తెలుగు క్రియాంత భాష కాబట్టి, సాధారణంగా తెలుగు భాషా లక్షణాలను వివరించేందుకు రాసిన సంప్రదాయ వ్యాకరణంలోనైనా, ఆధునిక వ్యాకరణంలోనైనా క్రియకు ప్రాధాన్యం ఉండటం సహజం. అందువల్ల ఈ విషయాన్ని వెల్చేరుగారు మొదటగా కానీ, ప్రత్యేకంగా కానీ ‘కనిపెట్టా’రన్నట్టు చెప్పడం సబబు కాదు.

మెహక్ ఈ సంపుటి ముందుమాటలో చెప్పినట్టు రెండు ముఖ్య విషయాలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకటి – ఇతివృత్తాలు, సంవిధానం, ముగింపు భిన్నంగానే కనిపిస్తాయి. రెండు – ఇరు మతాల మధ్య సయోధ్య పెంపొందించి, వైరుధ్యాలను వెదికి వేరుచేసి, చెరిపేసే కృషి వున్న సృజనశీలత. ఈ రెండు విశేషాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి ఈ కథల్లో.

తెలుగుదారి పుస్తకం వీటన్నిటికంటే భిన్నమైన పరిస్థితుల్లో వచ్చింది. పరిమిత ప్రయోజనం కోసం ఉద్దేశించిన ఈ వ్యాకరణాన్ని సమగ్రమైన తెలుగు వ్యాకరణం అనడానికి వీల్లేదు. వ్యాకరణ పరిభాష అంతా ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు అధ్యాపకులకు కాని, విద్యార్థులకు కాని ఇది అంతగా ఉపయోగపడదు.

కాళికాంబ ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వెంటాడుతుండేవారు. ఇల్లు సోదా చేసేవారు. ఇంట్లో సామాన్లు, వండిన వంటలు, ఊరగాయలు అన్ని పాడుచేసి, చేతికి వచ్చినవి పట్టుకుపోతూ ఉండేవారు. నోటికి వచ్చినట్లు ఛండాలపు మాటలనేవారు. ఆడవాళ్ళని నానా భీభత్సంగా భయపెట్టడం, మానభంగాలు చేయడం, కొట్టడం చేసేవారని ఆమె పేర్కొన్నారు.

వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? అనుకుంటాం. పులుముకున్న చీకటి వేదనని తామే అనుభవించి మనకు చల్లని చందమామలైన వాళ్ళు కొందరు. ఈ పదిహేనుమందిలో అత్యాశతో అహంకారంతో అపకీర్తి మూటకట్టుకుపోయిన పాబ్లో ఎస్కోబార్ తప్ప తక్కినవారంతా కళాకారులే, తమ రంగాల్లో నిష్ణాతులే.

అందుకే, ఇతనికి ఇష్టమైన ఆట ప్రతీదీ ప్రశ్నించడం, చిన్నపిల్లల లాగా. ప్రతీదీ ఒక అద్భుతంలాగా, ప్రతీదాని వెనుకా ఏదో ముర్మముంది, అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత. ఎందుకు, ఎందుకు, ఎందుకు అని పిల్లలందరూ ఎడతెరపి లేకుండా అడిగే ప్రశ్నలు. తెలియనిదంతా తెలుసుకోవాలనే తపన.

నవల నిండా ఉపాఖ్యానాల ఉద్బోధ కానవస్తుంది. బావరి కథ కాని, నౌకానిర్మాణ శాస్త్రవేత్త జాలరి ఓడేసు కథ కాని, కోస్తామాండలికంలో ఒక చేపకు కారువాకి నామకరణం చేసి నిర్ధారించిన కథ కాని, నిగ్రోధుడి ఆగమనం అతడి బోధ కానీ రచయిత యొక్క విషయ సంగ్రహ ఘోరపరిశ్రమను మనకు ఎరుక పరుస్తాయి.

తెలుగుభాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించకపోవటం దురదృష్టకర పరిణామాలకు దారి తీసింది. ఒక ప్రబల ఉదాహరణ వార్తాపత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారుచేసి భాషకు విపరీతమైన అపకారం చేశారు.

కొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. అది కూడా రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది.

ఈ కవిత చివరిలో బాలుడికి ఉండే జిజ్ఞాస, చైతన్యం మనిషిలో నిరంతరం లేకపోతే ఈ ఆటని ఆడలేడని ఒకే ఒక పార్శ్వాన్ని మనకి తెలియజేసినట్లు మనకి అనిపిస్తుంది. కాని, తరచి చూస్తే, కవిత ప్రారంభంలో చెప్పిన ‘చదివి పారేసిన పుస్తకం’ అయిన ఆకాశం ఆ జిజ్ఞాస ఉన్నవాడికే తన పుస్తక రహస్యాల్ని విప్పుతుందన్నది సంజ్ఞ.

సామాజిక చరిత్ర నిర్మాణానికి కేవలం సాహిత్యం పైనే ఆధారపడవలసిన అవసరం ఉండకూడదు. కానీ సాహితీగ్రంథాలను ఆలంబన చేసుకున్నప్పుడే ఆ సమాజం గురించి సరైన అవగాహన సాధించగలుగుతున్న ఈ నేపథ్యంలో రాజగోపాల్, ఆత్మకథలను ఆధారం చేసుకుని వలసవాద సమాజాన్ని విశ్లేషించాలనుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.

భక్తి ఉద్యమం రోజుల్లో ప్రజలకి దేవుని ఉనికి మీద అచంచలమైన విశ్వాసం ఉంది. అప్పటికి శాస్త్రవిజ్ఞానం ఇంకా బాల్యావస్థలోనే ఉంది. ప్రజానీకంలో అత్యధిక భాగానికి దేవుని చూడాలని, స్మరించాలని, అందుకోవాలనీ తపన ఉంది. తమ నిస్సహాయ స్థితినుండి బయటపడటానికి సంసిద్ధత ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జీవిక ముఖ్య సమస్య.

అసలు ఏ రచన గొప్ప రచన? ఏ కథ గొప్ప కథ? ఏది సామాన్యమైన కథ? అలా చెప్పడానికి దానికి తూనికరాళ్ళేమిటి? ఏ కథైతే మన అనుభవ పరిధిలోకి వచ్చిన మన అనుభవాన్ని ఆసరా చేసుకుని మళ్ళా మళ్ళా మరోసారి మరోసారి అందులోని ఒక మాటో, ఒక వాక్యమో, కొన్ని వాక్యాలో జ్ఞాపకం వస్తూ ఉంటాయో ఆ కథ గొప్ప కథ.

పాఠకుణ్ని కథల్లోకి లాక్కెళ్ళటానికి ప్రతి రచయితకూ తనదైన ఓ మంత్రదండం ఉండాలి. దేశరాజు సొంతం చేసుకున్న ఆ మంత్రదండం: శైలి. ఉపోద్ఘాతం లేకుండా సరళసుందరమైన వాక్యాలతో నేరుగా కథను ప్రారంభిస్తాడు. సంపుటిలో మొదటి కథ ‘కమ్యూనిస్టు భార్య’లోని మొదటి వాక్యంలోనే ఆ విద్యను ప్రదర్శించాడు.

కర్ణాటక సంగీతానికి ప్రాచుర్యం తీసుకువచ్చిన దేవదాసీల గురించి పరిశోధనలు జరిగాయి. జీవిత చరిత్రలూ వచ్చాయి. కానీ అవి ఒకరిద్దరిని తప్ప ప్రతిభావంతులైన ఎంతో మందిని పట్టించుకోలేదు. వీళ్ళంతా తుదీ మొదలూ లేని అయోమయంలోకి జారిపోయారు. నవలారూపంలో అయినా వారికి మాట్లాడే కనీసపు హక్కుని ఇవ్వడానికి నేను ప్రయత్నించాను.

పుస్తకం పేరు, రచయిత పేరు తప్పా తెలిసిన సమాచారం ఏమీ చేతిలో లేదు. నా ఆదివారాలూ నా ఖాళీసమయాలూ నాకు కాకుండా పోయాయి. ఇక వెతుకులాట మొదలయింది. ఆయన బెజవాడలో డాక్టర్‌గా యే ప్రాంతంలో నివసించేవారు? యెలా వుండేవారు? వారి ఫోటో యేమైనా దొరుకుతుందా? వారి పిల్లలెవరన్నా కనిపిస్తారా?

‘మమ మాయా దురత్యయా’ అంటుంది గీత. మాయను అధిగమించడం తేలిక కాదు. అధిగమించామని అనుకున్నది కూడా నిజమో కాదో ఆఖరు క్షణం దాకా తెలిసే వీలూ లేదు. జీవితానికి కావలసినది నిత్య చింతన. బ్రతుకులోని లేతకాంతిని ఏ చీకట్లూ కమ్ముకోకుండా చూసుకోవలసిన వివేచన.

నాగరిక సమాజంలో పిల్లలతో సహా అందరి నోటిలో నానే మాటలని సందర్భానికి తగ్గట్టు ఒడుపుగా వాడుకుని తన పరవశ సంకలనంలో మానస, పాతమాటల్నే హైకూలంత పొదుపుగా వాడుకుని నది వెంట నేను సంకలనంలో వసుధారాణీ చక్కని కవిత్వాన్ని అందించారు.

ఒక పాఠకుడిగా ఝాన్సీ రాణి ప్రతి కదలికకు చలించిపోయాను. ఆవిడ ప్రేమలో పడ్డట్టే లెక్క. ఆపై, తెలివయిన గుర్రాన్ని అధీనంలో వుంచుకోడం, సకాలంలో గొప్ప వ్యూహరచన చేయడం, స్వదేశీ విదేశీ వీరులకు ధీటుగా ధైర్య ప్రదర్శన! గట్టి పట్టుదలతో తనని మోసం చేసినవారిని సైతం ఆశ్చర్యంలో పడేసే ఎత్తుగడలు! భలే మనిషి- పోనీ, భలే రాణి!

2021వ సంవత్సరానికి తానా బహుమతి గెల్చుకున్న రెండు నవలల్లో చింతకింది శ్రీనివాసరావుగారి మున్నీటి గీతలు ఒకటి. సిక్కోలు (శ్రీకాకుళం) మత్స్యకారుల జీవితాలను హృద్యంగా అక్షరబద్ధం చేసిన 210 పేజీల నవల ఇది. కేవలం జాలర్ల బతుకులను ఆధారంగా చేసుకుని రాసిన మొట్టమొదటి తెలుగు నవల.