కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను

సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను

కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.

నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!

రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…

మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్‌ విన్నాన్‌ చదివాన్‌ చదివాన్‌!

ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం

హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం

ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత

చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన

ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.

మిట్టమధ్యాహ్నం
అన్ని కిరణాలు పోగుచేసుకుని
జమ్మి చెట్టు మీద పెట్టుకున్నా
ఎవడైనా
నా జోలికొస్తే
అస్త్ర శస్త్రాలు సిద్ధం

ఇన్నాళ్ళ మౌనాన్ని వీడి
రెక్కలు విప్పుకోవాలనీ
తలపుల్ని తెరవాలనీ
ఆకాశపుటంచుల్ని తాకాలనీ ఉంది,
ఒకే ఒక్క అవకాశం నాకివ్వవూ!
ఒకే ఒక్కసారి ఈ నిప్పుని ఆర్పేయవూ!

అదే నీవై నీలోకి నువ్వు
ప్రవేశిస్తావు: తనను తాను
ఉంగరం లాగా
చుట్టుకున్న ప్రపంచంలా.

ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డును
ఎప్పుడూ కలుపుతూ నిలువెల్లా
వంపు తిరిగిన దేహం: ఒక ఇంద్ర ధనువు.

నిజానికీ అబద్ధానికీ మధ్య
సరిహద్దును గమనించలేనపుడు
నిజంగానే ఓ గట్టి ఆలోచన చేయవలసిందే

తల్లడిల్లే హృదయానికి
ఏ ఆలంబనా లేనపుడు
నిను బ్రతికించే నిర్ణయమూ తీసికోవలసిందే

రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని
అడుగుతాడు మనుమడు
నీకు నాకూ తాతలకు తాతే అతను
చూసుకుందుకు మనకు ఒక ఇల్లే
అతనికి ఎన్ని ఇళ్ళో
నువ్వు లేచేసరికే వచ్చేస్తాడు కదా
అని సర్ది చెబుతాను

ఆ ఇల్లంతటికీ మిగిలింది
ఆ మూడంతస్తుల మెట్లే.
బారగా తలుపు తీసి
బైట ఆకాశం కేసి
కళ్ళు విప్పార్చి చూసింది
ఆవెఁ.

అనంత ప్రపంచం
అంతమైంది ఇక్కడే.

చూడు
ఇదొక
ఊహల లోకం
ఆశల లోకం
నిరాశల నెగడు ముందు
కల్పనల్ని ఎగదోసుకుంటూ
పరచుకునే పొగమీద
పార్థివ హృదయాలను
మోసుకు తిరిగే లోకం!

ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…

తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?

నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశానికి తెలుసా?

దూరం
బహుశా కొలుస్తున్నావేమో
దూరం
బహుశా మోస్తున్నావేమో
దూరం
నించి బహుశా చలిస్తున్నావేమో
దూరం
నించి బహుశా నువ్వూ కదుల్తున్నావేమో…

గూడు నాదే నన్న భ్రమలో
మాయాద్వీపపు పక్షినై విహరించిన నాకు
బంధం కేవలం భావనే అన్న ఎరుక కలిగించిన నువ్వు

నీ కళ్ళలో నా నీడ కోసం
వెతికి వెతికి ఓడిపోయాక
ఇప్పుడు నా బొమ్మ ఎదురుగా నువ్వు

వర్గ ప్రాతినిధ్యపు
పక్షపాతపు చూపులేని కవిత
పుంఖానుపుంఖాలుగా సాగి
రొట్టకొట్టుడు ప్రయోగాలతో
సూక్తివాక్యాలతో
నీకు మాత్రమే సందేశమవని
కవిత ఒక్కటి చెప్తావా