చాలా బావుంది. మొత్తానికి విశాఖ వాసన వుంది. గడపలు, వలసలు అక్కడివే కదా…” అన్నాను. ఆనందించారు. కాని పాపం ఆ ఇల్లు నిలుపుకోలేకపోయారు.

చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; రేఖలు ‘కళ’ కిందికి రావనీ గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు.