ఇది త్రిపుర 1999 ప్రారంభంలో విజయవాడలో తమ బంధువులింటికి వచ్చినప్పుడు పన్నాల సుబ్రహ్మణ్యభట్టు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించి చేసిన ఇంటర్వ్యూ. మో (వేగుంట మోహనప్రసాద్), వి. చంద్రశేఖరరావు కూడా త్రిపురగారిని ‘కదిలించారని’ జ్ఞాపకం. ఆ మరుసటిరోజు విజయవాడ పుస్తక ప్రదర్శనలో కూడా మాట్లాడారు. అప్పట్లో వి. చంద్రశేఖరరావు డెప్యుటేషన్‌పై టెలీకమ్యూనికేషన్‌లో పని చేస్తుండేవారు. ఏ మాత్రం వీలు దొరికినా ఆయన, బి. తిరుపతిరావుగారు నవోదయ షాపుకొచ్చేసేవారు. తరచుగా భమిడిపాటి జగన్నాథరావు కూడా కలుస్తుండేవారు. ఆ రోజుల్లోనే త్రిపుర కవితలు కూడా పుస్తకరూపంలో వచ్చాయి. ఇంటర్వ్యూ ప్రసారణ మాత్రం కొంచెం ఆలస్యంగా, మార్చి నెలలో, జరిగిందనుకుంటాను. 1999 మే నెలలో ఇండియా వెళ్ళినప్పుడు భట్టుగారు ఈ ఇంటర్వ్యూ ఉన్న టేపు ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. – పరుచూరి శ్రీనివాస్.
[ఈ ఆడియో కాపీ ఈమాటకు అందించిన మూలా సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు – సం.]