“వాళ్ళ తాతలు,తండ్రులు, అందరూ ఈ ఊళ్ళోనే పుట్టారు. ఈ ఊళ్ళోనే చనిపోయారు. వాళ్ళది ఈ వూరు కాకపోతే నీది మాత్రం ఈ వూరు ఎలా అవుతుంది. మీ నాన్న ఎక్కడి నుండో ఉత్తరాదినుండి ఇక్కడకు వచ్చాడు. అక్కడ ఉత్తరాదిలో ఏ వూరో కూడా నీకు తెలియదు.అట్లాగే చిన మస్తాన్ పూర్వీకులు ఎక్కడినుండి వచ్చారో మస్తానుకూ తెలీదు. నీది ఈ వూరైతే, మస్తాన్ దీ ఈ వూరే. మస్తాన్ తాతలు, తండ్రులు అందరూ స్వామివారికి నాద స్వరం తో అర్చన చేస్తూ వచ్చారు. ఖాదర్ వాళ్ళూ అంతే! మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదు” అన్నాడు రామినాయుడు.
శీర్షికలు కథలు
ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలి కేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరు కాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.
“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ కనబడు చెప్తాను. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి. నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.
ఇవేం ఆలోచించలేదు. చేతిలోవన్నీ పడేసి నేను కూడా పడిపోయాను. ఒక ఐదు నిమిషాలు ఎదురుగా కనిపిస్తున్న కేదార పర్వత సమూహాన్ని, ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతాన్ని… అక్కడక్కడ మంచుతో మాసిపోయి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ, చారబడితే ఎంత ఉపశమనం!
రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు
లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు.
“ఇవాళ మేడే!”
“అంటే?”
“అమెరికాలో, చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలనొడ్డి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు.”
“ఎవర్నువ్వు?”
“దేవుడిని. నీతో చిన్న పనుంది.”
“ఓహో… నేను అమితాబ్ బచ్చన్‌ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”
మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.
పెద్ద ఇల్లు, కార్లు, తన స్థాయికి సరిపోయే భర్త, తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు, ఇటువంటి ప్రవాస భూతల స్వర్గంలాంటి తన జీవితంలో తనను తాను మరిచిపోయి వేగంగా పరుగెత్తే జడపదార్థం ఆమె.
కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది.
‘శ్రీరమణ’ అని కాలర్ ఐడీ చూపిస్తోంది. శ్రీరమణగారేనా, ఇంకెవరైనా? ఇప్పుడు నేను ‘సార్ నమస్తే’ అన్నట్టుగా సిద్ధం కావాలా, ఎదుటివాళ్ళు మాట్లాడేదాకా ఆగి రియాక్ట్ కావాలా? కొందరు మనం హలో అనేదాకా ఏమీ మాట్లాడరు. కొందరు ఏమిటంటే ఆ చిన్న పాజ్ నిశ్శబ్దాన్ని కూడా భరించలేక వాళ్ళే ముందు మాట్లాడేస్తారు.
ధైర్య సాహసాలు, మొక్కవోని పట్టుదలలూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులు హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారన్నది కఠోర వాస్తవం. వారి కథలు తలచుకుంటే ప్రకృతి ముందు ఎంతటివారైనా తల వంచవలసిందేగదా అనిపిస్తుంది. ‘ఎంత అనుభవం ఉన్నా ప్రతి యాత్రా ఒక నూతన ప్రయత్నం. ప్రమాదభూయిష్టం.
మల్లేస్వరి వరసగా నాల్రోజులు స్కూలుకి రాపొయ్యేసరికి సారు కొట్టిన దెబ్బలకే అనుకున్నారు అబ్బాయిలంతా. అమ్మాయిలం మాత్రం తలా రెండ్రూపాయిలు యేసుకుని ఒక చిన్న గిఫ్టు కొన్నాం. పదకొండోరోజు మద్యానం పర్మిషనడిగి లంచి టైమ్లో యెల్లి గిఫ్టిచ్చి ఫోటో కూడా దిగాం. మల్లేస్వరి చీర కట్టుకుని కుర్చీలో కూచుంటే మా చిన్నప్పుడూ వాళ్ళ అమ్మ ఉన్నట్టే కనపడింది. తలనిండా కనకాంబరం పూలు పెట్టారు.
“అపచారం! అపచారం! అమ్మ గుడి తగలడిపోతోoదొరేయ్!” గుండెలు బాదుకుంటా వీధిగుమ్మంలోనే సొమ్మసిల్లి పడిపోయింది గణికమ్మ. గణికమ్మ ఇంట్లో కరెంటుబల్బు ఠక్కున వెలిగింది. ఇంట్లో జనం వీధిలోకొచ్చేరు. అందరూ గుడివైపు చూసి గుండెలమీద చరుసుకుంటూ పెడబొబ్బలు పెట్టారు. ఆ అరుపులకు ఊరు ఊరంతా లేచింది. వీధిమొగలో వేణుగోపాలస్వామి గుడిని అనుకుని ఉన్న పుంతరేవమ్మ గుడి వైపు పరుగులు పెట్టారు ఊరిజనం.
తెలుగు సాహిత్యం రాసే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ. పతంజలిగారు ఎంత బాగా రాస్తారో అంతకు కొన్ని వేలరెట్లు బాగా బాగా చదువుకున్న మనిషి. అదీ ఇదని మాత్రమే కాదు, చదవదగ్గది అనుకున్న ప్రతీదిని ఆయన ఎంత చదువుకున్నాడో లెక్కేయడానికి లెక్కేలేదు.
బాల్యం గురించి ‘నా చిన్నప్పుడు’ అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నాకు బహుశా అది ‘నిస్సహాయత’గా వినిపిస్తుంది. యవ్వనపు రోజుల్ని తలచుకుంటే మోసిన బరువులు, ఈదేసిన బాధ్యతలు మాత్రమే జ్ఞప్తికి వస్తాయి. ‘ఆ రోజులే వేరు’ అని ఏ రోజు గురించీ అనుకోబుద్ది కాదు. ఇన్ని మైలురాళ్ళూ దాటాక సాధించిన విజయం ఏమిటంటే ‘అబ్బా, ఇదంతా ఈ క్షణంలో ముగిసిపోతే బావుండు’ అనిపించకపోవడం.
నిత్యజీవితంలో మనం చూసేదీ పాల్గొనేదీ ఎడతెగని పరుగుల ప్రక్రియలో. చేయవలసిన పనులు, వాటి గడువులు, టార్గెట్లు, ఎపాయింట్‌మెంట్లు – పరుగులే పరుగులు. ఇష్టమున్నా లేకపోయిన ఆ బాణీ కార్యకలాపాలలోకి అడుగు పెట్టినపుడు మన సమయం మన చేతుల్లోంచి జారిపోతుంది. నిలబడి, స్థిరంగా ఆలోచించి ముందుకు సాగే అవకాశం కోల్పోతాం.
ఓ పెద్ద ఇంటి ముందు ఆపింది నీరూ తన ఆడీ కార్‌ని. ఆ ఇంటి గేటు మూసుంది. దానికో మూలగా ఉన్న బల్ల మీద కూర్చుని తల మొబైల్లో దూర్చి తనలోతను నవ్వుకుంటున్నాడా ఇంటి వాచ్‍మన్. నీరూ గేటుకెదురుగా ఉందని గమనించే పరిస్థితిలో లేడు. హారన్ కొట్టింది గట్టిగా. ఉలిక్కిపడి పైకి లేచాడు. ఓ చేత్తో సెల్యూట్ పెడుతూ, ఇంకో చేత్తో తలుపు నెట్టుకుంటూ మరో పక్కకి పోయాడు. వాడిని కళ్ళతోనే కాల్చేస్తూ లోపలికెళ్ళింది నీరూ.
ఆశ్రమానికి చెందిన ఒక పెద్దాయన వచ్చి యువరాజ్ భుజాలను తాకి, “రాజా సార్” అని పిలిచారు. యువరాజ్ మేల్కొని లేచి, ఏమీ అర్థం కానివాడిలా ఆయన్ను, రమణుల చిత్రపటాన్ని చూశారు. దీర్ఘ నిశ్వాసంతో తన కళ్ళను, చెంపలను తుడుచుకొంటూ, పైకి లేచి తన జుబ్బాను కిందకు లాగి సర్దుకున్నారు. ఆయన ముఖం తేటపడింది. రమణులను చూసినప్పుడు ఆయన ముఖంలో సన్నని చిరునవ్వు మొలకెత్తింది.