మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తలెత్తినప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.
నాగిని కందాళ
జీవిత విశేషాలు
నాగిని కందాళ సాహితీ ప్రపంచంలో సుపరిచితులైన రచయిత్రి, పుస్తక సమీక్షకురాలు, బ్లాగర్. వివిధ పుస్తకాలపై, ముఖ్యంగా ప్రపంచ సాహిత్యం, నవలలపై లోతైన విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. ప్రపంచ సాహిత్యాన్ని విస్తృతంగా చదివి, తన పఠనానుభవాలను పంచుకుంటూ \’ధీ\’ పేరుతో పుస్తక సమీక్షల సంపుటిని తీసుకువచ్చారు.
నాగిని కందాళ రచనలు
ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి ఈ విశాల విశ్వం అంతానూ ప్రాణికోటితో, వివిధ గ్రహాలపై వివిధ జాతులకు చెందిన వైవిధ్యమైన కంఠధ్వనుల రొదలతో నిండిపోయుండాలి కదా! కానీ దీనికి విరుద్ధంగా ఎటు చూసినా కలవరపరిచేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందుకేనేమో, ఈ సృష్టివైరుధ్యాన్ని మహా నిశ్శబ్దం అని పిలుచుకుంటారు ఈ మనుషులు.