ఒక్కో మబ్బు తునకని
పిండి ఆరేసి
మేడ మీద ఇంద్రధనస్సు
మొలిపిస్తారు
Category Archive: కవితలు
నిన్నూ నన్నూ దాటాలని చూస్తూనే
టపటప మోగుతున్న పెదవులని
రెపరెపలాడుతున్న ఎడదలని
మాటల చివరన విడుదలని
గొంతు లోతుల్లో మార్చుకుంటూ
నటిస్తున్నాం విభ్రమని
అష్టావధానాల మధ్య
పెనంతో దోస్తీ వదలని దోశె పైన
అడుగంటిన అన్నం పైన
ఆసరా కాలేని మనుషుల పైన
చూపలేకపోయిన కోపాన్ని
చల్లారిన టీతో దిగమింగిన క్షణం
గాలి దారిమళ్ళి గాయాలు రేపినప్పుడు,
నడికడలిలో నెత్తురు పోటెత్తినప్పుడు,
పోటెత్తిన నెత్తుటిలో
కష్టాల కాగితప్పడవలు విడిచినప్పుడు-
అప్పుడు కూడా
నేను నేనుగానే ఉండేవాణ్ణి.
ఆక్రమిత భూభాగాల్లా
బతుకు సుతారాలేవీ పరిచయం లేని అడుగులకు
యుద్ధం చేయడానికి ముందుకు మున్ముందుకు
దూకక తప్పని పాదాలకు
కత్తుల కొనలకెదురేగి నిలువు నెత్తుటితో
వీరతిలకం దిద్దడం ఈనాటి ఇతిహాసమేం కాదు
నువ్వంటే…
కొంచెం అమ్మ, కొంచెం నాన్న
కొంచెం తాతయ్యలు, అమ్మమ్మ నానమ్మలూ
కొంచెం నువు పుట్టిన వూరు
ఇంకొంచెం నువు పెరిగిన ఇల్లూ…
‘మరి నా బొమ్మలూ, చాక్లెట్లూ…’
అవి కూడా.
ఎన్నోసార్లు అలానే కళ్ళప్పగించి మూగగా పరిభ్రమించాను. అన్నిసార్లూ తను మరో వైపు చూపు తిప్పుకుంది. ఎన్నో అక్షరాల మాలలు చుట్టి తన పడవలో పరిచాను. అన్నిసార్లూ తను మరో తీరానికి సాగిపోయింది. ఎన్నోసార్లు అడగకనే అగ్నిలో ప్రవేశించాను. అన్నిసార్లూ తను ఉడెకొలోన్ అద్దుకుంటూ పరవశించింది.
చలికాలం,
మంచు సరస్సు కింది
చేపలా మారేందుకు
గుహలో ఎలుగులా
మూడంకె వేసేందుకు
చీకటి నదిలో
సుషుప్తిలోకి జారేందుకు
ఊరికే ఊసుపోని నిర్వచనాలు
ఎన్ని కవితల్లో పారబోస్తావేంటీ?
తీరిక లేదనే అంటుంది తింగరి ప్రపంచం
మంచి పనే చేశావ్ ఆలస్యంగా వచ్చి!
కనీసం పదిరోజుల ముందొచ్చుంటే
నిష్టూరమాడేదాన్నేమో
నిందించేదాన్నేమో
నీకూ నాకూ మధ్య దూరాన్ని నిలదీసి
గుట్టలుగా రాలిన నా ఎదురుచూపుల ఎడారుల్లో
నిన్ను చెయ్యి పట్టుకొని చరచరా తిప్పి
కానీ
ఎప్పట్లాగా అప్పటి నేను ఎగరలేదు
మళ్ళీ చిగురవ్వలేదు…
కళ్ళు నలిపాక వాడిపోనూలేదు.
ఈసారి ఇప్పటి నేనే
మళ్ళీ కొత్తగా మోడవ్వక్కర్లేదు!
సెగలు గుండెను తాకుతున్నా
పొగలు పైబడి కమ్మేస్తున్నా
తగలబడుతున్నది నీ నమ్మకమేనని
ఎన్నటికీ అంగీకరించవు
అస్థికల రూపంలోనైనా
అది నిలిచే ఉంటుందని
ఆశగా ఎదురుచూస్తునే ఉంటావు.
ఎవరెవరినో ప్రేమిస్తావు
ఎవరెవరినో మోహిస్తావు
కనీసం కామిస్తావు
కారునల్లని మేఘమై కౌగలిస్తావు
నిజానికి ఎదుట ఉన్నది ఎవరో
నీకూ తెలియదు, వారికే తెలియనట్లే
దేనికీ ఒరుసుకపోకుండా దందెడ పికిలిపోవుడేంది? ఆ దాగుడుమూతల మర్నాగిని కనిపెట్టాలె. ఇకపై కనిపెట్టుకుని వుండాలె.
ఎప్పుడు మొదలైందో ఈ వలపట దాపట తిరిగే అగులు బుగులు? ఎవలు నాటిండ్లో కలుపు బీజం? ఆరాదియ్యాలె.
అల్లిన అనుబంధాలు
పరచిన బతుకు వస్త్రం మీద
కుట్టిన వంకర టింకర చిత్రంలా
చేతిలో పట్టుకు చూసుకుంటుంటే
పొంగే దిగులు
ఇప్పుడిక ఎలా సరిచేయనూ
నిద్రపోవడం అంటే
వాంఛలు ఆరిపోయే వాయిదాలాంటి నీ ముద్దు.
కళ్ళుమూయడం కాదని చీకటికైతే తెలుసు.
ఎన్నో అడగాలనుకున్నాను
ఆ రాత్రిని, ఈ మేఘాన్ని
ఆ స్వప్నాన్ని, ఈ మౌనాన్ని.
ఎన్నో అడగాలనుకున్నాను
సగమే తెరిచిన నీ తలపు వెనుక
తలుపు తీయని మనసును.
తెల్లవారితే అతను చెప్పే మాటకోసం
ఆమె కొన్ని రాత్రులుగా మేలుకొనే ఉంటోంది.
మిట్టమధ్యాహ్నం అయ్యింది…
అతనెందుకో ఈ మధ్య ఇచ్చిన మాటలు మర్చిపోతున్నాడు.
ఆగలేక ఎదురెళ్ళింది
“చూడు, గందరగోళంలో ఉన్నాను” అని
కాయితపు ముక్కలు చూపించాడు.
ఉన్నట్టుండి
గోడమీంచి వూగని వూయల పైకి
దాని మీంచీ వూగే చిటారు కొమ్మపైకి ఎగిరింది
పిడికెడంత బరువుకే
కిందాకా తూగిన కొమ్మచివరన
చిన్ని పిట్ట పైకీ కిందకీ సంతోషాన తేలింది
ఎవరైనా చూశారేమో బహుశా
వేగం పెరిగిన శ్వాసలనీ
వెనక సీట్లో వేడిమినీ నీరెండలో ముంగురులనీ
గోళ్ళ చివర్ల నెత్తుటి ఎరుపునీ తిరిగిపోయే తారల మెరుపునీ
పల్చగా జారిన విశ్వాసాల కొనకంటి చూపులనీ