మేము రిసెప్షన్‌ను దాటుతున్నప్పుడు రిసెప్షన్‌లో ఇందాక కూర్చున్న అబ్బాయి మా వెనకే వచ్చాడు. ‘సర్, మీరు రేపు మానింగ్ కచ్చితంగా వస్తారా?’ మరీ నిలదీసినట్టు అడిగితే ఏం చెప్పాలి? బహుశా నా ముఖంలో డాక్టర్‌కు పూర్తి ఆమోదముద్ర కనబడలేదేమో. అందుకే స్పష్టత కోసం పంపివుంటాడు. నూరు శాతం వస్తామని చెప్పడానికి నోరు రావడం లేదు, అట్లా అని రాము అని చెప్పలేకున్నాను.
శీర్షికలు సంచికలు
ఆ జలతీరపు రెస్టారెంటూ, అక్కడి వాతావరణమూ, స్పీకర్లలో వినిపిస్తోన్న థాయ్ సంగీతమూ నన్ను ఆకట్టుకొన్నాయి. అప్పటికే గంటా రెండుగంటలుగా ఎండంతా నాదే! కాస్సేపు నీడపట్టున ఆగుదామనీ, ఇలాంటి సమయాల్లో నాకు బాగా ఇష్టమైన పెప్సీ తాగుదామనీ అనిపించింది. లోపలికి నడిచాను. వేళగాని వేళ దేశంగాని దేశం నుంచి అలా ఓ మనిషి నడచి రావడం వాళ్ళను ఆశ్చర్యపరిచింది…
సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్‌గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, దాదాపు మౌనంగా ఉండడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం చంద్రశేఖరరావు కంటే తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి. ఆయన రచనలపై చెప్పుకోదగ్గ వ్యాసాలేవీ ఈనాటికీ రాలేదు.
ఇద్దరు దోస్తులు కలిసి పది-ఇరవై మంది ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని ఎంచుకొని, నలభైరెండు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. రాత్రి గడిపాక ఒక దోస్తు ఆ అమ్మాయిని అడిగాడు: “నీ పేరేంటి?” అమ్మాయి తన పేరు చెప్పేసరికి వాడు అదిరిపడ్డాడు: “అదేంటి, మాకేమో నీది వేరే మతమని చెప్పారు?” అమ్మాయి బదులిచ్చింది: “అబద్ధమాడారు వాళ్ళు.”
ఇలా రోజులు సాగుతుండగా (నిజానికి ఈ వాక్యం అక్కర్లేదు, కథ చదువుతున్నట్టు పాఠకులను నమ్మించటానికే) యవ్వనంలో శాంతి వయ్యారాలొలికే అందగత్తెగా శోభిల్లింది. తరువాత ఏం జరుగుతుంది? మానభంగమే. అగ్రకులపు కుక్క ఒకడు ఆమెను పట్టపగలు మానభంగం చేశాడు. మానభంగం చెయ్యడం దారుణాల్లోకెల్లా పెద్ద దారుణం కదా? శాంతి రెడ్‌హేండెడ్‌గా పట్టుబడింది.
నాకిప్పటికీ గుర్తు. చిన్నప్పుడోసారి బాగా వర్షం పడింది. ఆ తరవాత గాలి కూడా వచ్చింది. ఆ రాత్రంతా ఆ రాయి పడిపోతుందేమో అని నిద్రలో ఉలికులికిపడి లేస్తూనే ఉన్నాను. పొద్దున్నే లేచి భయంభయంగా చూస్తే ఆ రాయి అలానే ఉన్నది. ఆ రోజు నేను తాగుతున్న చాయ్ చప్పగా అనిపించింది… ఒకసారి భూకంపం వచ్చినప్పుడు మా గుట్టలో ఇళ్ళు కొన్ని కదిలిపోయాయి గాని, ఆ రాయి మాత్రం అలానే ఉంది.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
అడ్డం అభ్యంజనము చెయ్యాలంటే వెనుకనుండి చూడుము తీగ (5) సమాధానం: తలమునుక పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపించేది? (4) సమాధానం: పట్టుచీర నాలుక మాత్రమే పసిగట్టేది […]
2016లో శ్రీకాంతశర్మ లలితగీతాలు అన్న పేరుతొ ఒక 35 గీతాల పుస్తకం, దానికి జతగా 15 పాటలున్న ఒక సి.డి. వెలువడింది. ఈ సంకలనం నుండి, తేనెల తేటల మాటలతో అన్న బహు ప్రసిద్ధి గాంచిన దేశభక్తి గీతంతో పాటుగా, మార్కెట్లో లభ్యం కాని మరికొన్ని పాటలు కూడా ఇక్కడ వినవచ్చు.
క్రితం సంచికలోని గడినుడి-34కి మొదటి మూడు రోజుల్లోనే తొమ్మిదిమందినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: జిబిటి సుందరి, బండారు పద్మ, అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, చందన శైలజ, స్వాతి శ్రీపాద, సుభద్ర వేదుల, భమిడిపాటి సూర్యలక్ష్మి, వైదేహి అక్కిపెద్ది. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-33 సమాధానాలు, వివరణ.
‘నీ జీవితం కాలిపోతుంటే మిగిలే బూడిదే కవిత్వం’ అని కెనేడియన్ కవి, గాయకుడు లెనార్డ్ కోహెన్ అంటాడు. కె. సదాశివరావు వ్రాసిన చలిమంటలు అనే కథలో రచయిత పరంజ్యోతి, తన రచనలేవీ ఎక్కడా ప్రచురించడు. అతనితో వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి తప్ప అతని ప్రజ్ఞ మిగతా లోకానికి తెలియదు. అలాంటి వారి ద్వారా పరంజ్యోతి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన తరువాతి తరం రచయిత ఒకడు, అతన్ని వెదుక్కుంటూ వెళతాడు. తన కవితలను వినాలనీ, పదిమందికీ తెలియజేయడానికి వాటిని ప్రచురించాలనీ, ఉవ్విళ్ళూరుతున్న ఇతనికి ఆ రాత్రి వెచ్చదనం కోసం ఒక చలిమంట రగిల్చి, తన కవితలు చదివి వినిపిస్తూ, చదివినవి చదివినట్టు ఆ మంటలో వేస్తాడు పరంజ్యోతి. విస్తుపోయి చూస్తోన్న ఇతనితో, అవన్నీ చిత్తు ప్రతులనీ, ప్రతి రచననూ ఎన్నోసార్లు తిప్పి వ్రాశాననీ, అవన్నీ ఉండక్కర్లేదనీ చెప్తాడు. ఒక పరిణత కవి, ఒక ఊహను కాగితం మీద పెట్టి, అది కవితగా రూపాంతరం చెందేవరకు ఎంతలా తపిస్తాడో; కవిత్వ పరిణామ దశల్లో ఉన్న ఎన్నో అంతరాలు దాటుకుని ఉత్తమ ప్రతినే వెలువరించడానికి ఎలా ప్రయత్నిస్తాడో; అది ఒక్కొక్కసారి ఒక జీవితకాలపు సాధన ఎందుకవుతుందో ఈ కథ చెప్తుంది. తాము రాసినవి ప్రపంచానికి చూపించాలన్న తాపత్రయం లేకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకోవడం వెనుక తమ సాహిత్యసాధక ప్రయోజనాలు ఏమిటో తన మరణానంతరం తన రచనలు వేటినీ మిగల్చవద్దని మిత్రుణ్ణి కోరిన కాఫ్కా, వేల కవితలు రాసినా తాను బ్రతికుండగా గుప్పెడే ప్రచురించిన ఎమిలీ డికిన్‌సన్ లాంటి రచయితలకే తెలియాలి. విరివిగా సాహిత్య సృజన చేస్తూ కూడా ధన, కీర్తి కాంక్షలకతీతంగా ఆ రచనలను జీవితాంతం తమకు తామే మోసిన వారి నిర్మోహత్వాన్నీ, అంతకు మించి, అన్నాళ్ళ వాళ్ళ పరీక్షకూ, అటు పైన ఇన్నేళ్ళ కాల పరీక్షకూ తట్టుకుని ఈనాటికీ ఆ రచనలింత ప్రాభవంతో మనముందుండటాన్నీ, గమనించి చూడటం ఎన్నో కొత్త పాఠాలను నేర్పిస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో, అట్లాంటి స్వీయ నియంత్రణ ఊహకు కూడా అందని మన సృజనకారులకు ఆ పాఠాలిప్పుడు మరీ అవసరం. ప్రచురణ అన్నది కేవలం కాగితాలకో, వెబ్ పేజీలకో, వ్యయానికో మాత్రమే సంబంధించిన విషయం కాదు. చాలా సందర్భాల్లో, అది రచయితకూ రచనకూ మధ్య సాగిన రహస్య సంభాషణను ఒక కొలిక్కి తెచ్చే దారి కూడా. తన కవితలన్నీ చిత్తు ప్రతులేనని, కవిత రాసిన నలభయ్యేళ్ళ తరువాత కూడా దాని గురించి ఆలోచిస్తూ అవసరమైన మార్పులు చేస్తానని, తన కవిత్వమసలు లిట్మస్ టెస్ట్ దాటనే లేదనీ చెప్పే అజంతాలు అరుదు, మంచి కవిత్వం లాగే. కానీ ఇప్పుడు, రచనను తీర్చిదిద్దటం అటుంచి, ప్రచురించే ముందు తాము రాసినది మరొక్కసారి చూసుకున్నారన్న నమ్మకం కూడా కలిగించని రచనలే ఎటు చూసినా. తన గొంతు తాను గొప్పగా వినిపిస్తున్నానన్న భ్రమలో, శబ్దవమనమే భావస్వేచ్ఛగా పొరబడుతూ, ఏ కొద్దిపాటి విమర్శనూ తీసుకోలేకుండా ఉన్న కూపస్థ మండూకాల బెకబెకలే ఎటు విన్నా. రచయితలుగా తాము ముందుకు రాకుండా రచనా ప్రక్రియ పట్ల గౌరవం, రచన గురించి రచనే మాట్లాడాలన్న పట్టుదల ఉన్నవాళ్ళు, ప్రస్తుతం మనకు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. అయినా, మన సాహిత్య దశను దిశను మార్చడానికి ఆ కొద్ది గొంతులే చాలు, మనం వినగలిగితే.
ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులుంటాయి.
అప్పుడే బ్యాంకాక్ నగరం మేలుకొంటోంది. ఆకాశంలో వెలుగు రేకలు. దారిలో ఏదో జలప్రవాహపు ఉనికి. చక్కని రోడ్లు… ఫ్లై ఓవర్లు… మెల్లగా పుంజుకొంటోన్న వాహనాల జోరు. నగరం గురించి సరళమైన ఇంగ్లీషులో నా చిన్న చిన్న ప్రశ్నలు. తడబడుటాంగ్లంలో అతని సమాధానాలు. కుదిరిన సామరస్యం.
ఆయుత్సవములో ముస్తఫాకడ దాసులుగా నున్న ఇటలీదేశీయులు బృందగాయకులుగా పాల్గొన్నారు. కామాంధుడైన ముస్తఫా ఆ సభ్యత్వము గైకొని, దాని నియమములను తప్పక పాటింతునని ప్రమాణము చేసినాడు. ఆ నియమములు సుష్ఠుగా నిరంతరము తినుచుండుట, సురాపానము చేయుచుండుట, చుట్టూరా ఏమి జరుగుచున్నను దానిని పట్టించుకొనక యుండుట – అనునవి.
చూడు
ఇదొక
ఊహల లోకం
ఆశల లోకం
నిరాశల నెగడు ముందు
కల్పనల్ని ఎగదోసుకుంటూ
పరచుకునే పొగమీద
పార్థివ హృదయాలను
మోసుకు తిరిగే లోకం!
ఈ భార్యాభర్తలు ఎక్కడికో వెళ్ళే తొందరలో ఉన్నారు. టైమవుతోందని ఆమె ఒకటే గొణుగుతోంది. మిషన్ దగ్గర ఉన్నతను డబ్బులు చేతిలోకి తీసుకోగానే, ఇంక ఎటూ నేను హడావుడిలో ఉన్నాననే ఒక తెలియని అధికారంతో ముందటి ముసలాయన్ని కాదని ఇతడు ముందుకు పోబోయాడు. ఆ ముసలాయన ఏమీ తొణక్కుండా, ‘హలో! నేను ఇక్కడొకణ్ని లైన్లో ఉన్నాను’ అన్నాడు. చేసేదేమీలేక అతడు చేతులు జోడించి సారీ చెబుతూ, భార్య ముఖం వైపు చూసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేశాడు.