రచయిత వివరాలు

పూర్తిపేరు: నాగ మురళీకృష్ణ వాడవల్లి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

జ్యోతిష్కులు భ్రమల్లోనూ, అజ్ఞానంలోనూ బ్రతుకుతున్నారని సైన్సు అంటుంది. కాదని జ్యోతిష్కులు నిజంగా భావిస్తే నిరూపించవలసిన బాధ్యత వారి మీదే ఉంటుంది. ఏది ఏమైనా మన నమ్మకాలని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే తప్పేముంది?

కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.

జ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట.

మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి.