ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు,
ఎవరున్నారు, ఎవరు లేరు
అన్నీ ప్రశ్నలే!
అయినా
ఫోటోలు లేని
ఆల్బమ్లో చేరని ఎందరో
ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు,
ఎవరున్నారు, ఎవరు లేరు
అన్నీ ప్రశ్నలే!
అయినా
ఫోటోలు లేని
ఆల్బమ్లో చేరని ఎందరో
అప్పుడెప్పుడో ఆవిరైన అత్తరు
కురుస్తోందిపుడు ఆటవిడుపుగా
కడలి అంచున నించున్నా
ఉప్పగా, నీటి శ్లోకంలా
కంటిదొన్నె కంపనంతో
పోటెత్తిన పతనాశ్రువులు
పానవట్టం మీద
కిందనుంచి పైకి
పైనుంచి కిందికి
నీటి ఉత్థానపతనం
ప్రేమించడానికి పువ్వులెందుకు?
ఒంటినిండా దండలెందుకు?
తప్పించుకోడానికి సాధుజీవుల ముసుగేసుకుని
ఆకులు, అలములతో నోరు కట్టుకుంటారు
పొద్దుటి పోపు ఘాటుకు పొలమారిన గొంతులను
సంధ్యలో శృతి చేసుకుంటారు
అందుకే, నిగ్రహం విగ్రహం వదిలి
ఎప్పుడో నిమజ్జనమైపోయింది
శరీరంబుట్టలో
మళ్ళీ తిరిగిరాని
పుట్టిన రోజులు
నిండుతూనే ఉన్నాయి
ఇంకెంత ఖాళీ ఉందో
ఎవరికి తెలుసు
కోకిల పాట వినిపించి
తురాయి చెట్టు పూసింది
జాజుల వాసన తగిలి
ఆమె జడ అల్లుకుంటోంది
ఇంద్రధనుస్సు రెక్కలమీద
కొంగలు బారు కట్టేయి
ఇదే మనిషిలో వేరే వారిని చూపించమని
అడగలేకపోయినందుకు ఆమె విచారిస్తుంది
ఇదే తరహాలో వేరే మనిషిని చూపించమని
అడగలేకపోయినందుకు కూడా ఆమె చింతిస్తుంది
స్నేహితులుగానో
రక్తబంధాలుగానో
ఆఖరికి శత్రువుగానో
ఎప్పుడో అప్పుడు
ఎక్కడో అక్కడ
పెదవులపై పేరై వెలుగుతారు
మాటల్లో నలుగుతారు
చూరునుంచి జారుతూ
మత్తుగా నానుడు వాన
కురవదు నిలవదు
నానిన గడ్డి వాసన
ఎవరిదో పిలుపు
పలకలేని మొద్దుతనం
ఆ నది ముందున్న చెట్టు మీద
వాన చినుకులా వాలిన పిట్ట
గాథా సప్త శతిలా ధ్వనిస్తోంది
కూత కూతకి గొంతు
సానబెట్టిన కత్తి అంచులా
మోగుతోంది
మాట్లాడకు
ప్రపంచం యోగనిద్రలో
మలిగింది
ఉత్తరదిక్కున
అరోరా బొరియాలిస్
మేల్కొంటోంది.
నింగికి తెలియకుండా
కొన్ని నక్షత్రాలను
తలగడ కింద దాచేదాన్ని
జాబిలి చూడకుండా
గుప్పెట నిండా
వెన్నెలను నింపుకుని
రుమాలులో మూటగట్టేదాన్ని
పులియని రొట్టెల పండుగ ముంచుకొచ్చెను
ఇక ప్రథమ ఫలముల పండుగ తప్పనిసరి కాగా
తదుపరి బూరల పండుగను సందడి కూడా ఆయెను.
ఆపైన, ప్రాయశ్చిత్తార్థ దినమునకు తావులేక
పస్కా పండుగకూ తెర తీయబడెను
ఆశీర్వాద పండుగలు అనివార్యమయ్యెను.
గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.
తెరచిన కిటికీ దగ్గర
ఎదురు చూస్తూ వుంటాను
నడికట్టు కట్టుకోకుండా,
దుస్తులు వదులుగా.
ఆ చిరుగాలులు తేలిగ్గా ఈ
పల్చని బట్టలు ఎగరగొట్టగలవు.
మిగిల్చే శూన్యాలను లెక్కగడితే
కూలిన మనిషీ
విరిగిన చెట్టూ రెండూ ఒక్కటే
మనిషి సంగతేమో కానీ
నేల ప్రతి ప్రార్థనా వింటుంది
ఎక్కడినుంచి చేదుకుందో పచ్చదనాన్ని
చిగురై కళ్ళు తెరిచింది
కొలనులో జాబిలిని
అందుకుందామని
కొమ్మ వంగుతుంది
ఆశల నది పారుతూనే ఉంటుంది
ఎక్కడ ఆనకట్ట వేయాలో
తెలుసుకోవడంలోనే ఉంది
కిటుకంతా
దీర్ఘ వృత్తాకార కక్ష్యల మార్గం
పళ్ళెం నిండా పర్వతాల ఆకృతి
దేహమంతా తీయని కన్నులు
మన్ను ఒక ముక్కగా
మిన్ను ఇంకో ముక్కగా గల
రెండు చందమామల సంగమం
నేను పాడాలనుకున్నది
ఒక్కగానొక్క పాట!
నూతిలోకి జారి
కావులో కూరుకుపోయే నీటిపిల్లిలా*
గొంతు దాటనీయవు
ఒడ్డు చేరనీయవు