రాముడు పరిపూర్ణ మానవుడనో, అవతార పురుషుడనో భావించేవారికి శూర్పణఖ వృత్తాంతం వంటి సమాధానపడవలసిన అంశాలతో సమస్యలెదురౌతున్నాయి; అటు సంప్రదాయ వ్యాఖ్యాతలకూ ఇటు భారతీయ విధ్యార్థులకూ కూడా. ఇటువంటి వృత్తాంతాలు కావ్యం యొక్క చారిత్రక ప్రామాణికతను రుజువు చేస్తాయని కొందరు వాదిస్తారు. ఇవి నిజం కాకపొతే వాల్మీకి ఎందుకు నాయకుడికి అపకీర్తి తెచ్చిపెట్టే ఇటువంటి సన్నివేశాలను సృష్టిస్తాడు?

ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళకంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారనటానికి నిదర్శనం.

సీసము అనే పదము శీర్షకమునుండి జనించినది. శీర్షకమును శీర్షము అని కూడ అంటారు. ఈ శీర్షక, శీర్ష పదములు సీసకము, సీసములుగా మారినవి తెలుగులో. సీసపద్యమునందలి సీసమునకు లోహవిశేషమైన సీసమునకు ఏ సంబంధము లేదు. శీర్షకము అనే ఛందస్సును మనము నాట్యశాస్త్రములో చదువవచ్చును. దీని ప్రకారము ఎనిమిది వృత్తములలో ఏదైన ఒకదానిని, లేక ఒకటికంటే ఎక్కువ వృత్తములను వ్రాసి చివర ఒక గీతిని రచించినప్పుడు అది శీర్షకము అనబడును.

ఈ కథలో చిక్కుముడికి అసలు కారణం గమనించారా? ఒక తండ్రికి మరొక సంబంధం ద్వారా కొడుకే తిరిగి తండ్రి కావడం! ఒక దిశలో తిన్నగా సాగిపోయే సాధారణ బంధుత్వాల పరంపర, వేరొక బంధుత్వం ద్వారా మెలితిరిగి, తిరిగి మొదలికి వచ్చిందన్నమాట. దాని వలన సాధారణ సంబంధాలలో కనిపించని ఒకానొక వైరుధ్యం ఇక్కడ ఏర్పడింది.

సాలవృక్షాల క్రింద మా దారులు వేరైన చోట దారి నుండి పక్కకి తొలిగి నవోదయ స్కూలుకు వెళ్ళే బాటలో నుంచున్నాను. నడిచి వచ్చిన వైపు మళ్ళా వెనక్కి తిరిగి చూశాను. అడవి కనబడలేదు. చుడిపహాడ్ మాత్రం మసకగా కనిపిస్తూ ఉన్నది. రేపు రాలేను. కాళ్ళు పుండ్లుపడి ఉంటాయి. ఎల్లుండి గురువారం. సంత రోజు. శుక్రవారం వచ్చి ఇదే సాలవృక్షాల క్రింద వేచి ఉంటాను. అడవి నాకింకా కావాలి.

పుస్తకమంతా బాగున్నప్పటికీ, నాకు అందులో ఒక వాక్యం ప్రత్యేకంగా నచ్చింది. ఇన్నేళ్ళకీ ఆ వాక్యం మరచిపోలేక పోతున్నాను. ఇది ఏదో కవిత్వం పూనిన వాక్యం కాదు. ఇది ఏదో రహస్యం మన చెవిలో గుసగుసలాడే వాక్యం అంతకంటే కాదు. ఇది గుండెను మెలితిప్పి కళ్ళ నీళ్ళు కార్పించే వాక్యమూ కాదు. ఏదో అందమైన, మధురమైన పదబంధాలతో నిండి ఉన్న వాక్యం కాదు.

శబ్దానికీ నిశ్శబ్దానికీ, ఊహకూ వాస్తవానికీ, చలనానికీ అచేతనకూ, ఉనికికీ ఉనికి లేమికీ, బయట ప్రపంచానికీ అంతర్లోకాలకూ, ప్రయాణానికీ జీవితానికీ మధ్య హద్దులు చెరిపేసి ఆలోచనకూ, భావానికీ, అనుభూతికీ, అక్షరానికీ, పదానికీ, వాక్యానికీ, రచనకూ మధ్య ఉండే హద్దులు అధిగమించి, నిన్నటికీ రేపటికీ మధ్య నిర్మించిన అక్షరవారధి ఈ పుస్తకం.

మెల్లగా పేరేగి కిందనుండి పాక్కుంటూ ఒకతను బయట పడినాడు. ఒంటిమీది గాయాలను కూడా పట్టించుకోకుండా, ఒక్క గెంతున ఆమె దగ్గరకు పోయినాడు. “ముయ్ లంజా, ముయ్ నోరు!” అంటూ ఆమె చెంపలమీద రెండు పీకినాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. నూర్రూపాయల రేకును తీసి పెద్దాయన చేతిలో పెడుతూ “ఆమెను కొట్టింది ఎందుకు?” అని అడిగినాను. “తెలుగులో అరిసింది సారు, లంజముండ! దానికే వాడు ఏబైతో సరిపెట్టేసినాడు.” గుండె కలుక్కుమనింది.

ఈ పుస్తకము ఎందుకు ముఖ్యమైనదో అనే విషయమును పరిశీలిద్దామా? సంస్కృతములో మనకు దొఱికిన కావ్యములలో ఇది పురాతనమైనది. అంటే అంతకు ముందు కావ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండవచ్చును. అవి ఏలాగుంటాయి అన్నది ఊహాగానమే. ఇది మొట్ట మొదటి కావ్యము.

ప్రస్తుతం మనం ఘనంగా వీథుల్లో జరుపుకుంటున్న గణేశ చవితి ఉత్సవాలకు మాత్రం మూలం మరాఠ రాజ్యంలోని పీష్వాలు ప్రారంభించిన గణేశ ఉత్సవాలే. నానాసాహెబ్ పీష్వా రాజ్యకాలంలో గాణపత్యవ్రతం ప్రారంభమైనట్టుగా మనకు మరాఠా రాజ్యానికి సంబంధించిన దస్తావేజుల ద్వారా తెలుస్తుంది.

హఠాత్తుగా అడవి అదృశ్యమై సాగర దృశ్యానికి తెరతీసింది. అదో విభిన్న సముద్రం. కంటిచూపుకు ఆనేంత దూరంలో చిన్నాపెద్ద ద్వీపాలు. మ్యాపును సంప్రదించగా అవే లిటిల్ డైమండ్, గ్రేట్ డైమండ్ ద్వీపాలని చెప్పింది. ఏమని వర్ణించనూ ఆ సాగర దృశ్యాన్నీ! మాటలను కోప్పడి మనసే సర్వస్వంగా ఆ సుందర దృశ్య భావనను మనసులో ఆకళించుకోవలసిన క్షణాలివి.

ప్రతి అక్షరాన్ని సార్థకంగా ఉపయోగించి విశ్వనాథ రచించిన ఆ నవలలో, నాయికకు ఆ పేరునే ఎందుకు ఎంచుకున్నారు? దేవీనామమే కావాలంటే, అవి అనంతంగా ఉండగా ఏకవీర అనే పేరునే ఎంచుకోవటానికి కారణం ఏమిటి? ఏదో సార్థకమైన ఉద్దేశం ఉండే ఉండాలి. ఆ కోణంలో పరిశోధన ప్రారంభించేసరికి నిజంగానే గొప్ప అవగాహన, సాంకేతికతలను రంగరించి రచయిత ఆ పేరును ఉపయోగించారని స్పష్టమైంది.

సంస్కృతములో శ్లోక ఛందస్సు మూలము, కాలక్రమేణ జరిగిన మార్పులు, అందులోని విభిన్న రీతులు మున్నగువానిని సోదాహరణముగా వివరించినాను. శ్లోకపు నడకతో క్రొత్త విధములైన అర్ధసమ వృత్తముల సృజననుగుఱించి కూడ తెలియబఱచినాను. అంతే కాక 16 అక్షరముల అష్టి ఛందములోని ప్రతి పాదములో రెండు శ్లోక పాదములను ఏ విధముగా ఉంచి వ్రాయవచ్చునో అనే సంగతిని కూడ మీముందు పెట్టినాను.

ఈ శ్యామలా దండకమును మహాకవి కవికులతిలకుడు కాలిదాసు వ్రాసినాడని ప్రతీతి. ఈ చాటుకథ జగద్విదితమే. మూర్ఖుడైన కాలిదాసు సౌందర్యవతి, విద్యావతియైన రాజుగారి కుమార్తెను వివాహమాడి ఆమెచే కనుగొనబడి కాళికాదేవివద్ద పంపబడి ఆ దేవిని ధ్యానించి ఆ దేవిచే నాలుకపైన బీజాక్షరములను వ్రాయించుకొని ఆ దేవిని ఈ దండకము ద్వారా స్తుతించినట్లు కథ. ఇక్కడ రెండు సందేహాలు ఉదయిస్తాయి.

మనకు వట్టిపుణ్యానికి తెలిసిన విషయాలు రెండు కలవు. సూర్యుడు తూర్పున ఎక్కి పడమట దిగుట. దీని గురించి మళ్ళీ ఎప్పుడయినా చెప్పుకుందాం. రెండు బాపూ గొప్పవాడు, బడా చిత్రకారుడు, ఎలా? అంటే ఆయన బొమ్మలు బాగా వేస్తారు, నవ్వించే కార్టూన్లు గీస్తారు. ఆ గీతల వెనుక పనిముట్ల మర్మం, ఈ చిన్న వ్యాసంలో వీలయినంత విప్పిచెప్పే ప్రయత్నం చేస్తా.

“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.

నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.

సాహిత్యవిమర్శతత్త్వం వస్తుతత్త్వ వివేచన. విషయాన్ని కవి తన రచనా సంవిధానంతో ఆవిష్కరించినప్పుడు అది వస్తువుగా పరిణమిస్తుంది. విషయం వస్తువుగా మారడమన్న ప్రక్రియ వల్ల అది కళాత్మక రూపంతో సాహిత్యంగా పాఠకుడిని చేరుతుంది. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో ప్రచురణకు ఎంపికైన వ్యాసం.)

గెలుపు అనే విన్నింగ్ పాయింట్ లేని పరుగులో నన్ను ఒక్క క్షణం కూడా నిలబడనీయక పరిగెత్తించేది బొమ్మ కాక మరేమిటని. బొమ్మ తప్ప మనల్ని నడిపించగలిగేది, పరిగెత్తించగలిగేది మరేదైనా ఉందా? బొమ్మని మించిన అత్యాశని మించిన సంపద ఏదైనా కనుగొనగలిగేనా?

మూడేళ్ళ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తర్వాత కూడా నేనేమీ నేర్చుకోలేదనీ, ఎప్పటిలాగే అహంకారం నిండిన వదరుబోతుగా కొనసాగుతున్నాననీ అర్థమయింది. నన్ను నేను మాయబుచ్చుకుంటున్నాననీ తెలిసివచ్చింది. అటు ఓమ్‌ పురిని చూస్తే తన వినమ్రతా స్వభావంతో అంకితభావంతో ఎంతో ఎంతో నేర్చుకుంటున్నాడన్నదీ స్పష్టం.