సాహిత్య వాతావరణంలో స్తబ్దత అన్న పదానికి అర్థం, కొత్త రచనలు రావడం లేదని మాత్రమే కాదు, వచ్చిన రచనల్లో కొత్తదనం లేదని కూడా. దానిని చెదరగొట్టడానికి మనకున్న వాతావరణమే మారాలి. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అయితే, వచ్చే ప్రతి రచనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరో సృజనకు ప్రేరణ నిస్తుంది.
శీర్షికలు సంచికలు
రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ అంతంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది. జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్ళూ భాషలవాళ్ళూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం. నిజానికి అదో గొప్ప అవకాశం.
సోమరాజు సుశీల పాఠకులకు తమ బాల్యాన్ని పునర్దర్శించుకునే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అనుభూతిని ‘ఇల్లేరమ్మ కతలు’లో అందించారు. ఆ క్రమంలో అందులోని పాత్రలు ఉడుక్కున్నా, ‘అది నిజమే కదా. ఉడుక్కోవడం దేనికీ, నిన్ను కథలోకి ఎక్కించి అమరత్వం కల్పిస్తేనూ’ అని డబాయించారు. ముందే చెప్పినట్టు, ఆమెకు నిజం చెప్పడం ఓ సరదా.
మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్ విన్నాన్ చదివాన్ చదివాన్!
ఒక పెద్ద భూకంపం, నా ఊహల్లో కూడా లేనంతటి పెద్ద భూకంపం వచ్చి, ఈ ప్రపంచం తలకిందులైపోతే ఇప్పుడున్నవన్నీ అర్థంలేనివైపోతాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ఐఫోన్లు, సాఫ్ట్‌వేర్లు… అప్పుడు నాలుగ్గింజలు పండించుకోవడమే ప్రధానం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ దానికనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. స్కిల్స్ రీడిఫైన్ అవుతాయి. బలంగా తవ్వేవాడే అవసరం అవుతాడు. పంట పండించినవాడే మొనగాడు అవుతాడు.
ముఖమా? అరవిందమా?
అరబిందెనా?
పూర్తి బిందెనా?
ఎటో వెళ్ళిపోతోంది మనసూ…
ఎందుకిలా బ్రో?
బ్రో…చే…వారెవరురా బ్రో…
అంతా బానే ఉంది గానీ, ఇన్నాళ్ళూ చేతులు కట్టుకు కూచుని, ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం, ఓవర్టేక్ చేసి పెద్దపీట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్‌లుక్ చెయ్యడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కనీసం కొన్నాళ్ళపాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు. అదే నాలాంటి వాళ్ళకి పదివేలు.
నీ కోపం అంతా దినకరన్ మీద. దినకరన్ నిన్ను అవమానించాడు. పీరియడ్. అంతకు మించి ఆలోచించడం వేస్ట్! అవమానం అనే దావానలం ముందు సింపతీలూ, ఓదార్పులూ నీటిబొట్టులాంటివి. ఎంత వద్దనుకున్నా నీకు దినకరన్ రూపమే మనసులో మెదులుతోంది. అతన్ని తలచుకుంటేనే నీకు అసహ్యం. దినకరన్‌ని నువ్వు తిట్టుకోని క్షణం లేదు. అతను కొట్టిన దెబ్బ నువ్వు ఎప్పటికీ మరచిపోలేవు, చిన్నప్పుడు మీ మాస్టారు చేసిన అవమానంలా. కాని వద్దనుకున్నా పదే పదే గుర్తొస్తున్నాడు.
రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతోన్న రోజులవి. పర్ల్ హార్బర్ మీద దాడి ద్వారా జపాన్ విజయవంతంగా ఆ యుద్ధంలో అడుగుపెట్టిన సందర్భమది. ఆగ్నేయాసియా దేశాలన్నీ జపానువారి అధీనంలో ఉన్న సమయమది. అండమాన్ నికోబార్ ద్వీపాలు కూడా ఆక్రమించబడిన సమయమది. భారతదేశం మొత్తాన్ని జయించాలన్న సంకల్పంతో జపాను ఉరకలు వేస్తోన్న వేళ అది.
ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం
హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం
ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది. మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.
ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత
చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన
క్రితం సంచికలోని గడినుడి-36కి మొదటి అయిదు రోజుల్లోనే పదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-36 సమాధానాలు, వివరణ.
అడ్డం బాకీ సరసర తీర్చెయ్యాలంటే అర్థంకాని భాష నేర్చుకో (6) సమాధానం: కీసరబాసర అక్షరం ఉన్నా లేకున్నా తేనె తేనే (4) సమాధానం: మరందము […]
తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఈరోజు తెలుగుభాష ఏ స్థితిలో ఉన్నది అన్న ప్రశ్నకు పతనమవుతున్నది అన్నదొకటే సమాధానం ఎవరిచ్చినా. ఏ దేశంలోనైనా, కాలంతో పాటు భాష తీరుతెన్నులు మారడం సహజం. కానీ, ఈ మార్పులను ఏ తరానికాతరం గమనించుకోవాలి. భాషను నిలబెడుతున్నవేవో, పతనానికి గురిచేస్తున్నవేవో చర్చించుకొని వాటిని నమోదు చేయడం, భావి తరాలకు భాష పట్ల మెలకువను, జాగరూకతను మప్పుతాయి. తెలుగు భాష స్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోందని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి కారణాలు వెదికి విశ్లేషించే దిశగా ఎవరూ అడుగులు వేయలేదు. అందుకే, తెలుగు వచనం కాలక్రమేణా ఎలాంటి మార్పులకు గురైంది? వాటి నేపథ్యమేమిటి? అన్న మౌలికమైన ప్రశ్నలకు కూడా, కనీసం రెండు శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే గానీ సమాధానం దొరకదు. ఈ బృహత్కార్యాన్ని వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ తలకెత్తుకొని, సమగ్రమైన తమ పరిశోధనా సారాన్ని మూడు భాగాలుగా సాగిన వ్యాసరూపంలో విశ్లేషించారు. తెలుగు భాష చరిత్రలో మొదటగా వినవచ్చే ప్రముఖులు పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల అభిప్రాయాలలో వైరుధ్యాల వల్ల తెలుగు భాషా వ్యవహారాలలో కలిగిన మార్పుల గురించి మొదటి భాగంలోనూ; స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం, తెలుగు దగ్గరకు వచ్చేసరికి ఏ రూపు తీసుకుంది? లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పిన తెలుగు ఇప్పటికీ కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అనే విషయాలు రెండవ భాగంలోనూ వివరించారు. ఇక, బళ్ళలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో గ్రాంథిక భాషావాదులు గెలిచిన తరువాతి పరిణామాలు ఏమిటి? వ్యావహారిక భాషను సమర్థించిన గిడుగు రామమూర్తి వాదం మనకు ఏ అదనపు సౌకర్యాన్నిచ్చింది? ఈ భాషోద్యమం తరువాత, తెలుగులో వచ్చిన మార్పుల్లో రేడియో, పత్రికలు, పత్రికా సంపాదకుల పాత్ర ఏమిటి? ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని విశ్లేషిస్తూ, మెరుగుపరుచుకోగలిగే మార్గాలను సూచిస్తూ రాసిన ఆఖరి భాగం ఈ సంచికలో. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో ఎంతో కృషి చేసి, ఈ వ్యాసాన్ని మనకు అందించిన రచయితలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఈ సంచిక నుండీ మానస చామర్తి ఈమాట సంపాదక బృందంలో ఒకరవుతున్నారు. వారికి మా హార్దిక స్వాగతం.
కవిత్వం, కథలు కాకుండా ఆలోచనాపరమైన విమర్శలతో, వ్యాసాలతో గట్టిగా చదువుకున్నవాళ్ళు ప్రాచీన, మధ్యకాలపు, ఆధునిక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆలోచనల్ని పురస్కరించుకుని వ్యాసాలు రాసే మేధావులు కాని, అవి ప్రచురించే పత్రికలు కానీ మనకి లేవు. తెలుగులో మేధావులకు కావలసిన ప్రోత్సాహం లేదు. అంచేత మేధావి అని చెప్పడానికి అనువైన ప్రమాణాలు లేవు. వాళ్ళని గుర్తించే సమాజమూ లేదు.
నిబంధనల ప్రకారం అర్ధగంట ముందు మాత్రమే వదిలెయ్యడానికి వీలుంది. దానికోసం తొమ్మిది మంది కాచుకుని ఉన్నారు. చివరి పది నిమిషాల వరకూ ఆరుగురు మిగిలారు. గంట మోగిన తర్వాత కూడా రాస్తూ ఉండిపోయిన వాళ్ళు ఇద్దరు. అన్నీ తీసేసుకుని, హాల్‌టికెట్ల ప్రకారం ఆర్డరులో సర్దుకుని, కవర్లో పెట్టేసుకుని, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తును జాగ్రత్తగా చేతుల్లో మోస్తున్నంత బరువుగా గదిలోంచి బయటకు.
కేవలం శారీరిక సామర్థ్యం, సాధారణమైన తెలివితేటలూ మాత్రమే కాదు, విజయాన్ని సాధించాలనే తృష్ణ, తిరుగులేని పట్టుదల ఉంటే వాటితో మన భవిష్యత్తును పడుగూ పేకలుగా మనమే అల్లుకోవచ్చు. విధి అంటే మనచేతిలో ఉన్న ఈ అల్లికే. ఈ అల్లిక ఎంత కష్టంగా ఉంటే, ఆ విజయం అంత తీయగా ఉంటుంది.