1998 జనవరి నెల్లో ఒక ఆదివారం మధ్యాహ్నం పది పదిహేను మంది తెలుగు సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులు ఏనార్బర్ పబ్లిక్ లైబ్రరీలో కలుసుకుని తమకి నచ్చిన కవితల్ని, పద్యాల్ని చదివి మిగతావారితో పంచుకున్నాం. ఆ కార్యక్రమం ఒక సంస్థ ఆవిర్భావానికి పునాది అని అప్పుడు మేమూహించలేదు.
ఈ పదేళ్ళలోనూ ఒక చర్చా వేదికగా, ఒక సంస్థగా ఎంతో దూరం ప్రయాణించాము. 2002 అమెరికా సాహిత్య సదస్సునీ, 2005 తానా సమావేశాల్లో సాహిత్య సదస్సునీ విజయవంతంగా నిర్వహించాము. 2005 తానా సావనీరే కాక, స్వతంత్రంగా కొన్ని పుస్తకాలు ప్రచురించాము.
ఐతే మాకు నిజంగా ఇష్టమైన పని తెలుగు సాహిత్యాభిమానులతో ముచ్చటించడం. అందుకే, మా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభి
ఆహ్వానం
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశాలు
సెప్టెంబరు 20-21, 2008
సెయింట్ తోమా చర్చి, ఫార్మింగ్టన్ హిల్స్, మిషిగన్
ముఖ్య అతిథి:
చంద్రలత (1997 లో తానా బహుమతి పొందిన “రేగడి విత్తులు” నవలా రచయిత్రి)
కీలకోపన్యాసం:
ఆచార్య వెల్చేరు నారాయణరావు (శ్రీకృష్ణదేవరాయ ఛైర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్)
ఇతర సదస్సులు:
కథ, నవల:
చంద్రలత (మాడరేటర్), కొడవళ్ళ హనుమంతరావు, ఆరి సీతారామయ్య, మాచిరాజు సావిత్రి
కవిత్వం:
కన్నెగంటి చంద్రశేఖర్ (మాడరేటర్), వేలూరి వేంకటేశ్వరరావు, వెంకటయోగి నారాయణస్వామి, విన్నకోట రవిశంకర్
తెలుగు ప్రచురణలు:
కన్నెగంటి రామారావు (మాడరేటర్), వెల్చేరు నారాయణరావు, పారనంది లక్ష్మీ నరసింహం (పాలన), సురేష్ కొలిచాల
తెలుగు బ్లాగు సాహిత్యం, చలన చిత్ర సాహిత్యం:
పరుచూరి శ్రీనివాస్, శంకగిరి నారాయణస్వామి (మాడరేటర్లు), రవి వైజాసత్య, యర్రపురెడ్డి రామనాథరెడ్డి
ప్రతి సదస్సులోనూ చర్చకి తగినంత సమయం కేటాయిస్తున్నాము.
శనివారం రాత్రి స్వీయ కవితా పఠనం, స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన, విందు భోజనం.
వేరే ఊళ్ళ నించి వచ్చే అతిథులకి అవసరాన్ని బట్టి స్థానికుల ఇళ్ళలో బస ఏర్పాటు ఉన్నది.
ప్రవేశం ఉచితం
వివరాలు మరియు రిజిస్ట్రేషను లంకె
ఇతర సమాచారం కోసం మాలో ఒకరిని సంప్రదించండి
మద్దిపాటి కృష్ణారావు – maddipati at wayne dot edu – 248-842-7831
ఆరి సీతారామయ్య – ari at oakland dot edu – 248-366-9594
శంకగిరి నారాయణస్వామి – kottapali at gmail dot com – 248-495-7629