ఆకాశంలో అక్కడక్కడా
తారాడే నల్లమబ్బులు
అమావాస్య రాత్రుల్లో చంద్రుడొచ్చి
చాటుగా సేదదీరే చేలాంచలం
నేలమీద రాలుపూల కొలాజ్పై
దిష్టిచుక్కలా పడ్డ నీడ
మిణుగురు సైన్యం రాకతో
వెలుతురు నదిలా మారిన లోయ
నశ్యం పీల్చిన మబ్బుతునక తుమ్ముకి
నేల రాలిన దారిచూపే చుక్క
విసుగు పుట్టి విసిరేసిన గడియారాన్ని
మళ్ళీ తీరానికి తెచ్చిన సముద్రపు అల
అంతలో, రేపటి యుద్దానికి సిద్ధంకమ్మని
లాగుతూ కొక్కేనికి తగిలించిన చొక్కా.