హాస్యమనేది ప్రధానంగా బాధని వ్యక్తీకరించే వక్రీకరించే ఒక కటకం. దూరంగా ఎక్కడో దేని మీదో ప్రతిబింబించే హాస్యాన్ని వెనక్కి వెత్తుకుంటూ వెడితే దాని మూలం బాధ అని తేలుతుంది. ఈ బాధకి కారణలు కోకొల్లలు – శారీరిక/మానసిక లోపాలు, రుగ్మతలు, వైకల్యాలు, భయాలు, కోపాలు- ఇవన్నీ హాస్యానికి ముడిసరుకులే.
Category Archive: వ్యాసాలు
శ్రీరామ భూపాలు డా – సీతతో
జేరి చనెఁ గాననములో
వారితోఁ దా వెళ్ళెఁగా – వదలకను
వారిజాక్షుని నీడగా
ఘోర కాంతారములలోఁ – గూర్మితో
దూరముల గడచె నతఁడున్
చారుహాటకరూపుఁ డా – సౌమిత్రి
వీరవిక్రముఁడు గాదా…
అమూర్తత సినారె కవిత్వంలో ప్రధాన లక్షణం. నిర్దిష్ట సంఘటనలకి, ఉద్యమాలకి ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు అరుదు. నిర్దిష్టతను గుర్తించి స్పందించాల్సిన సందర్భాల్లోనూ ఆయన అమూర్త వ్యక్తీకరణనే ఆశ్రయించాడు. భావ సంయమనం పాటించాడు. ఆయనది పెద్దమనిషి తరహా కవిత్వం. ఆయన కవుల్లో లౌక్యుడు. లౌక్యుల్లో కవి.
“యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” నిస్సందేహంగా!! పాతికేళ్ళ క్రితం ఓ ఢిల్లీ పెద్దాయన వందేవంద రూపాయల్లో తాను హిమాలయాల్లో రెండురోజులపాటు చేసిన ముప్పై కిలోమీటర్ల ట్రెక్ గురించి రాశాడు. అది మనసులో నిలిచిపోయింది. ‘నేనూ అలా చెయ్యాలి!’ అన్న ఆకాంక్షగా పరిణమించింది.
హాస్యం అశ్లీలం, సంసార పక్షం అని ఉండదు, పండితే పొట్ట చెక్కలు చేస్తుంది, చెడితే, అసందర్భంగా, అసంబద్ధంగానే ఉంటుంది. సభ్య సమాజం బాహాటంగా చర్చించుకునే విషయాలు కాని వాటికి కూడా తగిన సందర్భం సృష్టించి వాటి నుండి నవ్వులను వెలికి తీయగలిగితే, హాస్యానికి అశ్లీల దోషం ఎంత మాత్రమూ అంటదు.
మరి మన మహనీయ చిత్ర శిల్ప కళాఖండాలు రెండవ ఎక్కం అప్పగించినంత సులువుగా ప్రజల కళ్ళకి కట్టడం అసాధ్యమా? కానేకాదు. సాంస్కృతిక, కళా రంగాల విశేషాలూ జనం కళ్ళలో, నోళ్ళలో నిత్యం ఉండాలంటే శ్రోతలు, పాఠకులు, సందర్శకులు, ప్రేక్షకులు, భక్తులూ అనే మనం కొంత దురభిమానం, చౌకబారు ఆనందం అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్’ను కొంచం త్యాగం చేసే ప్రయత్నం చేసుకోవాల్సిందే.
పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో? ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా? ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను.
మనుషులుగా మనం సంగీతం వినటం, చిత్రశిల్పాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం – ఒక సంస్కారం, సంస్కృతీ అని మనకు మనమే చెప్పుకోనిదే కళ గురించి మాట్లాడుకోవటం నిరర్థకం. ఇందుకే నోటికి వేమన, సుమతీ శతకాలు గడగడా వచ్చినట్టే కంటికి చిత్ర శిల్ప కళాఖండాలను చకచకా అప్పగించేట్టు చూడటం, చూపించటం అత్యవసర ప్రాథమిక చర్య, చికిత్స.
మిగతా భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిటని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే).
తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజనపూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్షసాక్ష్యం.
మెయిన్ స్ట్రీమ్ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి.
మార్కస్ బార్ట్‌లీ దక్షిణభారత సినీఛాయాగ్రాహకులలో ఆయన అద్వితీయుడు. పాతాళభైరవి, జగదేకవీరుని కథ, గుణసుందరి కథ, మాయాబజార్ వంటి సినీమాలలో బార్ట్‌లే చూపిన కెమేరా కౌశలం ఇప్పటికీ చలన చిత్రాభిమానులకు ఆశ్చర్యం కలగజేస్తూనే ఉంది.
కల్తీ లేని మాస్ మసాలాతో తీసిన ఫక్తు కమర్షియల్ చిత్రానికి నిలువెత్తు అద్దం హలో బ్రదర్ అనే చిత్రం. చిన్నప్పుడే విడదీయబడిన కవలలు, ఏ కారణానైనా వాళ్ళు దగ్గరయినప్పుడు ఒకళ్ళకు కలిగే అనుభూతి మరొకళ్ళకి కూడా కలుగుతుంది. చెప్పుకోవడానికి ఇంతకు మించిన కథ ఏమీ లేదు. కాని ఈ చిన్న లైన్‌ని రెండున్నర గంటలపాటు నవ్వుకోగలిగే విధంగా మలిచిన రచయితకీ దర్శకుడికీ పాదాభివందనం చేయాల్సిందే.
భర్త క్షేమం కోసం భారతీయ గృహిణులు చేసే ఉపవాసాలు, వ్రతాలతో ఇక్కడ పోలిక సరే; ఆశ్చర్యం గొలిపే ఒక తేడా కూడా ఉంది. ఉపవాసాలు, వ్రతాల వెనుక వ్యక్తమయ్యే ఒక యాంత్రిక విశ్వాసానికి భిన్నంగా తనిక్కడ ఒక అన్నార్తుడికి అన్నం పెడితే, దయగల ఏ తల్లో తన భర్తకూ ఇలాగే అన్నం పెడుతుందన్న ఒక సరళమైన తర్కము, లౌకికంగా మన బుద్ధికి అందే ఒక హేతుబద్ధత మెలనీ మాటల్లో ఉన్నాయి.
సంస్కృతంలో గద్యప్రబంధనిర్మాణానికి ప్రాతిపదికమైన కృషిచేసిన మహాత్ములలో సుబంధుడొక స్వప్రకాశచైతన్యోపలక్షణుడు. కాళిదాసానంతరయుగీనులలో ఆయన వాక్పరిస్పందనైపుణ్యానికి వశంవదులు కాని మహాకవులు లేరంటే అతిశయోక్తి కాదు. క్రీస్తుశకం 150 నాటి రుద్రదాముడు తన గిర్నార్ శాసనంలో ఉదాత్తమైన కవిత్వరచనకు లక్షణాదర్శప్రాయంగా నిర్వర్ణించిన గద్య శైలికి సాహిత్యశాస్త్రంలో మనఃస్ఫూర్తిగా పేర్కొనదగినవాడు ఆయనే.
క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడు భాషగా ఉండేది. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకొనిరి. బ్రాహ్మీలిపి పోలిన మఱియొక లిపి యుండెనని కూడా బూలర్ అభిప్రాయపడెను. వ్రాత భాషగా రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాలు సూచిస్తున్నవి.
ఇది యుగాది సమయము. వసంతఋతువుతో ప్రారంభమవుతుంది క్రొత్త సంవత్సరము. ఈ హేవిలంబినామ సంవత్సరమును కొన్ని వసంతతిలకములతో, ఆ లయ ఉండే పద్యములతో శుభాకాంక్షలతో ఆహ్వానిద్దామా?
ఒక్క పదేళ్ళ క్రితం వరకు సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు దర్శక నిర్మతల నుండి ఒకే రకమైన జవాబు ఉండేది: కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువతకు, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మా చిత్రంలో, అని. ఈమధ్య కాలంలో ఆ మొత్తం చెబితే ఎగతాళి చేస్తారనో ఏమిటో, ఆ పైని పడికట్టు పదాలు అన్ని కలిపి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న గంప గుత్త మాటతో సరిపుచ్చేస్తున్నారు.
ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు. అంతవరకూ తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది.
ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.